BJP suspends MLA Shobharani Kushwaha for cross-voting కాంగ్రెస్‌కు ఓటేసిన బీజేపీ ఎమ్మెల్యే.. పార్టీ నుంచి బహిష్కరణ

Rajya sabha polls 2022 rajasthan mla shobharani kushwaha suspended for cross voting

BJP MLA, Ashok Gehlot, Rajya Sabha Elections, Shobharani Kushwaha, Subhash Chandra, Rajasthan Rajya Sabha Elections, Rajasthan, Politics

The BJP was assured for one seat but it was also backing media baron Subhash Chandra hoping for some cross-votings from rebel Congress MLAs. However, Rajasthan CM Ashok Gehlot took the matter in his hand and made sure that his flock remained united. Instead, he managed to create fissures in the BJP rank by triggering cross-voting in favour of the Congress candidate.

కాంగ్రెస్‌కు ఓటేసిన బీజేపీ ఎమ్మెల్యే.. పార్టీ నుంచి బహిష్కరణ

Posted: 06/11/2022 12:37 PM IST
Rajya sabha polls 2022 rajasthan mla shobharani kushwaha suspended for cross voting

రాజ్యసభ ఎన్నికలలో పార్టీలు తమ అభ్యర్థుల గెలుపుకోసం ఎన్నిరకాల జిమ్మికులు చేస్తాయన్నది స్పష్టమైంది. ఓ పార్టీ ఓ రాష్ట్రంలో తమ అభ్యర్థి గెలుపు కోసం చేసిన పనిని సమర్థించుకోగా, అదే పనిని మరో రాష్ట్రంలో తమ ఎమ్మెల్యే చేయగా, దానిని తీవ్రంగా పరిగణించింది. మొత్తానికి రాజ్యసభ ఎన్నికల సాక్షిగా సాగిన రాజకీయ పార్టీల ఎత్తుగడలు, ప్రలోభాలు అధికంగా కేంద్రంలోని అధికార పార్టీకే అనుకూలించాయన్నది కాదనలేని సత్యం. అయితే రాజ్యసభలోనూ తమ పార్టీ అధిపత్యం కోసం పోటీ పడిన పార్టీలన్నీ ఎత్తుగలను పరిశీలిస్తే.. ఒకే టాను ముక్కలు మాదిరిగానే కనబడ్డటం గమనార్హం.

రాజస్థాన్‌ రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడ్డారు. దీంతో ఆ ఎమ్మెల్యేపై బహిష్కరణ వేటు వేసింది. ఏడు రోజుల్లో వివరణ ఇవ్వాలని షోకాజ్‌ నోటీస్‌ ఇచ్చింది. రాజస్థాన్‌లో నాలుగు రాజ్యసభ స్థానాలకు శుక్రవారం ఎన్నికలు జరిగాయి. సరైన బలం లేనప్పటికీ అధికార కాంగ్రెస్‌ పార్టీ ముగ్గురు అభ్యర్థులను బరిలో నిలిపింది. బీజేపీ తరఫున ఇద్దరు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అయితే ప్రతిపక్షానికి చెందిన ధోల్పూర్‌ ఎమ్మెల్యే శోభా రాణి కుశ్వాహా పార్టీ విప్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రమోద్‌ తివారీకి ఓటు వేశారు.

దీంతో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తన ముగ్గురు అభ్యర్థులులైన రన్‌దీప్‌ సుర్జేవాలా, ముకుల్‌ వాస్నిక్‌, ప్రమోద్‌ తివారీ గెలిపించుకోగా, బీజేపీ ఒక స్థానంతోనే సరిపెట్టుకున్నది. దీంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. తనపై ఎందుకు చర్యలు తీసుకోవద్దో వారంరోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులు జారీచేశారు. 2020లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కూడా బీజేపీ ఎమ్మెల్యే రాణి కుశ్వాహా ఇదే తరహాలో క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడ్డారు. అప్పడు కూడా కాంగ్రెస్‌ అభ్యర్థికి ఓటువేశారు. అయితే కావాలని ఓటేయలేదని, పొరపాటు జరిగిందని చెప్పటడంతో అప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోకుండా వదిలేశారు. అయితే ఇప్పుడు కూడా అదేతరహాలో కాంగ్రెస్‌కు ఓటేయడంతో బీజేపీ పార్టీ నుంచి వేటువేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles