Indian Army Completes First Ever 3D Printed Houses 4 వారాల్లో 3డి ఇంటి నిర్మాణం.. ఇండియన్ ఆర్మీ ఘనత

Indian army completes first ever 3d printed houses within four weeks in gujarat

3D Printed houses, Indian Army, 3D Printing Technology, Engineer in Chief Lt Gen Harpal Singh, 3d printed houses in gandhinagar inaugurated, 3d printed houses in gandhinagar, South Western Air command, 3D Printed houses by Tvasta, gandhinagar, Gujarat

The Military Engineering Services (MES) completed the first-ever 3D Printed houses at South Western Air Command at Gandhinagar, Gujarat. The 3D Printed houses were inaugurated in presence of Engineer in Chief Lt Gen Harpal Singh, Indian Army officials.

ITEMVIDEOS: నాలుగు వారాల్లో 3డి ఇంటి నిర్మాణం.. ఇండియన్ ఆర్మీ ఘనత

Posted: 03/14/2022 03:53 PM IST
Indian army completes first ever 3d printed houses within four weeks in gujarat

భారత దేశంలో తొలిసారిగా త్రిడి ప్రిటింగ్ టెక్నాలజీ ద్వారా ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఇండియన్ ఆర్మీకి చెందిన అధికారులు ఈ ఘనత సాధించారు. మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ (ఎంఈఎస్) గుజరాత్‌లోని గాంధీనగర్‌లోని నైరుతి ఎయిర్ కమాండ్‌లో మొట్టమొదటి 3డి ప్రింటెడ్ ఇళ్లను అధికారులు పూర్తి చేశారు. కేవలం నాలుగు వారాల వ్యవధిలో ఈ రెండు ఇళ్ల నిర్మాణాలను చేపట్టి పూర్తి చేయడం శుభపరిణామం. ఇక ఈ తరహా త్రిడి ప్రింటింగ్ టెక్నాలజీతో రానున్న రోజుల్లో నిర్మాణ రంగంలో విప్లవాత్మమైన మార్పులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఇవాళ నైరుతి ఎయిర్ కమాండ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్ సమక్షంలో 3డి ప్రింటెడ్ ఇళ్ల ప్రారంభోత్సవం కూడా జరిగిందని ఇండియన్ఆర్మీ అధికారులు తెలిపారు. కాంక్రీట్ 3D ప్రింటింగ్ అనేది త్రిమితీయ నిజ జీవిత నిర్మాణాలను నిర్మించడానికి ఆటోమేటెడ్ తయారీ పద్ధతి. ఈ సాంకేతికత కాంక్రీట్ 3D ప్రింటర్‌ను ఉపయోగిస్తుంది, ఇది వినియోగదారు నుండి కంప్యూటరైజ్డ్ త్రీ-డైమెన్షనల్ డిజైన్ ఫైల్‌ను అంగీకరిస్తుంది. ఇక నిర్మాణంలో వ్యయాలను కూడా సమూలంగా తగ్గించడంతో పాటు నిర్మాణం వ్యర్థాలను కూడా చాలావరకు తగ్గిస్తోందని అన్నారు.

తద్వారా ప్రత్యేకంగా రూపొందించిన ప్రత్యేకమైన కాంక్రీటును వెలికితీసి లేయర్-బై-లేయర్ పద్ధతిలో 3డి నిర్మాణాన్ని రూపొందించింది. కాంక్రీట్ మాడ్యూల్స్ మొదట ఫ్యాక్టరీ లోపల నిర్మించబడ్డాయి, ఎంఈఎస్ నిర్మాణంలో 3D ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించి నాలుగు వారాల్లో రెండు ఇళ్లను నిర్మించింది. పునాది వేయబడింది, తరువాత గోడలు, ఇంటి నిర్మాణ మాడ్యూల్స్ నిర్మించబడతాయి. దాని తర్వాత పూర్తి మెరుగులు టైల్స్ వేయడం, పెయింటింగ్, తలుపులు, కిటికీలతో సహా నూతన ఇళ్లు ప్రారంభోత్సవానికి నెల రోజుల వ్యవధిలో తయారవుతుంది. ప్రస్తుత పద్దతిలో అయితే కనీసం ఆరు నెలల సమయం బదులుగా కేవలం నెల రోజుల వ్యవధిలో నిర్మాణాలు పూర్తయ్యాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles