Kerala confirms two cases of Norovirus in children కేరళ తిరువనంతపురంలో కలకలం రేపుతున్న నోరా వైరస్

Norovirus two cases confirmed in kerala distinct symptoms to watch out for

Norovirus, Kerala, Virus, norovirus symptoms, norovirus kerala, norovirus meaning, norovirus malayalam, norovirus treatment, what is norovirus, norovirus in kerala, norovirus causes, norovirus upsc, norovirus transmission, kerala food poisoning,food poisoning,norovirus,wayanad norovirus news,kerala norovirus,norovirus outbreak,kerala norovirus news

The Kerala government on Sunday confirmed two cases of Norovirus in children. Said to be 'highly contagious', the Norovirus spreads through contaminated water and food. In view of the aggressive nature of the virus, the Kerala government has urged people to maintain hygiene.

కేరళ నోరా వైరస్ కలకలం.. ఇద్దరు పాఠశాల విద్యార్థులకు సోకిన మహమ్మారి

Posted: 06/06/2022 12:24 PM IST
Norovirus two cases confirmed in kerala distinct symptoms to watch out for

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి కేసుల సంఖ్య గత రెండు రోజులుగా నాలుగు వేలకు పైగా కొనసాగుతూ.. ఓ వైపు అందోళన రెకెత్తుతున్న తరఉణంలో కేరళలో మరోసారి మరో మహమ్మారి కలకలం రేగుతోంది. ప్రకృతి సోంతరాష్ట్రంగా అభివర్ణించబడే ఈ రాష్ట్రంలో తాజాగా ఇద్దరు చిన్నారులు నోరా వైరస్ బారిన పడ్డారు. అత్యంత వేగంగా వ్యాప్తిచెందగల నోరా వైరస్ లక్షణాలు కనబడటంతో అసుపత్రికి తరలించగా వారిలో లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. తిరువనంతపురంలో ఇద్దరు పాఠశాల విద్యార్థులకు నోరో వైరస్ సోకిందని కేరళ వైద్యాధికారులు ధ్రువీకరించారు.

డయేరియా-ప్రేరేపిత రోటా వైరస్ మాదిరిగానే ఉన్న ఈ వైరస్ సోకిన పిల్లలకు సకాలంలో చికిత్స చేయకపోతే ప్రాణాంతకం కావచ్చని వైద్యులు హెచ్చరించారు. కలుషిత నీరు, ఆహారం ద్వారా నోరో వైరస్ వ్యాప్తి చెందుతోందని, నివారణకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రాంతంలో నీటి పరిశుభ్రతపై సరైన చర్యలు తీసుకుంటే వ్యాధిని అదుపు చేయవచ్చని అధికారులు చెప్పారు. నోరా వైరస్ చాలా ప్రమాదకారని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ సూచించారు. ప్రస్తుతం వైరస్ బారినపడ్డ ఇద్దరు చిన్నారుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆమె పేర్కొన్నారు.

అస్వస్థతకు గురైన చిన్నారులకు తొలుత ఫుడ్ పాయిజనింగ్ అయినట్టు భావించారు. కానీ, వైద్య పరీక్షల్లో నోరో వైరస్ నిర్దారణ అయ్యింది. పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత పిల్లలకు ఈ లక్షణాలు కనిపించాయని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. నోరో వైరస్ సోకిన బాధితులు వాంతులు, విరేచనాలు, తలనొప్పి, ఒళ్లు నొప్పుల వంటి లక్షణాలతో బాధపడుతుంటారు. కొన్ని సందర్భాల్లో శరీరంలోని నీటిశాతం తగ్గిన నిర్జలీకరణానికి దారితీస్తుంది. కలుషిత ఆహారం, నీరు వల్ల ఈ వైరస్ వ్యాప్తిచెందుతుంది. మలవిసర్జన తర్వాత సబ్బుతో పదేపదే చేతులు కడుక్కోవడం వంటి జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles