Pawar’s Powerful Counter To AP CM YS Jagan ఏపీ మూడు రాజధానులపై శరద్ పవార్ విస్మయం.!

Is ap cm ruling the state from hyderabad sharad pawar s powerful counter

Sharad Pawar on three capitals, National congress party cheif sharad pawar, Sharad Pawar on Amaravathi, Sharad Pawar meet with Farmers JAC, Sharad Pawar on YS Jagan 3 capitals, Sharad pawar asks YS Jagan Ruling from Hyderabad, Sharad Pawar, National congress party, Amaravathi, Farmers JAC, YS Jagan, Hyderabad, Three Capitals, Delhi, Andhra Pradesh, Politics

The Musheerabad police arrested Bholakpur corporator Mohd Ghousuddin for allegedly obstructing policemen from performing their duty and threatening them two days ago. The corporator along with a few local people had stopped the policemen from ensuring closure of shops in Bholakpur area after midnight and allegedly threatened them.

వైఎస్ జగన్ హైదరాబాద్ నుంచే పాలన సాగిస్తున్నారా.?: శరద్ పవార్ ప్రశ్న

Posted: 04/06/2022 05:25 PM IST
Is ap cm ruling the state from hyderabad sharad pawar s powerful counter

ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న వైసీపీ ప్రభుత్వ నిర్ణయంపై ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ స్పందించారు. ‘ఏపీకి మూడు రాజధానులా?’ అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాజధాని లేని రాష్ట్రానికి ముందు ఒక రాజధానిని కట్టండీ ఆ తరువాత మూడు రాజధానుల విషయమై ఆలోచించండీ అని సూచించారు. కేంద్ర మాజీమంత్రి రేణుకా చౌదరి, ఏపీ మహిళా కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మ ఆధ్వర్యంలో అమరావతి రైతుల ప్రతినిధి బృందం హస్తినకు వెళ్లి ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను కలిసి సమస్యలు వివరించింది.

ఈ సందర్భంగా శరద్ పవార్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ కంటే పెద్దదైన మహారాష్ట్రకు రెండు రాజధానులే ఉన్నాయన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అయితే ముంబాయి దేశ అర్థిక రాజధానిగా, రాష్ట్ర రాజధానిగా అన్ని విధాలుగా శరవేగంగా పరుగులు పెడుతున్నా.. అందులో సగం శాతం కూడా మరో రాజధాని అభివృద్ది సాగడం లేదని తేల్చిచెప్పారు. మహారాష్ట్ర మరో రాజధాని విదర్భ అభివృద్ధి చెందలేదని గుర్తు చేశారు. మూడు రాజధానులు మాటను పక్కనబెట్టి ఉన్న రాజధానిని అభివృద్ది చేసుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా ఆయన సీఎం జగన్ హైదరాబాద్ నుంచి పాలిస్తున్నారా? అని రైతులను ప్రశ్నించారు. దీనికి రైతులు బదులిస్తూ అమరావతిలో గత ప్రభుత్వం కట్టిన శాసనసభ, సచివాలయం నుంచే ఆయన పని చేస్తున్నారని బదులిచ్చారు. అమరావతి నిర్మాణంపై అప్పట్లో చంద్రబాబు తనకు వివరించారని, ఆ ప్రణాళిక ఎంతో అద్భుతంగా ఉందని పవార్ గుర్తు చేసుకున్నారు. కొత్త రాష్ట్రం అద్భుతమైన రాజధానిని నిర్మించు కుంటోందని చాలా సంతోషించామని చెప్పారు.

ఉన్న రాజధాని నుంచే పనిచేయలేని వ్యక్తి మూడు రాజధానులు ఎలా నిర్మిస్తారని ఆయన సందేహం వ్యక్తం చేశారు. అమరావతే ఏపీ రాజధాని అన్న కోర్టు తీర్పును కూడా జగన్ పట్టించుకోవడం లేదని ఈ సందర్భంగా రైతులు శరద్ పవార్ దృష్టికి తీసుకెళ్లారు. బీజేపీ నేతలు అమరావతికే మద్దతు తెలుపుతున్నా కేంద్రం నుంచి సరైన మద్దతు లభించడం లేదని రైతు ప్రతినిధులు వాపోయారు. దీంతో అమరావతికి తమ పార్టీ తరపున పార్లమెంటులో మద్దతు ఇస్తామని పవార్ ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles