'Hindus Should Have 4 Children Says Sadhvi Ritambhara దేశం కోసం హిందువులు నలుగుర్ని కనాల్సిందే: సాధ్వి రితంబర

Hindus should have 4 children give 2 to rss or bajrang dal says sadhvi ritambhara

Sadhvi Ritambhara, Ramotsav programme, Vishwa Hindu Parishad (VHP), national sacrifice, Hanuman Jayanti, shobha yatra procession, Jahangirpuri, New Delhi, Yati Narsinghanand, religious processions, Islamic country, Haridwar hate speech, Yati Satyadevanand Saraswati, Dharam Sansad, Mubarakpur, Himachal Pradesh, Uttar Pradesh, Politics

During a Ramotsav programme held by the Vishwa Hindu Parishad (VHP) in Uttar Pradesh’s Kanpur, Sadhvi Ritambhara said that now every Hindu should have at least 4 children. Out of the 4 children, two should be handed over to the Rashtriya Swayamsevak Sangh (RSS) or Vishwa Hindu Parishad so that they can contribute to the national sacrifice, said Sadhvi Ritambhara.

దేశం కోసం హిందువులు నలుగుర్ని కనాల్సిందే: సాధ్వి రితంబర

Posted: 04/19/2022 01:33 PM IST
Hindus should have 4 children give 2 to rss or bajrang dal says sadhvi ritambhara

హిందూ దేశంగా భారత్ నిలవాలన్నా.. ప్రపంచ దేశాల గమనాన్ని సక్రమైన మార్గంలో పయనింపజేయాలన్నా.. అది హిందువులతోనే సాధ్యమని, ఈ క్రమంలో హిందువులు ఎక్కువ మంది పిల్లలను కనాలంటూ హిందువులకు మార్గనిర్ధేశనం చేయడంతో పాటు పలువురు హిందూవాద నేతలు పిలుపునిస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి పిలుపులు ఇస్తున్న నేతల సంఖ్య పెరిగింది. ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రం తరువాత మరో వాదనలు కూడా తెరపైకి వచ్చాయి. ఈ క్రమంలో హిందువులు ఎక్కువ మంది పిల్లలను కనాలన్న పిలుపులు మరింత పెరుగుతున్నాయి.

భారతావని ఇస్లామిక్ దేశంగా మారకూడదంటే హిందువులు ఎక్కువమంది పిల్లల్ని కనాలని వివాదాస్పద స్వామీజీ యతి నర్సింగానంద్ గతంలో ఒకసారి పిలుపునివ్వగా, ఆయన ఆధ్వర్యంలోని సంస్థలోని మరో నేత కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసి చర్చనీయాంశంగా మారారు. అమె మరెవరో కాదు.. హిందుత్వ నేత, దుర్గా వాహిని వ్యవస్థాపకురాలు సాధ్వి రితంబర కూడా ఇలాంటి పిలుపే ఇచ్చారు. హిందూ దంపతులు నలుగురు పిల్లల్ని కనాలని, వారిలో ఇద్దరిని దేశానికి అంకితమివ్వాలని కోరారు. అలా చేస్తేనే దేశం హిందుత్వ రాజ్యమవుతుందన్నారు.

లక్నోలోని నీరాల నగర్‌లో నిర్వహించిన రామ మహోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్, ఆరెస్సెస్ నేతలతోపాటు పలువురు సాధువులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రితంబర మాట్లాడుతూ.. రాజకీయ ఉగ్రవాదం ద్వారా హిందూ సమాజాన్ని విభజించాలని చూస్తున్న వారి అంతుచూస్తానని హెచ్చరించారు. మనం ఇద్దరం, మనకు ఇద్దరు విధానాన్ని అనుసరించకూడదని అన్నారు. హిందూ సమాజంలోని సోదరులు నలుగురు పిల్లలకు జన్మనివ్వాలని కోరారు.

ఇక ఆ నలుగురిలో ఇద్దరిని ఆరెస్సెస్‌కు అప్పగిస్తే ఆరెస్సెస్ వలంటీర్ అవుతారు, భజరంగ్‌దళ్‌ బజరంగ్ దేవ్ అవుతాడు, విశ్వహిందూ పరిషత్ కార్యకర్త అవుతాడు అన్నారు. మీ నుదిటిపై భరత ధూళిని పూయడం ద్వారా మీ జన్మ ధన్యమవుతుంది అని ఆమె అన్నారు. నా దేశం ప్రధానమని, నా జాతి ప్రయోజనాలే ముఖ్యమనేది హిందూ జాతి మంత్రం కావాలని అన్నారు. దేశంలో ధరాఘతం, ఇంధన పెరుగుదల, గ్యాస్ సిలిండర్ ధర, నిత్యావసర సరుకుల ధరలతో పాటు సామాన్య మధ్యతరగతి ప్రజలు కూడా పేదరికంలోకి కూరుకుపోతున్న వేళ.. వీహెచ్ పీ నేతలు మాత్రం ఆ అంశల పై నుంచి ప్రజల దృష్టిని ఏమార్చడానికి.. ఈ తరహా పిలుపులకు ఆస్కారమిస్తున్నారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles