Konaseema becomes volatile over renaming ఉద్రిక్తంగా కోనసీమ.. 144 సెక్షన్ విధింపు.. ఇంటర్నెట్ సేవలు బంద్..

Ap restrictions imposed after violent protests against renaming konaseema district

Konaseema Zilla Sadhana Samithi,Chandrababu Naidu, Dr BR Ambedkar, Konaseema, Nara Lokesh, Telugu Desam Party TDP, YSRCP, Minister Vishwaroop, Mummadivaram MLA, Ponnada Satish Kumar, Andhra Pradesh, Politics

The Konaseema District Administration on Wednesday imposed section 144, ceased the movement of public transport, and suspended the internet service after the protesters set ablaze an Andhra Pradesh minister’s house opposing the proposed renaming of the Konaseema district as BR Ambedkar Konaseema district.

ఉద్రిక్తంగా కోనసీమ.. 144 సెక్షన్ విధింపు.. ఇంటర్నెట్ సేవలు బంద్..

Posted: 05/25/2022 02:26 PM IST
Ap restrictions imposed after violent protests against renaming konaseema district

కోనసీమ జిల్లా పేరును డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాగా మార్చుతూ జీవో విడుదల చేయడంతో చేపట్టిన ఆందోళనలను ఉద్రిక్తతకు దారితీసిన విషయం తెలిసిందే. కోనసీమ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించేందుకు వస్తామని చెప్పిన కొందరు.. తమ అనుచరులతో కలసి ఏకంగా 3500 మంది చేరుకుని విధ్వంసం సృష్టించారు. మంత్రి విశ్వరూప్.. ఎమ్మెల్యే సతీష్ లకు చెందిన నివాసాలను దగ్ధం చేశారు. కోనసీమ జిల్లాకు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు పెట్టడంపై రాజుకున్న నిరసనలు హింసామార్గంలో పయనించడంతో శాంతిభద్రతల సమస్య తలెత్తింది.

ఉద్రిక్తతలను అదుపుచేసేందుకు భారీ సంఖ్యలో జిల్లా వ్యాప్తంగా మోహరించిన పోలీసులు.. ఎక్కడికక్కడ ఆంక్షలను విధించారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ ను అమలుచేయడంతో పాటు పోలీస్‌ యాక్ట్‌ 30ని అమలు చేస్తున్నారు. ఘర్షణలకు కేంద్రమైన అమలాపురంని పోలీసులు పూర్తిగా తమ అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి అల్లర్లు జరుగకుండా భారీగా బలగాలను మోహరించారు. పట్టణంలో ఇంటర్నెట్‌ సేవలను పూర్తిగా నిలిపివేశారు. బస్సు సర్వీసులను నిలిపివేశారు. సున్నితమైన ప్రాంతాల్లో పరిస్థితులను సీనియర్ ఐపీఎస్‌ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ర్యాలీలు, నిరసనలు, బహిరంగ సభలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.

కాగా, ప్రస్తుతం పరిస్థితులు అదుపులో ఉన్నాయని అధికారులు వెల్లడించారు. కొనసీమ జిల్లా పేరును డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మారుస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందుకు సంబంధించి ప్రజల నుంచి అభ్యతంరాలను స్వీకరించేందుకు నెల రోజుల సమయం కేటాయించింది. అయితే పేరును మారమార్చొద్దంటూ కోనసీమ జిల్లా సాధన సమితి అమలాపురంలో నిర్వహించిన భారీ ఆందోళనా కార్యక్రమం అదుపుతప్పింది. ఒక్కసారిగా జనం పెద్దసంఖ్యలో గుమ్మిగూడేసరికి శాంతియుతంగా కొనసాగిన అందోళన హింసాత్మకంగా మారింది.

మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ఇండ్లకు నిప్పు పెట్టిన అందోళనకారులు.. అడ్డుకున్న పోలీసులపై రాళ్ల దాడులు చేస్తూ.. బస్సులకు సైతం నిప్పు పెట్టారు. దీంతో భారీ సంఖ్యలో మోహరించిన పోలీసులు పరిస్థితులను సమీక్షించారు. కొంత సమయం పాటు శ్రమించిన తరువాత పరిస్థితిని తమ అదుపులోకి తీసుకన్నారు. కాగా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అమలాపురంలో ఇంటర్‌నెట్ సేవలను నిలిపివేశారు. అన్ని నెట్‌వర్క్‌లకు సంబంధించిన ఇంటర్‌నెట్‌ సేవలను పూర్తిగా నిలిపివేశారు. పరిస్థితులు చక్కబడేవరకు ఇది అమల్లో ఉంటుందని అధికారులు చెప్పారు.

కోనసీమ ఘటనపై రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కీలక విషయాలు వెల్లడించారు. ఏలూరు డీఐజీ, ఎస్పీలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించిన ఆయన... తాజా పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. ఇందుకు సంబంధించి మాట్లాడుతూ.. అమలాపురం అల్లర్లపై ఏడు కేసులు నమోదు చేయగా...46 మందిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. కాగా, మరో 72మంది పరారీలో ఉన్నారని వారి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. జిల్లాలో కర్ఫ్యూ అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో అడుగడుగునా నిఘా ఏర్పాటు చేశారు. ఆందోళన హింసాత్మకంగా మారటంలో ఎవరి ప్రమేయం ఉందన్న దానిపై ప్రధానంగా ఆరా తీస్తున్నారు. బాధ్యులను గుర్తించి అరెస్ట్ చేసే అవకాశం ఉంది.

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎక్కడికక్కడ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ప్రధాన రహదారుల్లో నిఘాపెట్టి అమలాపురంలోకి ఎవరూ ప్రవేశకుండా చర్యలు చేపట్టామని తెలిపారు. అమలాపురం వైపు వచ్చే అన్ని బస్సు సర్వీసులను రద్దు చేశామని తెలిపారు. కర్ప్యఊ నేపథ్యంలో జిల్లాలోకి ఎవరూ రాకూడదని అదేశాలు జీరా చేశారు. దీంతో రోడ్లు బోసిపోయి.. బస్టాండ్లు నిర్మానుష్యంగా మారాయి. మరోవైపు ఆందోళనకారులు పోలీసుల కళ్లుగప్పి పట్టణంలోకి ప్రవేశించే అవకాశం ఉందన్న సమాచారంతో అన్ని మార్గాల వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles