Revanth Reddy Slams TRS Government over Law and order పోలీసు వాహనంపై అర్థనగ్నంగా యువకుడు.. అద్దాలు ధ్వంసం.!

Tpcc chief revanth reddy slams trs government over law and order in old city

TPCC Chief Revanth Reddy, Revanth Reddy Twitter, Revanth Reddy Slams TRS Government, Law and Order in Hyderabad old city, Revanth Reddy, TPCC ChIef, TRS Government, Law and Order, Twitter, Asif Nagar, weed, goons, Police patrolling car, Hyderabad Police, Crime

TPCC Chief Revanth Reddy Slams TRS Government over Law and order in Old city, sharing a video and stating that the Police hands are being tied up by the government, and the situation became more worse where the goons in inebriated stage vandalising the police car.

ITEMVIDEOS: పోలీసు వాహనంపై అర్థనగ్నంగా యువకుడు.. అద్దాలు ధ్వంసం.!

Posted: 06/14/2022 01:49 PM IST
Tpcc chief revanth reddy slams trs government over law and order in old city

హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా అభివృద్ది చెందుతున్న తరుణంలోనే.. మత్తుకు కూడా అడ్డాగా మారిందా? యువకులు మత్తుకు బానిసలు అవుతున్నారా? ఆ మత్తులో జోగుతూ వారు దారుణాలకు పాల్పడుతున్నారా? అంటే హైదరాబాద్ లో వరుసగా జరుగుతున్న ఘటనలతో అవుననే సమాధానమే వినిపిస్తున్నాయి. జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ ఘటన దేశ వ్యాప్తంగా సంచలవమైంది. ఆ ఘటన వెలుగుచూసిన తర్వాత వరుసగా మైనర్ల అత్యాచార ఘటనలు వెలుగుచూశాయి. అయినా మత్తుపదార్థాల సరఫరాపై పోలీసుల చర్యలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి.

అందుకు వెలుగులోకి వచ్చిన తాజా వీడియోనే సాక్ష్యంగా నిలుస్తోంది. ఆసిఫ్‌నగర్‌లో పోలీసు వాహనంపైనే అర్ధరాత్రి యువకులు హల్​చల్ చేశారు. గంజాయి తాగిన యువకులు.. మత్తులో రెచ్చిపోయారు. పోలీసులపైనే తిరగబడ్డారు. ఏకంగా పోలీసు వాహనంపైకి ఎక్కి వీరంగం వేశారు. కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఏకంగా పోలీసు వాహనంపై ఉండే లైట్లపైనే అర్థనగ్నంగా కూర్చోని వీరంగం సృష్టించాడు. పోలీసులు కారును నడుపుతుండగా, యువకుడు రెండు చేతులు ఎత్తి.. అడ్డు వస్తున్న వాహనాలను పక్కకు జరగాల్సిందిగా కూడా బెదిరించాడు.

ఈ ఘటనపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఈ దృశ్యం మన హైదరాబాద్ లోనే అంటూ ఆ వీడియోను ట్వీట్ చేశారు. మత్తులో యువకులు పోలీసుల వాహనాన్నే ధ్వంసం చేశారని రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో హత్యలు, అత్యాచారాలు నిత్యకృత్యం అయ్యాయన్నారు. మద్యం మత్తులో హత్యలు, అత్యాచారాలు దాటి.. పోలీసు వాహనాలపై దాడులు చేసే స్థాయికి పరిస్థితి వచ్చిందని రేవంత్ రెడ్డి ఫైరయ్యారు. కేసీఆర్ పాలనకు ఇది నిదర్శనమన్నారు. ఈ హైదరాబాద్ నగరాన్ని.. ఈ పాలనను ఇలాగే వదిలేద్దామా..!? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణలో జ‌రుగుతున్న దారుణాలపై పౌర సమాజం ఆలోచన చేయాలన్నారు రేవంత్ రెడ్డి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles