Deaf cyclist stabbed to death by a girl in road rage 15 ఏళ్ల బాలిక చేతిలో 40 ఏళ్ల వ్యక్తి హత్య.!

A deaf cyclist is stabbed to death by a 15 year old indian girl in a traffic accident

Sudama Lader, Cycling, groceries, purchase, Kankalipara area, ​​Raipur, raipur kankalipara area, Kankalipara stabbing, raipur stabbing incident, Kankalipara area, Raipur, minor girl, man stabbed in raipur, Raipur Stabbing, Chhattisgarh stabbing, Chhattisgarh, Chhattisgarh news, crime alert, Chhattisgarh crime, crime news, crime story, Crime news

A deaf cyclist is stabbed to death in a traffic accident by a 15-year-old Indian girl who was unaware he didn’t hear her say to get out of the way of her scooter. The 40-year-old man with hearing impairments was identified by police as Sudama Lader.He stopped to load groceries onto his bike and briefly blocked the road. A 15-year-old scooter rider was outraged when he didn’t hear their protests. She stabbed the deaf cyclist in the neck and left him to die on the road

హారన్ కొడుతున్నా సైడ్ ఇవ్వలేదని.. 15 ఏళ్ల బాలిక చేతిలో 40 ఏళ్ల వ్యక్తి హత్య.!

Posted: 07/26/2022 04:48 PM IST
A deaf cyclist is stabbed to death by a 15 year old indian girl in a traffic accident

సినిమాల ప్రభావమో.. లేక సీరియళ్ల ప్రభావమో తెలియదు కానీ.. చిన్నారులను నేరాలు అత్యంత అధికంగా ప్రభావం చూపుతున్నాయి.. ప్రతీ చిన్న విషయానికి వారు ఉత్ప్రేరణ పోందుతూ.. అవేశంతోనే.. అనాలోచితంగా వ్యవహరించి.. నేరాలకు పాల్పడుతున్నారు. ఇటీవల ముక్కుపచ్చలారని ఓ బాలురు.. వారిలో ఒకరి తండ్రిపై జరిగిన దాడికి పాల్పడిన వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకునే క్రమంలో నేరుగా తలపై తుపాకీతో కాల్చిన ఘటన నమోదైన విషయం తెలిసిందే. ఈ ఘటన చిన్నారుల్లో నేరప్రవృత్తిపై తీవ్రచర్చకు కూడా దారితీసిన క్రమంలో మరోకటి అలాంటి ఘటనే నమోదైంది.

రోడ్డుపై వెళ్తున్న తమకు అడ్డుగా వచ్చిన వ్యక్తిని అడ్డుతొలగాలని హారన్ కొడుతున్నా.. పక్కకు తప్పుకోలేదన్న ఆగ్రహంతో ఓ మైనర్ బాలిక 40 ఏళ్ల వ్యక్తిని నడిరోడ్డుపై కత్తితో పొడిచి చంపింది. పోడిచిన తరువాత వ్యక్తి అక్కడే కుప్పకూలిపోవడంతో హడలిపోయిన బాలిక.. తల్లిని అక్కడే వదిలేసి పారిపోయింది. తన బిడ్డ చేసిన పనిని చూసిన తల్లి కూడా హతాశురాలైంది. అసలేం జరిగిందో తెలుసుకునే లోపు జరగరాని ఘోరం జరిగిపోయింది. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌ రాజధాని నగరంలోని రాయపూర్‌లో జరిగింది.

పోలీసుల కథనం ప్రకారం.. రాజధాని రాయ్ పూర్ నగరంలోని కంకిలిపారా ప్రాంతంలో 15 ఏళ్ల బాలిక స్కూటీపై తన తల్లిని తీసుకుని వస్తోంది. ఈ క్రమంలో ఆమె ముందు సుదామా లాడెర్ (40) అనే వ్యక్తి సైకిల్ పై వెళ్తున్నాడు. మార్గమధ్యంలో అతడికి ఏదో వస్తువును కొనుగోలు చేస్తున్నాడు. దాంతో అతని సైకిల్.. కాసింత రోడ్డును జామ్ చేసింది. అతనికి వెనక వస్తున్న మైనర్ బాలిక సైకిల్‌ను దాటి ముందుకెళ్లాలన్న ఉద్దేశంతో పలుమార్లు హారన్ కొట్టింది. అయితే, బధిరుడైన సుదామాకు హారన్ శబ్దం వినిపించకపోవడంతో ఆమెకు సైడ్ ఇవ్వలేదు.

హారన్ కొడుతున్నా సుదామా తప్పుకోకపోవడంతో కావాలనే అతడు తనకు దారివ్వడం లేదని ఆమె భావించింది. దీంతో సైకిల్‌ను దాటి ముందుకెళ్లి స్కూటీ ఆపిన బాలిక తన వద్ద ఉన్న కత్తితో సుదామా గొంతులో పొడిచింది. వెంటనే అతడు కుప్పకూలిపోయాడు. దీంతో భయపడిన బాలిక తల్లిని అక్కడే వదిలేసి పరారైంది. బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles