Odisha Forest Guard Tames A Raging Elephant అడవి ఏనుగును కాగడతో కట్టడి చేసిన పారెస్ట్ గార్డు..

Odisha forest guard is a picture of courage as he tames a raging elephant

Forest Guard, Chitta Ranjan Miri, exemplary courage, Drives Away, Tusker Elephant, Armed With ‘Mashal, Angabira village, Redhakhol forest, Sambalpur dist, Odisha, viral videos

It requires nerves of steel and presence of mind to confront a raging elephant with no harm to man or animal. Showing exemplary courage, Forest Guard Chitta Ranjan Miri drove away the bull elephant armed with only a ‘mashal.’

ITEMVIDEOS: గ్రామస్థులపైకి దూసుకోచ్చిన అడవి ఏనుగు.. కాగడతో కట్టడి..

Posted: 02/18/2022 08:09 PM IST
Odisha forest guard is a picture of courage as he tames a raging elephant

ఒడిశాలోని సంబల్ పుర్‌ జిల్లాలో ఓ ఫారెస్ట్‌ గార్డ్ రెండు గ్రామాల ప్రజలను ఏనుగు దాడి నుంచి కాపాడారు. ఏనుగులు అకస్మాత్తుగా తమ గ్రామాల్లోకి ప్రవేశించి పంట పోలాలను నాశనం చేసింది. దానిని తరిమేందుకు వెళ్లిన గ్రామస్థులపై కూడా కోపంతో దాడికి యత్నించింది. అయితే నిరాయుధుడైన ఓ పారెస్ట్ గార్డు మాత్రం తన చేతిలోని కాగడతో దానిని తిరిగి అడవులలోకి వెళ్లేట్లు చేశాడు. దీంతో అతనిపై గ్రామస్థులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తమ గ్రామాల్లో వందలాది మంది ప్రజలను కాపాడటంతో పారెస్ట్ గార్డ్ కీలకంగా వ్యవహరించారని గ్రామస్థులు పేర్కోంటున్నారు.

అయితే ఇది మాటల్లో చెప్పేంత సులువైన పనికాదు. అడవిలోనే అత్యంత పెద్దదైన ప్రాణి ఏనుగు మాత్రమే దానిని ఎదుర్కోవాలంటే.. ఉక్కు నరాలు, బెదరని గుండె, సమయస్పూర్తి కలిగివుండాలి. ఇక అందులోనూ కోపంతో మీదకు దూసుకువస్తున్న అడవి ఏనుగును నియంత్రించడం అంత తేలికైన పనికాదు. కానీ అటు ఏనుగుకు కానీ ఇటు గ్రామస్థులకు కానీ ఎలాంటి హానీ జరగకుండా.. ఏనుగును అడవుల దారిలోకి మళ్లించడం ఎంత శిక్షకుడైనా సరే.. ధైర్యవంతుడు కూడా అయ్యివుండాల్సిందే. అటువంటి సాహసోపేతమైన ప్రధర్శనతో గ్రామస్థుల పాలిట అప్తుడిగా మారాడు ఆ పారెస్టు గార్డు.

అతను ఓ పారెస్టు గార్డు.. ఆయన పేరు చిట్టా రంజన్ మిరి. సంబల్ పుర్‌ జిల్లాలోని రెడ్యాఖోల్ అటవీ డివిజన్ పరిధిలో ఓ అడవి ఏనుగు చాంద్‌చాడి, అంగబిరా గ్రామాల్లోని  పంటపోలాలను నాశనం చేస్తోంది. విషయం తెలిసిన గ్రామస్థులు దానిని తరిమేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది వెనుదిరగలేదు. అయితే మరింత కోపంతో గ్రామస్థులపైకి దూసుకోచ్చింది. గ్రామాల్లో బీభత్సం సృష్టించింది. అడ్డొచ్చిన వారిపై దాడికి దిగింది. వెంటనే గ్రామస్థులు అటవీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో సమాచారం అందుకున్న ఫారెస్ట్‌ గార్డ్‌ చిత్త రంజన్‌ మిరి సహా మరికొంతమంది అక్కడికి చేరుకున్నారు.

అయితే అటవీశాఖ సిబ్బంది ఎటువంటి ఆయుధాలు లేకపోవడంతో గ్రామస్థులు ఖంగుతిన్నారు. గ్రామస్థుల నుంచి పోడువాటి కర్రల తీసుకుని వాటికి ఓ వైపు చివరన.. కాగడలను ఏర్పర్చుకుని నిప్పు అంటించి.. ఏనుగు వద్దకు చేరుకున్నారు. అయితే అక్కడున్న వారిలో కొందరు ఏనుగు ముందుకు దూసుకువచ్చే ప్రయత్నం చేయగానే వెనక్కి పరుగులు తీశారు. కాగా, చిట్టా రంజన్ మాత్రం ఏనుగు ముందుకు వచ్చిన ఏమాత్రం వెనకడుగు వేయకుండా.. దానికి మంటను చూపుతూనే వున్నాడు. మంటల దాటికి ఏనుగే వెనకడుగు వేసింది. అంతే అలా వేనక్కు జరగడంతోనే దానిని మంటతో అడువుల మార్గ వైపు తరమివేశారు చిట్టా రంజన్. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles