Calf kicks Man who beats cow with stick ఆవును కొడితే లేగ‌దూడ రియాక్ష‌న్ మామూలుగా లేదుగా..!

Man beats a cow with stick recieves immediate fruits of bad karma

man beats cow, calf kicks man, man hits cow, calf reaction, loud jump, man falls badly, man reaction, cow reaction, man hurt, Viral video, video viral

In this video going viral, you can see that some cows are visible and while a person is pushing those cows to the other side. Meanwhile, that person also starts beating a cow with a stick when a calf comes there and makes a loud jump. The calf jumps so hard that the person falls badly on the ground. It is clear from seeing that he must have got hurt more.

ITEMVIDEOS: ఆవును కొడితే లేగ‌దూడ రియాక్ష‌న్ మామూలుగా లేదుగా..!

Posted: 08/09/2022 04:20 PM IST
Man beats a cow with stick recieves immediate fruits of bad karma

సోష‌ల్ మీడియాలో ఆస‌క్తిక‌రమైన వీడియోలు ఏవైనా ఇలా పోస్ట్ చేయ‌గానే లక్ష‌ల్లో వ్యూస్‌, పెద్ద సంఖ్య‌లో లైక్స్ రాబ‌డుతుంటాయి. ఇక మూగ‌జీవాల‌కు సంబంధించిన వీడియోలూ క్ష‌ణాల్లోనే వైర‌ల్‌గా మారుతున్నాయి. సాధు జంతువుల‌ను కంటికి రెప్ప‌లా కాపాడుకునే వారు మూగ‌జీవాల‌కు ఆస‌రాగా నిల‌స్తున్న వీడియోలూ సోష‌ల్ మీడియా వేదిక‌గా నెటిజ‌న్ల ప్ర‌శంస‌ల‌కూ నోటుకుంటున్నాయి. ఒక జంతువులలోకి అత్యంత శ్రేష్ట్రమైన ప్రాణి ఏదీ అంటే ఆవు అని చెప్పక తప్పదు. దానిని హిందువులు గోమాత అంటూ ఆరాధన కూడా చేస్తారు.

అలాంటి గోమాత గురించి అనేక హైందవ పురాణాలు ఎంతో విశిష్టతను చాటుతుంటాయి. ఆ గోమాతల ప్రాముఖ్యత గురించి కొందరు ప్రవక్తలు ఎంతో బాగా చెబుతారు. గోమాతను పూజించేందుకు కూడా కల్పాలు రాయబడి ఉన్నాయని, వాటిని పంచగవ్యాలను సిద్దం చేసుకునే పూజిస్తారని కూడా చెబుతుంటారు. అలాంటి గోమాతలపై అకారణంగా దాడి చేస్తే ఏం జరుగుతుంది అన్న అనుమానాలు చాలా మందిలో కలుగుతుంటాయి. సాధు జంతువుల‌ను క్రూరంగా హింసించే ప్ర‌బుద్ధుల‌పై నెటిజ‌న్లు విరుచుకుప‌డినా.. ఆ ఘటనలు మాత్రం ఆగవు. ఇక వీటికి సమాధానం ఎందరు చెప్పినా.. చెవికెక్కని ప్రబుద్దులకు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారిన ఈ వీడియోనే బదులు చెబుతుంది.

సూటూ బూటూ వేసుకున్న ఓ వ్య‌క్తి ఆవుల‌ను తోలుతూ వాటి ప‌ట్ల దురుసుగా ప్ర‌వ‌ర్తించాడు. క‌ర్ర‌తో కొడుతూ హింసిస్తుండ‌గా ఓ లేగ‌దూడ‌కు చిర్రెత్తుకొచ్చిందో ఏమో ఒక్కసారిగా ఎగిరి అత‌డి గుండెల‌పై త‌న్నింది. లేగ‌దూడ విరుచుకుప‌డ‌టంతో కంగుతిన్న స‌ద‌రు వ్య‌క్తి దాని దెబ్బ‌కు కింద‌ప‌డ‌టంతో స్టైలిష్ కోటుకు కాస్తా బురుద అంటుకుంది. ఫిజెన్ అనే ట్విట్ట‌ర్ యూజ‌ర్ ఈ వీడియోను షేర్ చేయ‌గా ఏకంగా 37 ల‌క్ష‌ల వ్యూస్ వ‌చ్చాయి. పెద్ద‌సంఖ్య‌లో నెటిజ‌న్లు లైకులు కొడుతూ రీట్వీట్లు చేస్తుండ‌టంతో సోష‌ల్ మీడియాలో ఇది తెగ‌ వైర‌ల‌వుతోంది. ఈ తింగ‌రోడికి ఇలా శాస్తి జర‌గాల‌ని ప‌లువురు నెటిజ‌న్లు కామెంట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles