HC suggests suspended BJP MLAs to meet Speaker ‘‘స్పీకరును కలవండీ’’: బీజేపి ఎమ్మెల్యేలకు హైకోర్టు సూచన

Telangana high court suggests suspended bjp mlas to meet assembly speaker

High Court, Assembly speaker, BJP MLAs, Etela Rajender, Raghunandhan Rao, Raja singh, pocharam Srinivas reddy, Telangana, crime

The Telangana High Court on Monday suggested three BJP MLAs Raghunandan Rao, Eatala Rajender, and T. Raja Singh, who were suspended from state Assembly last week, meet the Speaker. The court stated that the Speaker must make the final decision on whether or not to lift the suspensions of the MLAs. It instructed that the Legislature Secretary be in charge of arranging a meeting between the suspended MLAs and Speaker Pocharam Srinivas Reddy.

‘‘శాసనసభ స్పీకరును కలవండీ’’: బీజేపి ఎమ్మెల్యేలకు హైకోర్టు సూచన

Posted: 03/14/2022 06:07 PM IST
Telangana high court suggests suspended bjp mlas to meet assembly speaker

బీజేపి ఎమ్మెల్యేల సస్పెన్షన్ ఎత్తివేతపై స్పీకరే నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు పేర్కొంది. రేపటితో సమావేశాలు ముగుస్తున్న నేపథ్యంలో సస్పెన్షన్ కు గురైన బీజేపి ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యేందుకు అనుమతించాలని.. రేపు ఉదయం స్పీకర్​ను కలవాలని తెలంగాణ హైకోర్టు ధర్మాసనం సూచించింది. రాజకీయాలకు అతీతంగా శాసనసభాపతి తగిన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే ప్రశ్నించే వారూ సభలో ఉండాలని అభిప్రాయపడింది.

బీజేపి ఎమ్మెల్యేల సస్పెన్షన్ వ్యవహారంపై తుది నిర్ణయం శాసనసభ స్పీకర్​దేనని తెలంగాణ హైకోర్టు పేర్కొంది. దీంతో బీజేపి ఎమ్మెల్యేలు కోరినట్లు వారి సస్పెన్షన్​పై స్టే ఇవ్వలేమని ఇటీవల హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. దీంతో బీజేపి ఎమ్మెల్యేలు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ కు అప్పీలు చేశారు. అత్యవసర విచారణ చేపట్టాలని జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ వెంకటేశ్వరరెడ్డి ధర్మాసనాన్ని ఈ ఉదయం కోరారు. అసెంబ్లీ కార్యదర్శి హైకోర్టు నోటీసులను తీసుకోవడం లేదని బీజేపి ఎమ్మెల్యేల తరఫున సీనియర్ న్యాయవాది ప్రకాష్​రెడ్డి తెలిపారు.

తాజాగా నోటీసులు జారీచేసిన ధర్మాసనం.. అసెంబ్లీ కార్యదర్శికి అందచేయాలని జ్యుడీషియల్ రిజిస్ట్రార్ ను హైకోర్టు ఆదేశించింది. అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు ఇచ్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్​కు స్పష్టం చేసింది. దీంతో అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు అందచేసినట్లు సాయంత్రం 4 గంటలకు జ్యుడీషియల్ రిజిస్ట్రార్ హైకోర్టుకు తెలిపారు. అయితే అసెంబ్లీ కార్యదర్శి తరఫున వాదనలు వినిపించేందుకు న్యాయవాది హాజరు కాలేదు. సస్పెన్షన్ రాజ్యాంగ విరుద్ధంగా, శాసనసభ నియమావళికి వ్యతిరేకంగా ఉందని బీజేపి ఎమ్మెల్యేల తరఫున న్యాయవాది వాదించారు. తమ పేర్లను ప్రస్తావించకుండానే మంత్రి సస్పెన్షన్ తీర్మానం ప్రవేశపెట్టారన్నారు.

సస్పెన్షన్​పై సభాపతికి అధికారాలు ఉంటాయని.. అసెంబ్లీ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోవద్దని అడ్వొకేట్ జనరల్ పేర్కొన్నారు. అసెంబ్లీ వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు కోర్టులకు పరిమితంగా అధికారాలు ఉంటాయని ధర్మాసనం పేర్కొంది. అయితే బీజేపి ఎమ్మెల్యేలు స్పీకర్​నే కలసి.. సమావేశాలకు హాజరయ్యేందుకు తమకు అనుమతిని ఇవాలని కోరాలని ధర్మాసనం సూచించింది. సభ్యులను స్పీకర్​కు కలిపించాలని అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించింది. సమస్య పరిష్కారానికి పార్టీలకు అతీతంగా సభాపతి తగిన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles