E-bike battery explodes at Siddipet of Telangana సిద్దిపేటలో ఎలక్ట్రిక్‌ బైక్ బ్యాటరీ పేలుడు.. బాధితుడి ఇల్లు దగ్ధం

E bike battery explodes while it s charging torches victims house

electric scooter, EV fire, EV,electric vehicle, ev battery explosion incident, electric bike catches fire in dubbaka, electric bike catches fire in siddiepet, EV scooter, battery charging, durgaiah, putta laxmi narayana, exploded, house gutted with fire, pedda chikodu, dubbaka, siddipet, Telangana, Crime

Another electric vehicle (EV) burst into flames in Telangana, this time in Cheif Minister's Hometown Siddipet, No injuries or casualties were reported, but the victims house was torched and is gutted with fire as a result. The vehicle was from Pure EV, a company which had recently announced its decision to recall 2,000 vehicles after instances of their scooters’ exploding. In one such instance, an 80-year-old man died in Telangana’s Nizamabad, for which police booked Pure EV.

సిద్దిపేటలో ఎలక్ట్రిక్‌ బైక్ బ్యాటరీ పేలుడు.. బాధితుడి ఇల్లు దగ్ధం

Posted: 06/08/2022 11:47 AM IST
E bike battery explodes while it s charging torches victims house

ఎలక్ట్రిక్ వాహనాలు... పెట్రోల్ ధరలు అంతకంతకూ పెరిగిపోతూ.. ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో పెట్రోల్ కు ప్రత్యామ్నాయంగా వచ్చిన వాహనాలే ఎలక్ట్రిక్ వాహనాలు. అత్యల్ప దరతో ఏకంగా వంద నుంచి 130 కిలోమీటర్ల వరకు ఒక్కసారి చార్జించ్ తో తిరిగేయవచ్చు. దీంతో అనేక మంది ఈ ఈవీ బైకులను కొనుగోలు చేశారు. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈవీ బైకులు, డబ్బులెట్టి కోనుక్కున్న బాంబులని అవి యజమానులనే టార్గెట్ చేసుకుని పేలుతుంటాయని జోకులు కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అందుకు కారణం ఈ వాహనాల బ్యాటరీలు పేలి.. మంటలు వ్యాపించడమే.

పలు ఘటనల్లో వాహనదారుల ఇళ్లు, దుకాణాలు బూడిదై.. కేవలం వంటి మీద బట్టలు మాత్రమే మిగిలాయి. ఇక మరికొన్ని ఘటనల్లో ఇల్లు, ఆస్తి సహా ఇంటి సభ్యులు కూడా దూరమవుతున్నారు. తమిళనాడులో ఓ తండ్రీకూతుళ్లు, నిజామాబాద్, బెంగళూరు, ఇలా దేశంలోని ప్రతీ ప్రాంతంలో ఓ ఈవీ పేలిన ప్రమాదం నమోదవుతూనే ఉంది. బైక్ పేలిన ఘటనలో పలువురు మృతిచెందిన ఘటనలు సైతం నమోదు కావడంతో ఎలక్ట్రిక్ బైకుల జోలికి వెళ్లేందుకు కూడా ఇతరులు జంకే పరిస్థితులు ఉత్పన్నమయ్యేలా చేస్తున్నాయి.

తాజాగా పెద్దచీకోడులో పుట్ట లక్ష్మీనారాయణ అనే వ్యక్తి కొద్దిరోజుల కింద ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేశాడు.ఈ మధ్య చర్చనీయాంశమవుతున్నాయి. మైలేజ్ ఎక్కువ అంటూ మార్కెట్ లోకి వచ్చిన ఈ వాహనాలను కొనేందుకు చాలా మంది ఆసక్తి చూపారు. అయితే పలుచోట్ల ఎలక్ట్రిక్‌ వాహనాలు, బ్యాటరీల పేలుళ్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఇంధన ధరలకు ప్రత్యామ్నాయంగా కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ఈ వార్తలు... గుబులు పుట్టిస్తున్నాయి. తాజాగా సిద్ధిపేట జిల్లాలో చార్జింగ్‌ పెట్టిన ఓ ఎలక్ట్రిక్‌ వాహనంలోని బ్యాటరీ పేలింది. ఈ ఘటనలో ప్రాణ నష్టం లేకపోయినప్పటికీ ఇల్లు పూర్తిగా దగ్ఘమైంది.

ఈ పేలుడు ఘటన సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక మండలంలో జరిగింది. పెద్ద చీకోడు గ్రామంలో పుట్ట లక్ష్మీనారాయణ అనే వ్యక్తి దుర్గయ్య అనే వ్యక్తి ఇంటి ముందు మంగళవారం రాత్రి ఎలక్ట్రిక్‌ స్కూటీని పార్క్‌ చేశారు. అక్కడే ఛార్జింగ్ కూడా పెట్టారు. చార్జింగ్ ఫుల్ కావటంతో అర్దరాత్రి సమయంలో బైక్ ఒక్కసారిగా పేలింది. పెద్దశబ్దం రావడంతో ఇంట్లోని సభ్యులు బయటకు వచ్చారు. ఈ క్రమంలో స్కూటీ నుంచి మంటలు చెలరేగి పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఇల్లు కూడా పూర్తిగా దగ్ధం అయింది. ఇంట్లో ఉన్న వాళ్లు బయటికి రావటంతో ప్రాణ నష్టం తప్పింది. అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేయడంతో వారు అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles