Court Issues Notice to Lord Shiva, Fine in Case of Non Appearance దేవుడికే భూకబ్జా నోటీసులు.. విచారణకు రావాలని అదేశాలు..

Strange deeds of officers court notice to lord shiva for encroachment know the whole matter

Lord Shiva got illegal possession notice in Raigarh, Notice to Lord Shiva in Raigarh, lord shiva got illegal possession notice in chhattisgarh, Lord Shiva gets notice for illegal possession of land in Raigarh, notice sent to lord Shiva in land dispute in Raigarh, Lord Shiva, illegal possession, Encroachment of government land, revenue officials, Raigarh, chhattisgarh, Crime

You will also be stunned if you are aware of the deeds of Revenue officers in Chhattisgarh's Raigarh district. Lord Shiva Mahadev has been handed a notice by the Revenue officers to remove unlawful occupation and illegal encrochment of government land, from the district's government land. The Lord Shiva has to attend for the inquiry appointed in this regard.

అధికారుల నిర్వాకం: పరమశివుడికి భూకబ్జా నోటీసులు.. విచారణకు రావాలని అదేశాలు..

Posted: 03/22/2022 06:23 PM IST
Strange deeds of officers court notice to lord shiva for encroachment know the whole matter

ప్రభుత్వ భూమిని ఆక్రమించారన్న ఆరోపణలపై సాక్షాత్తు పంచభూతాత్మకకుడికే నోటీసులు అందించారు రాయ్‌గఢ్‌ జిల్లా రెవెన్యూ అధికారులు. వినడానికే విస్తుపోయేలా వున్న ఇది ముమ్మాటికీ నిజం. అంతేకాదు ఈనెల 25న జరిగే విచారణకు హాజరుకాకపోతే.. ఆ భూమిని బలవంతంగా ఖాళీ చేయించి, రూ.10వేలు జరిమానా విధిస్తామని కూడా జిల్లా రెవెన్యూ అధికారులు పరమశివుడ్ని హెచ్చరించారు. అయితే ఆయన ఒక్కడినేనా అంటే కాదు. ఆయనతో పాటుగా ఏకంగా 16 మందికి ఇలా నోటీసులు అందించారు జిల్లా రెవెన్యూ యంత్రాంగం. విచారణకు హాజరుకాని పక్షంలో రూ.10 వేల జరిమానా కూడా విధిస్తామని నోటీసులలో పేర్కోన్నారు.

నోటీసులు అందుకున్న పదహారు మంది ఎవరు..? శివయ్యకు నోటీసులు ఏమిటీ.? అంటూ కన్య్ఫూజ్ కాకండీ.. ఘటన పూర్వాపరాల్లోకి వెళ్తే.. రాయ్‌గఢ్ నగరంలోని వార్డు నంబర్ 25లోని కోహ్కుందలో ఒక శివాలయం ఉంది. సుధా రాజ్‌వాడే అనే సామాజిక కార్యకర్తు ఈ శివాలయంపై హైకోర్టులో ఒక పిటిషన్‌ను దాఖలు చేశారు, ఇందులో ఆలయంతో సహా 16 మంది ప్రభుత్వభూమిని కబ్జా చేశారని అభియోగాలు మోపారు. దీంతో న్యాయస్థానం సంబంధిత అధికారులను అప్రమత్తం చేసింది. భూకబ్జా అరోపణలపై శివుడితో పాటుగా పదహారు మందికి నోటీసులు జారీ చేసింది.

ఈ నెల 25న విచారణకు హాజరుకాకపోతే దేవుడితో సహా ప్రతి ఒక్కరినీ 10,000 జరిమానా విధిస్తామని నోటీసులలో పేర్కోంది. అంతేకాదు ప్రాంగణం నుండి బహిష్కరించే అవకాశం ఉందని హెచ్చరించారు. భగవాన్ భోలేనాథ్ ఆస్తిని అతిక్రమించారని అభియోగాలు మోపారు. ఇది విని ప్రజలు అధికారుల తీరుపట్ల విస్తుపోతున్నారు. కాగా ఈ రాష్ట్రంలోశివుడికి నోటీసులివ్వడం ఇది రెండోసారి. జాంజ్‌గిర్-చంపా జిల్లా నీటిపారుదల శాఖ గతంలో నవంబర్-2021లో భోలేనాథ్‌కు నోటీసు జారీ చేసి, ఆస్తిని ఖాళీ చేయాలని అభ్యర్థించింది. రాష్ట్ర ప్రభుత్వం, తహసీల్దార్ కార్యాలయాన్ని విచారణకు ఆదేశించారు. కోర్టు ఆదేశాల మేరకు తహసీల్దార్ కార్యాలయం పది మందికి నోటీసులు జారీ చేసింది.

ఆక్రమణదారులకు పంపిన నోటీసులో శివాలయం ప్రతివాది సంఖ్య ఆరుగా పేర్కొనబడింది. నోటీసు నేరుగా శివాలయానికి, అంటే మహాదేవుడికి పంపబడింది. ఆలయ ధర్మకర్త, మేనేజర్ లేదా పూజారిని ఉద్దేశించి పంపకపోవడం కూడా చర్చనీయాంశమైంది. ప్రభుత్వభూమిలో ఆలయాన్ని నిర్మించడం చత్తీస్‌గఢ్ ల్యాండ్ రెవెన్యూ కోడ్ కింద నేరం కిందకు వస్తుందని పేర్కొంటూ తహసీల్దార్ కోర్టు.. శివుడికి వార్నింగ్ ఇచ్చింది. పదివేల రూపాయల జరిమానా చెల్లించడంతో పాటు ఆక్రమిత భూమి నుండి ఆలయాన్ని తొలగించాలని తహసీల్దార్ కోర్టు పేర్కోంటూ ఈ కేసును ఈ నెల 23కు వాయిదా వేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles