Sr NTR’s daughter Uma Maheshwari dies by suicide ఎన్టీఆర్ నాల్గవ కూతురు ఉమా మహేశ్వరి ఆత్మహత్య..

Former cm sr ntr s daughter uma maheswari found hanging at her house declared dead

NTR’s daughter, NTR’s daughter dead, who is ntr’s daughter, Kantamaneni Uma Maheswari, Uma Maheswari ntr, Uma Maheswari ntr dead, Uma Maheswari dead, nrt’s daughter uma dead, Osmania General Hospital

Kantamaneni Uma Maheswari, 55, daughter of former Chief Minister of Andhra Pradesh N.T. Rama Rao was found dead at her residence at Jubilee Hills here on Monday. Family members who alerted the police in the afternoon shifted her body to the Osmania General Hospital for post-mortem.

ఎన్టీఆర్ నాల్గవ కూతురు ఉమా మహేశ్వరి ఆత్మహత్య..

Posted: 08/01/2022 03:44 PM IST
Former cm sr ntr s daughter uma maheswari found hanging at her house declared dead

దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి, ప్ర‌ముఖ సినీ న‌టులు నంద‌మూరి తార‌క‌రామారావు నాలుగో కూతురు కంఠ‌మ‌నేని ఉమా మ‌హేశ్వ‌రి క‌న్నుమూశారు. ఇవాళ జూబ్లీహిల్స్ లోని నివాసంలో ఉమామ‌హేశ్వ‌రి తుది శ్వాస విడిచారు. ఆమె ఆక‌స్మిక మ‌ర‌ణంతో నంద‌మూరి కుటుంబంలో విషాద చాయ‌లు అలుముకున్నాయి. అమె మరణం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 52 ఏళ్ల వ‌య‌సున్న ఉమా మ‌హేశ్వ‌రి ఆత్మ‌హ‌త్యకు పాల్పడించని వార్తలు వినిపిస్తున్నాయి. గ‌త కొంతకాలంగా అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న ఉమా మ‌హేశ్వ‌రి తీవ్ర మానసిక ఒత్తిడికి గుర‌వుతున్న‌ట్లు స‌మాచారం.

ఈ క్ర‌మంలోనే ఆమె ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డి ఉంటుంద‌ని స‌మాచారం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు నాలుగో కూతురైన ఉమా మ‌హేశ్వ‌రికి ఇద్ద‌రు కూతుళ్లు సంతానం. కాగా ఇద్దరికీ వివాహాలు అయ్యాయి. అమె పెద్ద కుమార్తెకు కొన్నేళ్ల క్రితమే వివాహం చేసిన ఉమా మ‌హేశ్వ‌రి.. తన చిన్న కుమార్తెకు ఇటీవ‌లే పెళ్లి చేశారు. చిన్న కుమార్తె పెళ్లి త‌ర్వాత అనారోగ్యానికి గురైన ఉమా మ‌హేశ్వ‌రి తీవ్ర మాన‌సిన ఒత్తిడికి గురైన‌ట్లు స‌మాచారం. ఈ ఒత్తిడి త‌ట్టుకోలేకే ఆమె ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డ‌ట్లుగా స‌మాచారం.

ఉమామహేశ్వరి చిన్న కుమార్తె దీక్షిత పిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు ఆమె మృత దేహానికి ఉస్మానియా ఆసుప‌త్రిలో శ‌వ ప‌రీక్ష కోసం తరలించారు. ఉమామ‌హేశ్వ‌రి పెద్ద కుమార్తె త‌న భ‌ర్త‌తో క‌లిసి అమెరికాలో ఉంటున్నారు. త‌ల్లి మ‌ర‌ణ వార్త తెలిసిన మ‌రుక్ష‌ణ‌మే ఆమె త‌న భ‌ర్త‌తో క‌లిసి హైద‌రాబాద్ బ‌య‌లుదేరారు. ఈ క్ర‌మంలో పెద్ద కుమార్తె వ‌చ్చాకే అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించాల‌ని ఆమె కుటుంబం నిర్ణ‌యించింది. ఉమామహేశ్వరి మ‌ర‌ణ‌వార్త తెలుసుకున్న నంద‌మూరి కుటుంబ‌స‌భ్యులు, చంద్ర‌బాబు కుటుంబ స‌భ్యులు జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసానికి చేరుకున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles