One dead in ropeway trolley mishap in Jharkhand రెండు కేబుల్ కార్ల ఢీ.. 16 గంటలుగా గాల్లోనే బాధితులు..

2 dead in jharkhand cable car accident air force op to rescue dozens

Ropeway, Jharkhand, Cable Cars, Jharkhand Accident, Jharkhand Ropeway, Deoghar Accident, Deoghar Ropeway Accident, Jharkhand Ropeway Accident, Jharkhand Accident rescue operations, Jharkhand ropeway rescue operations, Jharkhand Cable Car Accident, ropeway accident, cable car accident, rescue operations, Air force operations, indian air force, Trikut hills, deoghar, jharkhand, crime

At least two people were killed and several injured after cable cars in a ropeway collided with each other at Trikut hills close to Baba Baidyanath Temple in Jharkhand's Deoghar district, officials said. According to officials, 48 people are still stuck in at least 12 cabins in the ropeway and a rescue operation with the help an Indian Air Force helicopter is underway.

రెండు కేబుల్ కార్ల ఢీ.. 16 గంటలుగా గాల్లోనే బాధితులు..

Posted: 04/11/2022 12:37 PM IST
2 dead in jharkhand cable car accident air force op to rescue dozens

పర్యాటక ప్రాంతాలకు వెళ్లిన ఒక పర్యాటకుడు అక్కడి యాజమాన్యం నిర్లక్యానికి బలయ్యాడు. ఇక మిగిలిన పర్యాటకులు నింగికి నేలకు మధ్య ాల్లోనే గత 16 గంటలుగా బిక్కుబిక్కుమంటూ.. తమకు సాయం చేసే అపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. పర్వత ప్రాంతాల్లోని రోప్ వేలలో కేబుల్ కార్లలో పరిసర ప్రాంతాల అందాలను వీక్షించాలని వాటని ఎక్కిన పర్యాటకలకు విచిత్ర అనుభవం ఎదురైంది. కాగా అధికారులు నిర్లక్ష్యం కారణంగా ఒక పర్యాటకుడు అసువులు బాయగా, మిగిలిన పర్యాటకులు రాత్రి నుంచి తమను కాపాడాలని అపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు.

జార్ఖండ్‌లోని డియోఘర్ జిల్లాలో పర్యాటకులకు ఈ పరిస్థితి ఏర్పడింది. రెండు వేర్వేరు మార్గాల్లో పయనించాల్సిన కేబుల్ కార్లు.. ఒకదానిని మరోకటి ఢీకోన్నడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. డియోఘర్ జిల్లాలోని బాబా బైద్యనాథ్ ఆలయానికి సమీపంలోని త్రికుట్ హిల్స్ లో, ఆ రాష్ట్ర పర్యాటకశాఖ రోవ్ వేను ఏర్పాటు చేసింది. అయితే ఈ రోప్ వే లోని రెండు కేబుల్ కార్లు ఢీకోన్నాయి.  అయితే ఈ ఘటనలో ఒక పర్యాటకుడు అక్కడికక్కడే మరణించాడు. కాగా, 12 క్యాబిన్లలోని ఏకంగా 48 మంది పర్యాటకులు ఘటన జరిగి ఆదివారం సాయంత్రం నుంచి ఇప్పటికీ గాల్లోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

అయితే గత రాత్రి నుంచి వారు తమకు సాయం చేసే అపన్నహస్తం కోసం పడిగాపులు కాస్తున్నారు. అయితే జాతీయ మీడియాలో ఈ ఘటన గుర్చి వార్తలు రావడంతో అధికారులు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులను ఆశ్రయించారు. దీంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు రంగంలోకి దిగి కేబుల్ కార్లలో చిక్కుకున్న పర్యాటకులను సురక్షితంగా కిందకు తీసుకువచ్చేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. కాగా, సాంకేతిక లోపం కారణంగా కేబుల్ కార్లు ఢీకొన్నాయని తెలుస్తోంది, అయితే ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదని ఒక అధికారి తెలిపారు. అయితే ఈ ఘటన తర్వాత రోప్‌వే మేనేజర్ మరియు ఇతర ఉద్యోగులు అక్కడి నుండి పారిపోయారని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles