AP High Court stays Online movie ticket system జగన్ సర్కారుకు హైకోర్టులో చుక్కెదురు.. ఆన్ లైన్ టికెట్ల జీవోపై స్టే విధింపు

Andhra pradesh high court stays online movie ticket system by halting go

ap high court on online tickets, ap high court stays online tickets GO, shock to Andhra Pradesh Govt, Set back to AP Govt on online Tickets, online movie ticketing system, Book My Show, Multiplex Vijayawada Exhibitors Association, petitions, AP High Court, GO No. 69, stay order, Online movie ticket, Online movie ticket system, Andhra Pradesh High Court, YS Jagan Mohan Reddy, AP govt

The government of Andhra Pradesh headed by chief minister YS Jagan Mohan Reddy which has brought the online movie ticketing system has received a rude shock from the state High Court on Friday as it has stayed the orders. It is learned that despite the objections, the AP government has decided to sell tickets online under all circumstances.

జగన్ సర్కారుకు హైకోర్టులో చుక్కెదురు.. ఆన్ లైన్ టికెట్ల జీవోపై స్టే విధింపు

Posted: 07/01/2022 07:59 PM IST
Andhra pradesh high court stays online movie ticket system by halting go

రాష్ట్రంలో ఆన్‌లైన్‌ సినిమా టికెట్ల విధానం అమలు చేయాలని కృతనిశ్చయంతో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జగన్ సర్కారుకు చుక్కెదురైంది. జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 69పై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 69ను తాత్కాలికంగా నిలిపివేస్తూ అదేశాలను జారీ చేసింది. టికెట్ల విధానంపై స్టే విధించింది. తదుపరి విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అభ్యర్థతరాలను పక్కకునెట్టి.. రాష్ట్రంలోని సామాన్యులకు అందుబాటు ధరలో సినిమా టికెట్ లభించేలా చేయాలనుకున్న ప్రభుత్వ ప్రయత్నాలకు బ్రేక్ పడింది.

ఆన్‌లైన్‌ సినిమా టికెట్ల విధానంపై స్టే కోరుతూ దాఖలైన అనుబంధ వ్యాజ్యాలపై హైకోర్టు పలుమార్లు విచారణ జరిపింది. సినిమా టికెట్ల విక్రయంపై ప్రభుత్వం తెచ్చిన సవరణ నిబంధనలను, తదనుగుణ జీవోలను కొట్టేయాలంటూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. రాష్ట్రంలో ఆన్‌లైన్‌ సినిమా టికెట్ల వ్యవస్థను ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎఫ్‌డీసీ)కు అనుసంధానిస్తూ ప్రభుత్వం నిబంధనలను సవరించిది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ బుక్‌ మై షో, మల్టీప్లెక్స్‌ థియేటర్ల అసోసియేషన్, విజయవాడ ఎగ్జిబిటర్స్‌ అసోసియేషన్‌ హైకోర్టులో సవాల్ చేశాయి.

బుక్‌ మై షో తరఫు సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. ప్రభుత్వం 2 శాతం సర్వీస్‌ చార్జి చెల్లించాలని ఆదేశించడమే ప్రధాన అభ్యంతరమని వాదించారు. సర్వీసు చార్జి, ఇతర కన్వీనియన్స్‌ చార్జీలు కలిపితే తాము అమ్మే టికెట్‌ ధర ఎక్కువ ఉంటుందన్నారు. మల్టీప్లెక్స్‌ థియేటర్ల అసోసియేషన్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, ప్రభుత్వ ఒప్పందంలో సంతకం చేస్తే తాము కొత్త సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ఇది ఆర్థిక భారమన్నారు.

పన్నుల విషయంలో ప్రభుత్వానికి ఏ డాక్యుమెంట్‌ కావాలన్నా ఇస్తామని చెప్పారు. ప్రభుత్వ విధానం వల్ల స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోలేమని విజయవాడ ఎగ్జిబిటర్స్‌ అసోసియేషన్‌ తరఫు న్యాయవాది ఎన్‌.అశ్వనీ కుమార్‌ చెప్పారు. థియేటర్లలో ప్రభుత్వం కూర్చుంటుందని, తాము క్యాంటీన్, పార్కింగ్‌ నిర్వహణకే పరిమితం కావాలని అన్నారు. దీంతో ఇక సినిమాలను ఎలా నడిపిస్తామని ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ వేసిన ఈ పిటిషన్లపై వేర్వురుగా వాదనలు విన్న న్యాయస్థానం... జూలై 1న ఉత్తర్వులు ఇస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో ఇవాళ స్టే విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles