Rape Need Not Involve Removal Of Clothes: HC 'లోదుస్తుల పైనుంచి అలా తాకినా అత్యాచారం చేసినట్లే!'

Rape need not involve removal of clothes meghalaya high court

meghalaya high court, meghalaya high court on rape, meghalaya high court Section 375 (b), meghalaya high court on sexual assault, meghalaya high court on POSCO Act, Chief Justice Sanjib Banerjee, Justice W Diengdoh, division bench, Rape, sexual assault, minor girl, under clothes, pain in abdomen, lower court, Meghalaya, crime

A sexual assault even over underwear will amount to rape, and the accused will be charged under Section 375 (b) of the Indian Penal Code, the Meghalaya High Court said. Hearing a case involving the rape of a 10-year-old, a division bench of Chief Justice Sanjib Banerjee and Justice W Diengdoh, upheld the order of a lower court which had convicted the accused.

'లోదుస్తులను తొలగించకపోయినా.. అలా తాకినా అత్యాచారం చేసినట్లే!'

Posted: 03/17/2022 04:57 PM IST
Rape need not involve removal of clothes meghalaya high court

అత్యాచారం కేసులో మేఘాలయ రాష్ట్రోన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెల్లడించింది. మహిళ జననేంద్రియాలను లో దుస్తుల పై నుంచి పురుషాంగంతో తాకినా.. దానిని అత్యాచారంగానే పరిగణించాల్సి ఉంటుందని తీర్పు వెల్లడించింది. ఇది పెనట్రేటివ్​సెక్స్ ​కిందికి వస్తుందని మేఘాలయ హైకోర్టు ధర్మాసనం తీర్పును వెలువరించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ సంజీవ్​ బెనర్జీ నేతృత్వంలో జస్టిస్ డబ్యూ డైంగ్డోతో కూడిన న్యాయస్థాన ధర్మాసనం కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించింది. మహిళ యోని లేదా మూత్రనాళంలోకి ఏదైనా చొప్పించడం శిక్షా స్మృతిలోని సెక్షన్​375(బి) ప్రకారం అత్యాచారమే అవుతుందని తీర్పు వెలువరించారు.

2006 లో తనపై అత్యాచారం జరిగిందని పదేళ్ల బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు అత్యాచారం జరిగినట్లు నిర్ధరించారు. ఈ క్రమంలో 2018 లో స్థానిక కోర్టు.. నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష, రూ. 25 వేల జరిమానా విధించింది. అప్పుడు నిందితుడు తన నేరాన్ని ఒప్పుకున్నాడు. కానీ ట్రయల్​ కోర్టు తీర్పును సవాల్​ చేస్తూ నిందితుడు ఇటీవల హైకోర్టును ఆశ్రయించాడు. తన వాదనను అధికారులు తప్పుగా అర్థం చేసుకున్నారని, బాలికపై లైంగిక చర్యకు పాల్పడలేదని, లో దుస్తుల పై నుంచి పురుషాంగంతో తాకానని వాదించారు. ఇతడి వాదనలు విన్న ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెల్లడించింది. నిందితుడు శిక్షార్హుడేనని పేర్కొంది.

గతంలోనూ నాగపూర్ బెంచ్ ఇచ్చిన తీర్పును దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొట్టేసింది. దుస్తుల మీద నుంచి శరీర భాగాలను తాకడం లైంగిక వేధింపుల కిందకు రాదంటూ బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును దేశ అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఓ బాలిక దుస్తులపై నుంచి తాకినంత మాత్రాన లైంగిక వేధింపులకు పాల్పడినట్లు చెప్పలేమని, చట్టం ఇదే విషయాన్ని పేర్కొంటుందంటూ అప్పట్లో బాంబే హైకోర్టు వ్యాఖ్యానించడం సంచలనం రేపింది. లైంగిక ఉద్దేశంతో బాలిక దుస్తులు తొలగించి, లేదా దుస్తుల లోపలకి చేయి పెట్టి నేరుగా తాకితేనే అది లైంగిక వేధింపుల కిందకు వస్తుందని వెల్లడించింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles