Arrest warrant against RK Roja Husband Selvamani ఆర్కే రోజా భర్త సెల్వమణిపై అరెస్ట్ వారెంట్

Chennai court issues arrest warrant against director selvamani ex mla arul anbarasu

RK Selvamani, Arul Anbarasu, Magistrate's court, George Town, arrest warrants, Mukanchand Bothra, Film director RK Selvamani, former congress MLA Arul Anbarasu, Film financier Mukanchand Bothra, Sowcarpet, defamatory statements, TV channel, Gaganchand, Tamil Nadu, Andhra pradesh, Crime

A Magistrate's court in Chennai has issued bailable arrest warrants against noted film director RK Selvamani, who is the husband of Andhra legislator Sreelatha alias Roja, as well as against Arul Anbarasu, former Congress MLA, in connection with a defamation case. The defamation case has been filed by film financier Mukanchand Bothra against allegedly defamatory statements made against him on a TV channel.

వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా భర్త సెల్వమణిపై అరెస్ట్ వారెంట్

Posted: 04/06/2022 01:14 PM IST
Chennai court issues arrest warrant against director selvamani ex mla arul anbarasu

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా భర్త, ప్రముఖ దర్శకుడు, తమిళనాడు దర్శకుల అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్కే సెల్వమణిపై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. పరువు నష్టం కేసులో విచారణకు హాజరుకాకపోవడంతో చెన్నైలోని మేజిస్ట్రేట్ కోర్టు ఆర్కే సెల్వమణిపై అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. 2016 సెప్టెంబర్ 5వ తేదీన ఓ తమిళ న్యూస్ చానల్‌కు సెల్వమణి, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అరుళ్ అన్బరసు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ సమయంలో సినీఫైనాన్షియర్ ముఖంచంద్ బోత్రాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన గురించి పలు విషయాలు వెల్లడించారు.

దీంతో తన పరువుకు నష్టం కలిగించాలనే మాజీ ఎమ్మెల్యే అరుళ్ అంబరసు, దర్శకుడు అర్కే సెల్వమణి ఇద్దరూ కలసి కుట్ర చేశారని ఆయన న్యాయస్థానాన్ని అశ్రయించి పరువు నష్టం దావా వేశారు. తన పరువుకు నష్టం కలిగించే ప్రకటనలు వీరిద్దరూ చేశారని పరువుకు నష్టం కలిగించే ప్రకటనలు చేశారని ముఖంచంద్ బోత్రా ఆరోపించారు. వారిద్దరిపై కోర్టులో పరువు నష్టం దావా వేశారు. అలాగే టీవీ చానల్‌ను కూడా శిక్షించాలని కోరారు. వారిద్దరు చేసిన వ్యాఖ్యలు ప్రజల దృష్టిలో తన ప్రతిష్టను దిగజార్చాయని పేర్కొన్నారు. అయితే ఇందుకు సంబంధించి సదురు టీవీ చానల్ అప్పీలో చేయడంతో..  ఈ ఏడాది ఫిబ్రవరి 7న ఆ టీవీ ఛానల్‌పై కేసును కోర్టు కొట్టివేసింది.

ఇక, కేసు పెండింగ్‌లో ఉనన సమయంలోనే పిటిషనర్ బోత్రా మరణించారు. దీంతో అతని కుమారుడు గగన్‌చంద్ బోత్రా ఈ కేసుకు సంబంధించి పోరాటం కొనసాగిస్తున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి సెల్వమణి, అన్బరసు కోర్టుకు హాజరుకావడం లేదు. తాజాగా ఈ కేసు విచారణకు రాగా.. అప్పుడు కూడా సెల్వమణి, అన్బరసు కోర్టుకు హాజరుకాలేదు. దీంతో జార్జ్ టౌన్‌లోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌లను జారీ చేశారు. ఈ కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 23కు వాయిదా వేశారు. ఆ రోజు కోర్టులో హాజరు కావాల్సిందిగా వారిద్దరని ఆదేశించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles