Om Prakash Chautala gets 4-year jail term in DA case మాజీ సీఎం ఓం ప్ర‌కాశ్ చౌతాలాకు మళ్లీ నాలుగేళ్ల జైలు శిక్ష

Delhi court sentences ex haryana cm om prakash chautala to 4 years imprisonment

Om Prakash Chautala, Chautala jailed, OP chautala sentencing, Haryana CM chautala jail, Om Prakash Chautala, Om Prakash Chautala jail, Om Prakash Chautala scam, Om Prakash Chautala sentenced, Haryana, CBI court, CBI court sentences Om Prakash Chautala, Central Bureau of Investigation, Haryana, crime

A Delhi court on Friday awarded four years’ imprisonment to former Haryana chief minister Omprakash Chautala for amassing assets more than his income. Special judge Vikas Dhull also fined Chautala with ₹50 lakh and directed to seize four of his properties.

మాజీ సీఎం ఓం ప్ర‌కాశ్ చౌతాలాకు మళ్లీ నాలుగేళ్ల జైలు శిక్ష

Posted: 05/27/2022 05:22 PM IST
Delhi court sentences ex haryana cm om prakash chautala to 4 years imprisonment

హ‌ర్యానా మాజీ ముఖ్యమంత్రి, ఇండియ‌న్ లోక్ ద‌ళ్ మాజీ అధ్య‌క్షుడు వృద్దనేత ఓం ప్రకాశ్ చౌతాలా మరోమారు కారాగారవాసానికి వెళ్లనున్నారు. ఇటీవలే ఆయన ఉపాధ్యయుల అక్రమ నియామకాల కేసులో జైలు శిక్షను అనుభవించి.. విడుదలయ్యారు. కాగా, తాజాగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష ఖ‌రారైంది. ఈ శిక్ష‌తో పాటు ఆయ‌న‌కు రూ.50 ల‌క్ష‌ల జ‌రిమానాను విధిస్తూ ఢిల్లీ కోర్టు శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. ఈ కేసులో చౌతాలాకు చెందిన నాలుగు ఆస్తుల‌ను కూడా స్వాధీనం చేసుకోవాల‌ని కోర్టు అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది.

హ‌ర్యానాలో అర్హ‌త లేని వారిని ఉపాధ్యాయులుగా నియ‌మించార‌న్న కేసులో ఇప్ప‌టికే దోషిగా తేలి ప‌దేళ్ల పాటు జైలు జీవితం గ‌డిపి ఏడాది క్రిత‌మే చౌతాలా విడుద‌ల‌య్యారు. ఈ క్ర‌మంలో ఇంత‌కుముందే ఆయ‌న‌పై దాఖ‌లైన ఆదాయానికి మించి ఆస్తులు కూడ‌బెట్టార‌న్న కేసులోనూ విచార‌ణ వేగం పుంజుకుంది. ఈ క్ర‌మంలో గ‌త వార‌మే విచార‌ణ‌ను ముగించిన కోర్టు... చౌతాలాను దోషిగా తేల్చిన సంగ‌తి తెలిసిందే. తాజాగా శుక్ర‌వారం ఈ కేసులో చౌతాలాకు శిక్ష ఖ‌రారు చేస్తూ కోర్టు తీర్పు చెప్పింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles