Zomato faces flak for overcharging customers online ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డ‌ర్ చేస్తే.. జేబు గుల్లే..!

Viral post mumbai man shares food order bills from zomato and restaurant comparison triggers debate

Online food delivery, Food delivery apps, Price hike in online food delivery apps, Zomato customer, Rahul Kabra, Food Order Bills, LinkedIn, online food pricing, Restaurant Order Bill, Zomato, Zomato pricing, Swiggy, Swiggy pricing, viral, viral news, viral post

A Zomato customer from Mumbai recently took notice of it and posted it on social media, where it has now gone viral. Rahul Kabra wrote in the caption, “I am doing an apple to apple comparison to online vs offline order. Here is what I noticed – Cost for offline order – INR 512. Cost for Zomato order – INR 690 (after applied discount of INR 75). Cost escalation 34.76% per order at INR 178 = (690-512)/512.”

వైరల్ పోస్టు: ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డ‌ర్ చేస్తే.. జేబు గుల్లే..! రసవత్తర చర్చ.!!

Posted: 07/07/2022 03:36 PM IST
Viral post mumbai man shares food order bills from zomato and restaurant comparison triggers debate

ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డ‌ర్ చేస్తున్నారా.. ? అయితే మీ జేబు గుల్ల అవుతోందన్న విషయం మీకు తెలుసా.? అదేంటి ఓ వైపు రెస్టారెంటుకు వెళ్లి అక్కడ తింటే మాత్రం డబ్బులు కట్టాల్సిన పనిలేదా.? రెస్టారెంటుకు వెళ్లి తింటే వాళ్లు ఒక్క రూపాయి కూడా తగ్గించరు. అదే అన్ లైన్ ఫుడ్ డెలివరీ యాఫ్ లో అర్డర్ చేస్తే.. డిస్కౌంట్ కూపన్లు, ఆపర్లు ఇస్తారు. అంతేకాదు మనం ఇంట్లో నుంచి కదలకుండా.. మన కారు ఇంధనం ఖర్చుకాకుండా.. ట్రాపిక్ పద్మవ్యూహాలను చేధించాల్సిన పనిలేకుండా.. కూర్చున్న చోటునే.. మనకు నచ్చిన ఫుడ్ తినేయవచ్చు. అదీనూ మనకు నచ్చిన రెస్టారెంటు నుంచి అర్డర్ చేసుకుని మరీ లాగించవచ్చు అనుకుంటున్నారా..

అయితే ఒక్క క్షణం ఆలోచించాల్సిందేనట. ఆఫర్ల పేరుతో.. అసలు రేటు కంటే ఎక్కువ పెట్టి కొనాల్సి వస్తోందట. ఇదే విషయాన్ని ఒక కస్టమర్‌ ప్రూఫ్స్‌తో సహా బయటపెట్టాడు. ఆన్‌లైన్‌లో తనకు జరిగిన మోసం గురించి సోషల్‌మీడియా వేదికగా వివ‌రించాడు. రెస్టారెంట్‌కి వెళ్లి ఫుడ్ ఆర్డ‌ర్ చేసిన దానికంటే ఆన్‌లైన్‌లో బుక్ చేస్తే ఎంత ఎక్కువ చెల్లించాల్సి వ‌స్తుందో క్లియ‌ర్‌గా పేర్కొన్నాడు. ముంబైకి చెందిన రాహుల్ క‌బ్రా అనే వ్య‌క్తి లింక్‌డ్ ఇన్‌లో చేసిన పోస్టు ఇప్పుడు వైర‌ల్‌గా మారింది. ఆన్‌లైన్ ఫుడ్ డెలివ‌రీ యాప్స్‌ ఇంత మోసం చేస్తున్నాయా అంటూ నెటిజ‌న్లు షాక‌వుతున్నారు.

వివ‌రాల్లోకి వెళ్తే.. ముంబైకి చెందిన రాహుల్ క‌బ్రా అనే ఓ వ్య‌క్తి ది మోమో ఫ్యాక్ట‌రీ అనే రెస్టారెంట్ నుంచి జొమాటోలో ఫుడ్ ఆర్డ‌ర్ చేశాడు. వెజ్ బ్లాక్ పెప్ప‌ర్ సాస్‌, వెజిటెబుల్ ఫ్రైడ్ రైస్‌, మ‌ష్రూమ్ మోమో కొనుగోలు చేశాడు. ఆ టైమ్‌లో రూ.75 డిస్కౌంట్ కూపన్‌ను కూడా వినియోగించాడు. అప్పుడు అత‌ని మొత్తం బిల్లు రూ.690 అయ్యింది. కానీ అదే రెస్టారెంట్‌లో అదే ఫుడ్ సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ స‌హా అన్ని ఛార్జీలు క‌లుపుకుని రూ.512కే వ‌స్తుంద‌ని త‌ర్వాత గుర్తించాడు. అంటే సుమారు 35 శాతం ( 178 రూపాయ‌లు ) అద‌నంగా జొమాటోకు అద‌నంగా చెల్లించాల్సి వ‌చ్చింది.

ఇలా ఆన్‌లైన్ ఫుడ్ డెలివ‌రీ సంస్థ‌లు మోసానికి పాల్ప‌డుతున్నాయ‌ని.. వీటిని ప్ర‌భుత్వాలే నియంత్రించాల‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు. ఇదే విష‌యాన్ని లింక్‌డ్ ఇన్ ద్వారా రాహుల్ కబ్రా అనే కస్టమర్ చెప్పుకొచ్చాడు. రాహుల్ క‌బ్రా చేసిన ఈ పోస్టు ఇప్పుడు వైర‌ల్‌గా మారింది. త‌మ‌కు కూడా ఇలాంటి అనుభ‌వ‌మే ఎదురైంద‌ని ప‌లువురు నెటిజ‌న్లు కామెంట్స్ కూడా పెడుతున్నారు. రెస్టారెంటు ధరలను ఉన్నది ఉన్నట్లుగా తమ యాప్ లలో పోందుపర్చేందుకు బదులు ఈ యాప్ లు అధిక ధరలను ఎందుకు పోందుపరుస్తున్నాయన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. మరి రెస్టారెంట్ల రేట్లను.. జోమాటో, స్విగ్గీలు పెంచి చూపడం నేరంగా పరిగణించలేరా.? అన్న సందేహాలను వ్యక్తం చేసేవాళ్లూ లేకపోలేరు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles