BJP says AIIMS is 95% complete; but 100% invisible ఎయిమ్స్ బిల్డింగ్ చోరీ: నడ్డా వ్యాఖ్యలపై కాంగ్రెస్ కౌంటర్

Madurai will never forget the betrayal of nadda and bjp congres leader

Madurai AIIMS controversy, JP Nadda on Madurai AIIMS, JP Nadda says 95% of Madurai AIIMS is completed, 95% Madurai AIIMS, Su Venkatesan, Manickam Tagore, Thoppur AIIMS, Udhayanidhi Stalin brick AIIMS Madurari, BJP, DMK, JP Nadda, madurai, madurai aiims, bjp, congress, JP Nadda, Manickam Tagore, betrayl, Madurai, Aiims, Tamil nadu, Politics

BJP chief JP Nadda, during his visit to Tamil Nadu, made this tall claim that 95 percent of the work of the Madurai AIIMS project has been completed. But little did he realise that this claim will stir up a hornet's nest in Tamil Nadu political circle. Congress MP Manickam Tagore went to ​​the site of AIIMS Madurai to verify his claim. In a veiled attack, the Congress MP tweeted that someone has stolen the building. Tagore further said that Madurai will never forget the betrayal of Nadda and BJP on AIIMS Madurai.

ITEMVIDEOS: ఎయిమ్స్ అసుపత్రి భవనాన్ని ఎవరో ఎత్తుకెళ్లారు: నడ్డా వ్యాఖ్యలపై కాంగ్రెస్ కౌంటర్

Posted: 09/24/2022 11:21 AM IST
Madurai will never forget the betrayal of nadda and bjp congres leader

తమిళనాడులోని మధురైలో 95 శాతం నిర్మించిన ‘ఎయిమ్స్‌ బిల్డింగ్‌ చోరీ’ అయ్యిందని కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ ఆరోపించారు. ఆ నిర్మాణ ప్రాంతానికి వెళ్లి పరిశీలించామని, అయితే బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్న 95 శాతం పూర్తయిన మధురై ఎయిమ్స్‌ బిల్డింగ్‌ తమకు ఎక్కడా కనిపించలేదని ఎద్దేవా చేశారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తమిళనాడులోని మధురైలో గురువారం పర్యటించారు. ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మధురై ఎయిమ్స్‌ ప్రాజెక్ట్‌ కోసం రూ.1,264 కోట్లు కేటాయించినట్లు ప్రకటించడం చాలా సంతోషంగా ఉందన్నారు.

అంతేకాదు ఏకంగా 750 పడకల ఆసుపత్రి పనులు 95 శాతం పూర్తయ్యాయని అన్నారు. స్పెషల్‌ బ్లాక్‌ కోసం అదనంగా రూ.164 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. దీంతో మొత్తంగా దాదాపుగా ఎయిమ్స్ అసుపత్రి కోసం ఏకంగా 1428 కోట్ల రూపాయలను కేంద్రం మంజూరు చేసిన విషయాన్ని వారు ఘనంగా చెప్పారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇక్కడే అసలు ట్విస్టు ఏర్పడింది. దాదాపుగా 95శాతం పనులు పూర్తైన ఎయిమ్స్ ఆసుపత్రి నిర్మాణ ప్రాంతాన్ని కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్, మధురై ఎంపీ సు వెంకటేశన్ కలిసి పరిశీలించారు. అయితే తమకు ఎక్కడా 95 శాతం పూర్తయిన ఎయిమ్స్‌ భవనం కనిపించలేదని తెలిపారు.

బహుశా అది చోరీ అయ్యి ఉంటుందని.. ఎవరో ఎయిమ్స్ అసుపత్రిని ఎత్తకెళ్లారని ఎద్దేవా చేశారు. మాజీ వైద్య మంత్రి అయిన నడ్డా, ఎయిమ్స్‌ ఆసుపత్రి 95 శాతం పూర్తయినట్లుగా అబద్ధాలు చెప్పడం చాలా ఆశ్చర్యంగా ఉందని విమర్శించారు. మీడియాతో కలిసి ఆ స్థలాన్ని సందర్శించిన ఆయన ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. మరోవైపు తమిళనాడు బీజేపీ ఉపాధ్యక్షుడు నారాయణన్ తిరుపతి దీనిపై స్పందించారు. మధురై ఎయిమ్స్‌ నిర్మాణం మొదలుపెట్టే ప్రక్రియ 95 శాతం పూర్తయిందని నడ్డా చెప్పారన్నారు. నిర్మాణ పనులు త్వరలో మొదలవుతాయని ఆయన అన్నట్లుగా ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : madurai  madurai aiims  bjp  congress  JP Nadda  Manickam Tagore  betrayl  Madurai  Aiims  Tamil nadu  Politics  

Other Articles