Promise of freebies by political parties a serious Issue: SC ఉచితాల‌కు చెక్.. కేంద్ర ప్ర‌భుత్వ‌ వైఖ‌రి కోరిన‌ సుప్రీంకోర్టు!

Supreme court says announcement of freebies by political parties needs to be controlled

Finance Commission, Chief Justice Ramana, Chief Justice of India, Chief Justice, NV Ramana, Election Commission of India, Kapil Sibal, Ashwini Kumar Upadhyay, Law Commission of India, freebies during election, election freebies, aam aadmi party, National Politics

Supreme Court noted that the announcement of freebies by political parties during the run up to elections needs to be controlled and asked the Central government to get instructions in the matter till the next hearing, which has been set to August 3. The bench, headed by CJI NV Ramana, said announcement of freebies by parties needs to controlled and asked how could the Election Commission "throw its hands up" in this regard.

ఉచితాల‌కు చెక్.. కేంద్ర ప్ర‌భుత్వ‌ వైఖ‌రి కోరిన‌ సుప్రీంకోర్టు!

Posted: 07/26/2022 09:27 PM IST
Supreme court says announcement of freebies by political parties needs to be controlled

ఎన్నిక‌ల్లో ఉచిత హామీల‌పై స‌ర్వోన్న‌త న్యాయ‌స్ధానం ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. ఇది చాలా తీవ్ర‌మైన అంశ‌మ‌ని ఉచితాల‌ను నిరోధించే చ‌ర్య‌ల‌పై ఓ వైఖ‌రితో ముందుకు రావాల‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని సుప్రీంకోర్టు కోరింది. ఉచితాలు, ఎన్నిక‌ల హామీల‌కు సంబంధించిన నిబంధ‌న‌లు ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళిలో ఉన్నాయ‌ని, ఉచితాల‌పై నిషేధం విధించే చ‌ట్టాన్ని ప్ర‌భుత్వ‌మే తీసుకురావాల్సి ఉంటుంద‌ని ఈసీ త‌ర‌పున హాజ‌రైన న్యాయ‌వాది కోర్టుకు నివేదించారు. ఎన్నిక‌ల మ్యానిఫెస్టో ఎలాంటి వాగ్ధానం కాద‌ని గ‌తంలో సుప్రీంకోర్టు వెలువ‌రించిన తీర్పులున్నాయ‌ని కోర్టు దృష్టికి తీసుకువ‌చ్చారు.

ఎన్నిక‌ల్లో ఉచిత హామీల‌పై కేంద్ర ఎన్నికల సంఘం వెంటనే ఓ నిర్ణ‌యం తీసుకోవాల‌ని అడిష‌న‌ల్ సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ కేఎం న‌ట‌రాజ్ పేర్కొన్నారు. ఈ విష‌యంలో త‌మ‌కు అధికారం లేద‌ని, ఈసీనే ఓ నిర్ణ‌యం తీసుకోవాల‌ని మీరు లిఖిత‌పూర్వ‌కంగా ఎందుకు ఇవ్వ‌కూడ‌ద‌ని న‌ట‌రాజ్‌ను ఉద్దేశించి ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్‌వీ ర‌మ‌ణ కోరారు. ఉచితాలపై ఎన్నికల కమీషన్ చేతులు ఎత్తివేయడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. ఉచిత  హామీలపై ప్ర‌భుత్వం త‌న వైఖ‌రిని తెలిపితే వీటిని కొన‌సాగించాలా లేదా అనేది తాము నిర్ణ‌యిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

ఉచిత హామీలు తీవ్ర‌మైన అంశ‌మ‌ని, ఈ విష‌యంలో ఫైనాన్స్ క‌మిష‌న్ కార్యాచార‌ణ‌కు దిగాల‌ని రాజ‌కీయ అంశాలు ఇమిడిఉన్నందున కేంద్ర ప్ర‌భుత్వం ఉచితాల‌పై ఓ నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని తాను భావించ‌డం లేద‌ని సీనియ‌ర్ న్యాయ‌వాది క‌పిల్ సిబ‌ల్ పేర్కొన్నారు. ఉచితాల‌పై హామీల వ‌ర్షం గుప్పించి ప‌త‌న‌మైన శ్రీలంక సంక్షోభం దిశ‌గా మ‌నం ప‌య‌నిస్తున్నామ‌ని, మ‌న ఆర్ధిక వ్య‌వ‌స్ధ కూడా కుప్ప‌కూలుతుంద‌ని ఈ అంశ‌పై పిటిష‌న్ దాఖ‌లు చేసిన న్యాయ‌వాది అశ్వ‌ని ఉపాధ్యాయ్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. దేశంలో అన్ని రాష్ట్రాలు క‌లిపి రూ . 70 ల‌క్ష‌ల కోట్ల అప్పుల్లో కూరుకుపోయాయ‌ని వివ‌రించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles