Man Killed in Gun Firing at Madhapur మాదాపూర్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య

Hyderabad gun firing in madhapur realtor shot dead

realtor shot dead, DCP Sandeep, Neerus Junction, Madhapur Police Station, Ismail, Mujahiddin, Real estate disputes, Zaheerabad, Madhapur, Hyderabad, Telangana, crime

A realtor was shot dead by a group of people at Neerus Junction which falls under Madhapur Police Station limits in the early hours of Monday. The dead was identified as Ismail. According to the police, the incident took place at around 4 am on Monday. The condition of another person, Jahangir is said to be serious. Police suspect that Ismail was shot from very close range.

మాదాపూర్ లో కాల్పుల కలకలం.. రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య

Posted: 08/01/2022 10:37 AM IST
Hyderabad gun firing in madhapur realtor shot dead

హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఈ తెల్లవారుజామున కాల్పుల కలకలం చోటుచేసుకుంది. కారులో వెళ్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇస్మాయిల్‌పై మాదాపూర్ నీరూస్ సిగ్నల్ వద్ద బైక్‌పై వచ్చిన ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. కాల్పులు జరిపిన వ్యక్తిని ముజీబ్‌గా గుర్తించారు. పాయింట్ బ్లాంక్‌లో మొత్తం ఆరు రౌండ్లు కాల్చడంతో ఇస్మాయిల్ కారులోనే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇస్మాయిల్ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

ఒక్కసారిగా కాల్పులు మోత దద్దరిల్లడంతో ఆ దారిన వెళ్తున్న వాహనదారులు భయంతో వణికిపోయారు. రియల్ ఎస్టేట్ కు సంబంధించిన గొడవలే ఈ ఘటనకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. నిందితుడు ముజీబ్ కోసం గాలిస్తున్నారు. ఇదిలావుండగా ఈ ఘటనకు దారితీసిన కారణాలను బాలానగర్‌ డీసీపీ సందీప్‌ రావు తెలిపారు. మాదాపూర్‌ కాల్పుల ఘటనకు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపార వ్యవహారాలే కారణమన్నారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి ఇస్మాయిల్‌పై జిలానీ నాటుతుపాకీతో కాల్పులు జరిపాడని వెల్లడించారు.

మాదాపూర్ కాల్పుల ఘటనపై డీసీపీ సందీప్‌ రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇస్మాయిల్‌, ముజాహిద్దీన్‌ మధ్య భూవివాదం ఉందని చెప్పారు. గతంలో సంగారెడ్డిలో వీరిద్దరూ కలసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని, అయితే వారి మధ్య విభేధాలు రావడంతో ఎవరికి వారే వ్యాపారాలు చేస్తున్నారని చెప్పారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య ఓ భూమి విషయంలో తేడాలు రావడంతో వారు ‘మాదాపూర్‌ పోలిస్ స్టేషన్ పరిధిలోని నీరూస్‌ జంక్షన్‌ వద్ద మాట్లాడుకుని.. సమస్యను పరిష్కరించుకుందామని రాగా, మాటల మధ్యలో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది.

దీంతో ఇస్మాయిల్ ను ఏదో ఒకటి తేల్చుకుందామని వచ్చిన ముజాహిద్దీన్‌.. ఇస్మాయిల్ కు నచ్చజెప్పేలా మాట్లాడుతుండగానే.. ఎంతకీ వినడం లేదని ముజాహిద్దీన్ వెంట వచ్చిన జిలానీ నాటు తుపాకీతో ఇస్మాయిల్‌పై కాల్పులు జరిపాడని డీసీపీ అన్నారు. సంగారెడ్డిలో ఇస్మాయిల్‌, ముజాహిద్దీన్‌ కలిసి రియల్‌ ఎస్టేట్ చేస్తున్నారు. జహీరాబాద్‌లో భూ లావాదేవీలు గొడవకు దారితీశాయి. జిలానీపై గతంలో కేసులు ఉన్నాయి. ఇస్మాయిల్‌ వాహనంలో నలుగురు వ్యక్తులు ఉన్నారు. ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని తెలిపారు. నిందితుల కోసం నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్న డీసీపీ.. కాల్పుల్లో జహంగీర్‌కు గాయాలయ్యాయి. అతడు చికిత్స పొందుతున్నాడు’ అని పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : realtor shot dead  DCP Sandeep  Neerus Junction  Ismail  Mujahiddin  Zaheerabad  Madhapur  Hyderabad  Telangana  crime  

Other Articles