Arvind Kejriwal Announces Pre-Poll 'Guarantee' పేదలపై పన్నుల భారం.. పెద్దలకు మినహాయింపులా: కేంద్రం తీరుపై కెజ్రీవాల్

Aap turns focus to businessmen in gujarat third town hall by arvind kejriwal

Gujarat AAP, Arvind Kejriwal news, Arvind Kejriwal Gujarat visit, AAP revdi row, AAP freebies, Gujarat Assembly elections, Gujarat politics

In the campaign for the Gujarat Assembly elections, the Aam Aadmi Party seems to be making a concerted push to woo traders and small businessmen and industrialists. On Wednesday, AAP convener Arvind Kejriwal addressed his third town hall in 10 days with them, this time in Ahmedabad. Kejriwal had earlier held similar town halls in Rajkot and Jamnagar districts of Saurashtra, which are considered the state’s MSME hubs.

పేదలపై పన్నుల భారం.. పెద్దలకు మినహాయింపులా: కేంద్రం తీరుపై కెజ్రీవాల్

Posted: 08/11/2022 08:22 PM IST
Aap turns focus to businessmen in gujarat third town hall by arvind kejriwal

ఉచిత ప‌ధ‌కాల‌ను వ్య‌తిరేకిస్తున్న కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ తీరును దుయ్య‌బ‌డుతూ ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ విమ‌ర్శ‌లు గుప్పించారు. దేశంలోని ప్రజల సంక్షేమాన్ని కాంక్షించే ప్రభుత్వాలుగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఉండాలని రాజ్యంగంలోనే ఉందని.. దానిని విస్మరించి ప్రభుత్వం బడుగుల కోసం కాదు.. బడా బాబుల కోసం అన్నట్లుగా కేంద్రం వ్యవహరిస్తోందని ఆయన తీ్రస్థాయిలో మండిపడ్డారు. కార్పొరేట్ సంపన్నుల రుణాల‌ను రూ 10 ల‌క్ష‌ల కోట్లు మాఫీ చేసిన కేంద్రం మ‌రోవైపు పేద‌ల‌పై ప‌న్ను భారాలు మోపుతోంద‌ని కేజ్రీవాల్ మండిప‌డ్డారు. బియ్యం, గోధుమ‌ల‌ను కొనుగోలు చేసే యాచ‌కుడు, నిరుపేద సైతం ప‌న్ను చెల్లించాల్సిన పరిస్ధితి నెల‌కొంద‌ని అన్నారు.

పాలు, బెల్లంపై కూడా పన్నులు వేసి దేశంలోని అనేక మధ్యతరగతి ప్రజలను కడుపేదల జాబితాలోకి చేర్చేలా కేంద్రం చర్యలు ఉన్నాయిన ఆయన ఆగ్రహాన్ని వ్యక్తపర్చారు. అత్యంత పేద‌ల‌పైనా ప‌న్ను భారం మోపుతున్నార‌ని ఆందోళ‌న వ్యక్తం చేశారు. కేంద్ర ప‌న్నుల్లో రాష్ట్రాల వాటా త‌గ్గింపు, ఆహారోత్ప‌త్తుల‌పై జీఎస్టీ, జాతీయ ఉపాధి హామీ ప‌ధ‌కంలో 25 శాతం కోత విధించ‌డం ద్వారా స‌మ‌కూరిన నిధులు ఏమ‌వుతున్నాయ‌ని కేజ్రీవాల్ ప్ర‌శ్నించారు. పెట్రోల్‌, డీజిల్ ద్వారా ఏటా రూ 3.5 ల‌క్ష‌ల కోట్లు కేంద్రం వ‌సూలు చేస్తోంద‌ని మ‌రోవైపు సైనికుల‌కు పెన్ష‌న్ చెల్లించేందుకు కూడా నిధుల లేమిని సాకుగా చూపుతోంద‌ని కేజ్రీవాల్ దుయ్య‌బ‌ట్టారు.

ఇక ఇదే సమయంలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే ఆ రాష్ట్ర ప్రజలకు పలు హామీలను ఇచ్చింది. రాష్ట్రంలోని ప్రతీ నిరుద్యోగికి ఉద్యోగం. ఉచిత విద్య, ఉచిత వైద్య సదుపాయాలతో పాటు అనేక హామీలను కూడా ప్రకటించింది. తాజాగా గుజరాత్ లో తమ పార్టీ విజయం సాధిస్తే ఆ రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ. వెయ్యి చొప్పున అందజేస్తామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. గుజరాత్ లో ఆప్ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్న కేజ్రీవాల్.. ఇటీవల వరుసగా హామీలు ప్రకటిస్తూ వస్తున్నారు.

ఇప్పటికే పేదలకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని, గుజరాత్ లోని నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతిగా అందజేస్తామని హామీ ఇచ్చారు. గుజరాత్ లో ఎన్నికల ప్రచారంలో భాగంగా కేజ్రీవాల్ బుధవారం సమావేశం నిర్వహించారు. ‘‘గుజరాత్ రాష్ట్రంలో ఆప్ అధికారంలోకి వస్తే.. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,000 అలవెన్స్ గా అందజేస్తాం. ఇదేదో తాయిలం కాదు.. ఇది మీ హక్కు. ప్రజల సొమ్ము తిరిగి ప్రజలకే చేరాలి. స్విస్ బ్యాంకుల్లోకి కాదు..” అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. గుజరాత్ లో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలను సిద్దం చేస్తుండగా, అప్ అప్పుడే హామీలను కూడా గుప్పిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles