bitter experience for deputy CM at Srikalahasti Temple డిఫ్యూటీ సీఎంకు వ్యతిరేకంగా భక్తుల నినాదాలు

Bitter experience for andhra pradesh endowment minister at srikalahasti temple

Sri Kalahasti Temple, Sri VayuLingeshwara Swamy, Deputy Chief Minister, Endowment Minister, Kottu Satyanarayana, Special Puja, Devotees, Protest against Minister, Anti-Minister slogans, Summer, Tirupati, Lord Venkateshwara Darshan, Tirumala Balaji, sarvadarshan tokens, Andhra Pradesh, Devotional

Andhra Pradesh Deputy CM and Endowment Minister Kottu Satyanarayana had a bitter experiance at SriKalahasti Temple today, Temple commitee had ignored the pilgrim rush for the darshan of Lord VayuLingeshwara Swamy in big queues made them protest and give slogans against the Minister.

ITEMVIDEOS: ఏపీ దేవాదాయశాక మంత్రికి పరాభవం.. డిఫ్యూటీ సీఎంకు వ్యతిరేకంగా భక్తుల నినాదాలు

Posted: 04/15/2022 05:58 PM IST
Bitter experience for andhra pradesh endowment minister at srikalahasti temple

కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా రాష్ట్రంలోని దేవాలయాలన్ని భక్తులను దూరంగా పెట్టాయి. కేవలం ఆలయ అర్చకులు మాత్రమే నిత్యకైంకర్యాలు నిర్వహించి దూప దీప నైవేద్యాలను మూలవిరాట్టులకు సమర్పించిన విషయం తెలిసిందే. అయితే కరోనా మహమ్మారి ప్రభావం దేశంలో ఎక్కడా లేకుండా పోవడం.. ఇదే క్రమంలో అటు కేంద్రంతో పాటు ఇటు రాష్ట్రాలు కూడా కరోనా పాన్ డమిక్ ఆంక్షలను ఎత్తివేసి.. మాస్క్ ధరించే అంశంలో ప్రజల ఇష్టాఇష్టంపై వదిలేసిన తరుణంలో.. తమ పట్ల అనుగ్రహం చూపిన దేవుళ్లను దర్శించుకునేందకు భక్తులు పోటీ పడుతున్నారు.

ఇక అందులోనూ ఉగాది పర్వదినం సందర్భంగా జ్యోతిష్యులు చెప్పిన పూజలను చేసుకునేందుకు.. దైవదర్శనాల కోసం క్యూలైన్లలో బారులు తీరారు. ఈ క్రమంలో ఇటీవల తిరుపతిలో సర్వదర్శన టోకన్ల వద్ద జరిగిన తోక్కిసలాటే ఇందుకు నిదర్శనం. ఇదే క్రమంలో భక్తులు శ్రీకాళహస్తి దేవాలయంలోనూ పోటెత్తారు. అయితే ఇవాళ ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యానారాయణ. అయితే మంత్రి హోదాలో తొలిసారిగా దేవాలయానికి వచ్చిన ఢిఫ్యూటీ సీఎంకు అక్కడ పరాభవం ఎదురైంది.  

క్యూలైన్లలోనే తమను గంటలపాటు నిల్చోబెట్టి ఆలయఅధికారులు తమకు మంచినీరు, ఇతర పౌకర్యాలను కూడా ఏర్పాటు చేయలేదని విమర్శించారు. క్యూలైన్లలోని చిన్నారులు, పెద్దలు మంచినీరు కోసం, ఆహారం కోసం అలమటిస్తున్నారని భక్తులు వాపోయారు. క్యూలైన్లో ఉన్న భక్తుల గురించి పట్టించుకునే నాధుడే కరువయ్యాడని విమర్శించారు. దీంతో క్రమంగా భక్తులలో కోపం కట్టలు తెంచుకుని మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉపముఖ్యమంత్రి డౌన్ డౌన్.. మంత్రివర్యా గో బ్యాక్ అంటూ పెద్దపెట్టున నినదించడంతో అప్పుడే పూజలు నిర్వహించుకున్న వెళ్తున్న మంత్రి వాటిపై ప్పందించారు.

నేరుగా ఆయన క్యూలైన్లలో నినాదాలు చేస్తున్న భక్తుల వద్దకు వెళ్లి సమస్యను తెలుసుకున్నారు. దీంతో కొంత సంయమనం పాటించిన భక్తులు ఇక తమ సహనాన్ని ఆలయ అధికారులు పరీక్షిస్తున్నారని మంత్రికి పిర్యాదు చేశారు. వేసవిలో మండుటెండలో క్యూలైన్లలో నిలబడిన తమను ఏమాత్రం పట్టించుకోకుండా ఇలా వ్యవహరిచడం సముచితం కాదని భక్తులు మంత్రికి దృష్టికి తీసుకువచ్చారు. ఆలయ అధికారులు భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. మంత్రి డౌన్‌.. డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. మంత్రి భక్తుల వద్దకు వచ్చి సర్ధి చెప్పి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles