Yashwant sinha attacks pm says govt at sixes and sevens

Yashwant Sinha attacks PM, says govt at sixes and sevens,Finance Ministry, Pranab Mukherjee, Yashwant Sinha, Manmohan Singh, Indian economy, tax reforms

Yashwant Sinha attacks PM, says govt at sixes and sevens ...

Yashwant.gif

Posted: 07/07/2012 01:43 PM IST
Yashwant sinha attacks pm says govt at sixes and sevens

Yashwant Sinha attacks PM, says govt at sixes and sevens ...

 దేశం ఆర్థిక సంక్షోభంలో పడటానికి ఆర్థిక మంత్రి మంత్రిగా ప్రణబ్ ముఖర్జీ తీసుకున్న నిర్ణయాలే కారణమన్న బలమైన సంకేతాలను ప్రధాని మన్మోహన్‌సింగ్ తన మాటలు, చేతలతో చూపిస్తున్నారని బిజెపి సీనియర్ నేత యశ్వంత్ సిన్హా వ్యాఖ్యానించారు. ప్రణబ్ ముఖర్జీ పదవి నుంచి తప్పుకున్నప్పటి నుంచి ఆ శాఖను నిర్వహిస్తున్న మన్మోహన్ వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కావటానికి ప్రణబ్ తీసుకున్న నిర్ణయాలే కారణమని చెప్పకనే చెబుతున్నాయని  విలేఖర్లతో అన్నారు. ‘ప్రధానికి ప్రణబ్‌కి పడదన్నది జగద్వితం. ఇతరత్రాఎట్లా ఉన్నా బడ్జెట్ రూపకల్పన జరుగుతున్నప్పుడు ప్రధానితో ఆర్థిక మంత్రి కనీసం ఐదు సార్లు విధిగా సమావేశమై తీరాలి. ప్రధాని అనుమతి లేకుండా బడ్జెట్ ప్రసంగంలో ఒక్క పదంకూడా చోటు చేసుకోదు. కాబట్టి ప్రధానికి తెలియకుండా ప్రణబ్ ఆయన కంటే రాజకీయంగానే కాక అనుభవ పూర్వకంగా సీనియరైనప్పటికీ తనకు తోచినట్లు బడ్జెట్‌ను తయారుచేసే వీలులేదు’అని యశ్వంత్ పేర్కొన్నారు. మాజీ ఆర్థిక మంత్రిగా తాను ఈ విషయాన్ని కచ్చితంగా చెప్పగలనని ఆయన అన్నారు.

అయితే ఈ వాస్తవాలను పక్కన పెట్టి ప్రణబ్‌ను ప్రత్యక్షంగా తప్పు పట్టకుండా సంక్షోభంలో చిక్కుకున్న ఆర్థిక వ్యవస్థను గాడిలోపెట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్టు మన్మోహన్ ఒక ఆంగ్ల దిన పత్రిక పంపిన ప్రశ్నలకు లిఖిత పూర్వకంగా తెలియచేయటం శోచనీయమని బిజెపి నేత అన్నారు. మన్మోహన్‌సింగ్ ఒక దేశ ప్రధానిగాకాక ఒక కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మాదిరి వ్వహరిస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రభుత్వం మారిపోయి కొత్త ఆర్థిక మంత్రి పదవీ బాధ్యతలను స్వీకరించినప్పుడు పాత ప్రభుత్వం లేదా ఆ ప్రభుత్వంలోని ఆర్థిక మంత్రి వైఫల్యాలను ఎండగట్టటం సహజం.  అయితే ఇప్పుడు ఇంత వరకూ తన ప్రభుత్వంలో నెంబర్‌టూగా ఉన్న వ్యక్తి పదవినుంచి తప్పుకోగానే ఆయన తీసుకున్న నిర్ణయాలే వ్యవస్థ చతికిల పడటానికి కారణమని చెప్పటం చెప్పటం ప్రధానికి తగదని యశ్వంత్ సిన్హా అభ్యంతరం తెలిపారు. యూరోపియన్ దేశాల్లో తలెత్తిన ఆర్థిక సంక్షోభ ప్రభావం భారత్‌పై లేదని అంగీకరిస్తున్న ప్రధాని స్వదేశీ సమస్యల వల్లేసంక్షోభం చోటుచేసుకుందని చెబుతున్నారు. ప్రభుత్వంలో ఏకాభిప్రాయం కుదరకపోవటం వల్లే సంస్కరణలను అమలు చేయలేకపోయినట్లు అంగీకరిస్తున్న ప్రధాని ప్రతిపక్షాల అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేయటం లేదని ఆయన విరుచుకుపడ్డారు.

ఆర్థిక సంస్కరణలకు చట్టాలతోపని లేదని చెబుతున్న ప్రధాని కార్యానిర్వాహక అధికారాలను ఎందుకు ఉపయోగించటం లేదని ఆయన ప్రశ్నించారు. రోజుకు ఇరవై కిలోమీటర్ల నిడివిన జాతీయ రహాదారి నిర్మిస్తామని చేసిన ప్రకటన అటకెక్కింది. థర్మల్ విద్యుత్ కేంద్రాలకు కావలసింత బొగ్గును సరఫరా చేయలేక చేతులేత్తెసింది. ఎన్డీఏ ప్రభుత్వం అప్పగించిన మిగులు వ్యవస్థను తరుగు వ్యవస్థగా దిగజార్చిన ఘనత యుపిఏ ప్రభుత్వానికే దక్కుతుందని బిజెపి నేత విమర్శించారు. విధాన నిర్ణయాలను తీసుకోగల స్థితిలో ప్రభుత్వం లేదన్నారు. ముందూ వెనుకా ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలు నిర్ణయాలను భాగస్వామ్య పక్షాల ఒత్తిడికి తలొంచి రద్దుచేయటం ప్రభుత్వానికి అలవాటైపోయిందని ఆయన ఎద్దేవా చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  One week time problem finish
Ec announces vice prez polls on aug 07  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Lalu prasad says he too wants to be pm

    Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more

  • Obama meets with aung san suu kyi

    Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని  కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more

  • Chandrababu meets balakrishna

    Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more

  • Samaikhyandhra activists plan chalo hyderabad

    Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్‌రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more

  • Konda surekha fire on kcr

    Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more