SC asks Bharat to include AP Govt in torture case రఘురామరాజు కేసులో ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చాలన్న ‘సుప్రీం’

Supreme court asks raghuram s son to include ap govt as respondent in torture case

Raghu Rama Krishnam Raju, Narasapur MP, YSRCP rebel MP, AP Government, RRR torture case, respondent, CBI probe, Supreme Court, Andhra Pradesh, Politics

The Supreme Court on Wednesday asked Kanumuru Bharat to include Andhra Pradesh state government in the alleged torture of his son and the Narasapur MP, K Raghurama Krishnam Raju. The court took up hearing of the petition seeking CBI probe into the alleged torture of the MP by the CID police.

రఘురామరాజు కేసులో ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చాలన్న ‘సుప్రీం’

Posted: 09/07/2022 03:28 PM IST
Supreme court asks raghuram s son to include ap govt as respondent in torture case

నర్సాపూర్ పార్లమెంటరీ సభ్యుడు, వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజును ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు త‌మ క‌స్ట‌డీలోకి తీసుకుని దర్యాప్తు సందర్భంగా ఆయనను టార్చ‌ర్‌కు గురి చేశారనీ, దీనిపై సీబీఐ దర్యాప్తున‌కు ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖ‌లైన పిటిష‌న్‌పై స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు బుధ‌వారం విచార‌ణ చేప‌ట్టింది. ర‌ఘురామ‌రాజు కుమారుడు భ‌ర‌త్ దాఖ‌లు చేసిన ఈ పిటీషన్ ను దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణ స్వీకరించిన సంగతి తెలిసిందే. కాగా, ఇవాళ ఈ పిటీషన్ ను విచారించిన న్యాయస్థానం..  ఏపీ ప్ర‌భుత్వాన్ని ప్ర‌తివాదిగా చేర్చాలంటూ ఈ సందర్భంగా పిటిష‌న‌ర్‌ను ఆదేశించింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చుందుకు 2 వారాల గ‌డువు కావాలంటూ భ‌ర‌త్ త‌ర‌ఫు న్యాయ‌వాది ఆదినారాయ‌ణ రావు సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. కోర్టు అందుకు స‌మ్మ‌తిస్తూ విచార‌ణ‌ను వాయిదా వేసింది. కాగా, అంతకుముందు ఈ పిటీషన్ విచార‌ణ సంద‌ర్భంగా భ‌ర‌త్ త‌ర‌ఫు న్యాయవాది ఆదినారాయ‌ణ‌ రావు రఘురామరాజును చిత్రహింసలు పెట్టిన విషయమై ప‌లు అంశాల‌ను కోర్టు దృష్టికి తీసుకువ‌చ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ర‌ఘురామ‌రాజును చికిత్స చేసిన వైద్యులపై కూడా ఒత్తిడి తీసుకువచ్చిందని తెలిపారు. దీంతో ఆయనను సికింద్రాబాదులోని ఆర్మీ ఆసుపత్రికి తరలించగా, అక్కడ ఆయనకు గాయాలైన విషయాలు నిర్థారణ అయ్యాయని తేలిందని తెలిపారు.

ఈ టార్చర్ కారణంగా దాదాపుగా రెండున్న‌రేళ్లుగా రఘురామరాజు తన పార్లమెంటరీ నియోజకవర్గంతో పాటు ఏపీలో అడుగుపెట్ట‌లేదని న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. కాగా, ఎంపీని రాష్ట్రంలో అడుగుపెట్టనీయకుండా రాష్ట్ర ప్ర‌భుత్వం అడ్డంకులు క‌ల్పించింద‌ని ఆయ‌న తెలిపారు. అంతేకాకుండా ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలోనే సీఐడీ క‌స్ట‌డీలోని ర‌ఘురామ‌రాజుపై టార్చ‌ర్ జ‌రిగింద‌ని, ఇలాంటి నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ప్ర‌తివాదిగా చేర్చాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆయ‌న వాదించారు. అయితే ఆదినారాయ‌ణ‌రావు వాద‌న‌తో విభేదించిన సుప్రీంకోర్టు... రాష్ట్ర ప్ర‌భుత్వ వాద‌న విన్న త‌ర్వాతే ఈ వ్య‌వ‌హారంపై సీబీఐ విచార‌ణకు ఆదేశించాలా? వ‌ద్దా? అన్న విష‌యంపై దృష్టి సారిస్తామ‌ని తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles