NCLT bench dismisses Ravi Prakash petition on TV9 టీవి9 మాజీ సీఈఓ రవిప్రకాష్ కు రూ.10 లక్షల జరిమానా.!

Setback to ravi prakash nclt says tv9 takeover legal dismisses petition

Ravi Prakash, TV9 former CEO, National Company Law Tribunal NCLT, Bhaskara Pantula Mohan, Binod Kumar Sinha, Hyderabad Bench, petition, oppression, mismanagement, TV9 management, NCLT, Law Tribunal, Hyderabad, company law

A panel comprising of Bhaskara Pantula Mohan and Binod Kumar Sinha of the Hyderabad Bench of the National Company Law Tribunal (NCLT) on Wednesday dismissed a petition complaining of oppression and mismanagement by the management of TV9.

టీవి9 మాజీ సీఈఓ రవిప్రకాష్ కు రూ.10 లక్షల జరిమానా.!

Posted: 06/16/2022 06:59 PM IST
Setback to ravi prakash nclt says tv9 takeover legal dismisses petition

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన పిటీషన్ ను విచారించిన జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ) హైదరాబాద్ బెంచ్ షాకిచ్చింది. ఆయన పెట్టుకున్న పిటిషన్‌ను కొట్టేసివేసిన లా ట్రిబ్యూనల్ ఆయనకు రూ. 10 లక్షల జరిమానా విధించింది. టీవీ9కు చెందిన ఏబీసీ ప్రైవేటు లిమిటెడ్ వాటాల కొనుగోలులో అక్రమాలు జరిగాయని, సంస్థను స్వాధీనం చేసుకున్న వారిని నియంత్రించాలంటూ రవిప్రకాష్, కేవీఎన్ మూర్తి పిటిషన్ దాఖలు చేశారు. సుదీర్ఘ వాదనల అనంతరం ట్రైబ్యునల్ నిన్న తీర్పు వెలువరించింది.

రవిప్రకాష్ సహా కేవీఎస్ మూర్తి దాఖలు చేసిన పిటీషన్ ను విచారించిన లా ట్రిబ్యూనల్ టీవీ9 వాటాల కొనుగోలులో ఎలాంటి అవకతవకలు జరగలేదని, అన్నీ చట్టబద్ధంగా జరిగాయని తేల్చి చెప్పింది. భాస్కర పంతుల మోహన్, బినోద్ కుమార్ సిన్హాలతో కూడిన ట్రిబ్యూనల్.. టీవీ 9 వాటాలు కొనుగోలు చేసిన జూపల్లి జగపతిరావు, ఇతర డైరెక్టర్లను ఇబ్బంది పెట్టేందుకు రవిప్రకాష్ చేసిన చర్యలు అనైతికమని పేర్కొన్నారు. వాటాల విక్రయ ఒప్పందం రవిప్రకాష్ కు కూడా తెలిసే జరిగిందని, అందులో ఆయన కూడా భాగమేనని పేర్కొంటూ.. ప్రతివాదులకు రూ.10 లక్షలు చెల్లించాలని ట్రైబ్యునల్ ఆదేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bhaskara pantula mohan  nclt bench  ravi prakash  tv9  Law Tribunal  Hyderabad  company law  

Other Articles