Man saved cow from getting electrocuted in Punjab ప్రాణాలకు తెగించి విద్యుద్ఘాతానికి గురైన ఆవును కాపాడిన వ్యాపారి

Man saves cow from getting electrocuted internet says not all heroes wear capes

man saves cow in mansa, Shopkeeper Saves Cow From Getting Electrocuted, Cow saved in mansa, Cow, saved, electrocuted, Mansa, Mansa viral video, Punjab, social media, video viral

A man recently saved a cow from being electrocuted and a video of the incident has gone viral on social media. Sharing the CCTV footage, internet users informed that the cow was rescued from hazardous electric shock pain in Punjab's Mansa district. The animal was standing in a water-logged area, near an electric pole, when it accidentally touched the wet pole and started shivering in the pain of electric shock.

ITEMVIDEOS: ప్రాణాలకు తెగించి.. విద్యుద్ఘాతానికి గురైన ఆవును కాపాడిన వ్యాపారి.!

Posted: 07/06/2022 05:40 PM IST
Man saves cow from getting electrocuted internet says not all heroes wear capes

వర్షం పడుతున్నప్పుడు. లేదా రోడ్డుపై నీళ్లు నిలిచినప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే స్థానిక పురపాలక సంఘం అధికారులతో పాటు.. విద్యుత్ శాఖ అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. వర్షం పడే సమయంలో విద్యుత్ స్థంబాలను తాకరాదని కూడా వారు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికీ అవగాహనా రాహిత్యంతో గ్రామీణ ప్రాంత ప్రజలు.. అలా చేస్తూనే ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. ఇక ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ప్రభావంతో సామాన్య ప్రజల్లోనూ కొంత అవగాహన కలిగింది. అయితే మనుషులకు ఏమైనా చెప్పోచ్చు, కానీ మూగజీవాల సంగతేంటి.?

వర్షం పడుతున్న సమయంలో రోడ్డుపైనున్న విద్యుత్ స్థంబాలను తాకరాదని వాటికి ఎవరు చెప్పాలి. వాటికోసం ఎన్ని బోర్డులు పెట్టినా ఫలితం ఏంటీ.? మాట్లాడమే రాని మూగ జీవాలకు ఇక చదవడం ఎలా వచ్చు.? అందుకనే విద్యుత్ స్థంబాలు ఉన్న చోట దాని చుట్టూ కంచె ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. చుట్టూ నీళ్లు..మ‌ధ్య‌లో స్థంభం.. ఆ స్థంభం వ‌ద్ద‌కు వ‌చ్చిన ఓ ఆవు క‌రెంట్ షాక్‌తో గిల‌గిలా కొట్టుకుంది. ఇది చూసి ఓ దుకాణ య‌జ‌మాని చ‌లించిపోయాడు. వెంట‌నే ప్రాణాల‌కు తెగించి ఆ ఆవును కాపాడాడు. మాన‌వ‌త్వాన్ని చాటుకున్నాడు. పంజాబ్‌లో జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట‌ వైర‌ల్‌గా మారింది.

ఈ వీడియోను ‘అనామిక జైన్ ఆంబ‌ర్’ అనే యూజ‌ర్ ట్విట‌ర్‌లో షేర్ చేశారు. ఆవు ప్రమాదవశాత్తు విద్యుత్ స్తంభాన్ని తాకడంతో కరెంటు షాక్‌కు గురై కొట్టుకుంటోంది. ఆ ఆవును చూసిన‌ దుకాణదారుడు పరుగెత్తుకుంటూ వచ్చి నీట్లోకి దూకాడు. ఓ గుడ్డ‌తో ఆవు కాళ్ల‌ను క‌ట్టి లాగాడు. చుట్టుప‌క్క‌ల‌వారి స‌హాయంతో దాన్ని ప్రాణాల‌తో కాపాడాడు. ఈ వీడియో ఆన్‌లైన్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ వీడియోకు ల‌క్ష‌కుపైగా లైక్స్ రావ‌డం విశేషం. ఆ దుకాణాదారుడిని రియ‌ల్ హీరో అంటూ నెటిజ‌న్లు ప్ర‌శంసిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles