SC sets aside HC stay on locals quota in private jobs స్థానికులకు ఉద్యోగ కోటాపై హర్యానా ప్రభుత్వానికి ‘సుప్రీం’లో ఊరట..

Supreme court sets aside high court stay of haryana private sector quota law

Quota in private jobs in Haryana, Punjab and Haryana High court, Job reservation for haryana residents in private sector, Supreme Court, Haryana High court, Haryana govt, Faridabad, Quota in private jobs, Job reservation, private sector jobs for locals, Haryana, politics

The Supreme Court set aside the stay on a Haryana law requiring private employers to reserve 75% of low-paying jobs for the state’s residents. It directed the Punjab and Haryana high court to decide on the validity of the law within a month.

స్థానిక కోటాపై హర్యానా ప్రభుత్వానికి ‘సుప్రీం’లో ఊరట.. నిర్ణయానికి హైకోర్టుకు 4 వారాల సమయం

Posted: 02/17/2022 01:49 PM IST
Supreme court sets aside high court stay of haryana private sector quota law

రాష్ట్రంలోని ప్రైవేటు రంగ సంస్థల్లోనూ తమ రాష్ట్ర ప్రజలకు స్థానికత కోటా కింద 75 శాతం ఉద్యోగాలు అందించాలన్న అంశంలో హర్యానా రాష్ట్ర సర్కారుకు తాత్కాలిక ఊరట దక్కింది. 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే చెందాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆదేశాలపై పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు లోగడ స్టే విధించగా, సుప్రీంకోర్టు తాజాగా దాన్ని ఎత్తివేసింది. అయితే, కొత్త చట్టాన్ని అమలు చేయని ప్రైవేటు సంస్థలపై బలవంతపు చర్యలకు దిగొద్దని ఈ సందర్భంగా హర్యానా ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది.

ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ప్రైవేటు పరిశ్రమలు పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టును లోగడ ఆశ్రయించాయి. రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ ఈ చట్టం అమలుపై హైకోర్టు స్టే విధించడం గమనార్హం. దీన్ని సుప్రీంకోర్టు ముందు హర్యానా సర్కారు సవాలు చేసింది. తాజాగా ఈ అంశంపై పూర్తి స్థాయి విచారణ నిర్వహించాలని, నాలుగు వారాల్లోగా దీన్ని పూర్తి చేయాలని పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది. ‘‘మేము ఈ అంశంలోని వాస్తవాల జోలికి వెళ్లడం లేదు. నాలుగు వారాలకు మించకుండా విచారణ వేగంగా పూర్తి చేయలని హైకోర్టును కోరుతున్నాము’’ అని జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
 
విచారణ సందర్భంగా ఫరీదాబాద్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ తరఫున దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. ‘‘కొత్త చట్టం వల్ల ఎన్నో సమస్యలు ఉన్నాయి. చిన్న సంస్థలు రిజర్వ్ డ్ కోటాకు సరైన అభ్యర్థులు లభించకపోతే మూసేసుకోవాల్సి వస్తుంది. ప్రైవేటు ఆసుపత్రులపై ఎక్కువ ప్రభావం పడుతుంది. ఎందుకంటే ఎక్కువ మంది నర్సులు కేరళ రాష్ట్రానికి చెందినవారే వున్నారు’’ అని వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles