Several Flights Cancelled at Visakhapatnam and Chennai అసని తుపాను: తీరం తాకకుండానే వెనక్కి..

Cyclone asani heavy rainfall lashes visakhapatnam storm likely to weaken by evening

cyclone asani, cyclone asani news, cyclone asani landfall, cyclone asani path, cyclone asani in west bengal, Cyclone Asani expected to re-curve cyclone asani aeroplanes cancelled, Cyclone Asani Heavy rainfall in Odisha; Cyclone Asani Orange alert to few Andhra districts, Cyclone Asani flights canceled, Heavy rain in Visakhapatnam

The officials at Cyclone Warning Centre said, "Cyclone Asani is 330 km south-southeast of Visakhapatnam and likely to move further northwest till tonight, thereafter it'll recurve." They informed that rainfall is likely over northern Andhra Pradesh including Srikakulam, Vizianagaram, Visakhapatnam and East Godavari.

అసని తుపాను: తీరం తాకకుండానే వెనక్కి.. ఊరటలో తీరప్రాంతం

Posted: 05/10/2022 04:51 PM IST
Cyclone asani heavy rainfall lashes visakhapatnam storm likely to weaken by evening

తీవ్ర తుపానుగా రూపాంతరం చెంది.. మరోమారు కోస్తాంధ్ర తీరాన్ని టార్గెట్ చేసుకుని విరుచుకుపడేందుకు రెడీగా వున్న ‘అసని’ తుపాను కాసింత శాంతించి ఊరట ప్రకటించింది. రేపు సాయంత్రానికి అసని బలహీనపడుతుందని, తీరాన్ని తాకే అవకాశాలు తక్కువని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం తుపాను కాకినాడకు 300 కిలోమీటర్లు, విశాఖపట్టణానికి 330 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్టు తెలిపింది. 10 నుంచి 20 సెంటీమీటర్ల మేర వర్షాలు కురిసే అవకాశం ఉందని, తద్వారా వరదలు ముంచెత్తే అవకాశం ఉందని అంచనా వేసింది. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.

తుపాను గంటకు 5 కిలోమీటర్ల వేగంతో ముందుకు కదులుతున్నట్టు తెలిపింది. కాగా, ఇప్పటికే విశాఖపట్టణం సహా తీర ప్రాంతాల్లో పెనుగాలులు వీస్తున్నాయి. మరోవైపు పూరీకి కేవలం 70 కిలోమీటర్ల దూరంలోనే తుపాను కేంద్రీకృతమై ఉందని ఒడిశా వాతావరణ శాఖ పేర్కొంది. రాబోయే ఐదు రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర డైరెక్టర్ నాగరత్న చెప్పారు. తుపానుతో భారత్ తో పాటు బంగ్లాదేశ్, మయన్మార్ పైనా ప్రభావం ఉండనుంది. కాగా, తుపాను ప్రభావంతో ఇప్పటికే తమిళనాడును వర్షాలు తాకాయి. చెన్నై, తిరుచురాపల్లి, కడలూరు, పుదుచ్చేరి, సేలం, కరైకల్ లో వర్షాలు కురుస్తున్నాయి. ఏపీ, ఒడిశాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.  

విమానాలు రద్దు చేసిన సంస్థలు

తుపాను ప్రభావంతో కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు, పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక తీరం వెంబడి గంటలకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పింది. సహాయక చర్యలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉండాలని కోరింది. ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాల యంత్రాంగాన్ని విపత్తుల సంస్థ అప్రమత్తం చేసింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని... గురువారం వరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. మరోవైపు, తుపాను నేపథ్యంలో విశాఖకు విమాన రాకపోకలు రద్దయ్యాయి.

తెలంగాణలోనూ నాలుగు రోజులు వర్షాలు

అన్ని విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఏషియా, ఇండిగో సంస్థలు ప్రకటించాయి. రానున్న రెండు రోజుల్లో మాత్రం తెలంగాణలో పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని డైరెక్టర్ నాగర్నత తెలిపారు. భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సీనియర్ శాస్త్రవేత్త ఆర్‌కె జెనామణి మాట్లాడుతూ తీవ్ర తుఫాను 'అసని' తీరానికి దూరంగా సముద్రం మీదుగా తిరిగి వచ్చే అవకాశం ఉందని, ఇది ఆంధ్రప్రదేశ్, ఒడిశా లేదా పశ్చిమ బెంగాల్‌ తీరాన్ని తాకదని తెలిపారు.

అసని ప్రభావంతో ఒడిశాలోని కొన్ని కోస్తా జిల్లాల్లో మే 10 నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ముందుగా అంచనా వేసింది. మే 9-10 తేదీల్లో మధ్య బంగాళాఖాతం, మే 10-12 తేదీల్లో వాయువ్య బంగాళాఖాతం మీదుగా సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు సూచించారు. తుపాను దృష్ట్యా కోల్‌కతా మునిసిపల్ కార్పొరేషన్ (కేఎంసీ) తన ఉద్యోగులను , విపత్తు నిర్వహణ బృందాలను అప్రమత్తం చేసింది. సైక్లోన్ అసని అనేది శ్రీలంకలో పెట్టిన పేరు. సింహళీలో దీని అర్థం 'కోపం'.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles