‘Fishermen’s woes ignored’ మత్స్యకారుల సమస్యలు చూస్తే చాలా బాధ కలిగించింది: నాదేండ్ల మనోహర్

Policy on vending units harming fisherfolk s livelihood alleges jsp

pawan kalyan, ap govt g.o. on fishing, G.O. 217, nadendla manohar, Janasena, Insurance compensation, nadendla manohar, matyakara abhyunnathi, jana sena pac, jana sena, fisherfolk welfare, eight-day padayatra, Matsyakara Abhyunnathi Yatra, Kakinada Rural, East Godavari district, Narsapuram coast, West Godavari district, Andhra pradesh, Politics

Jana Sena Party Political Affairs Committee (PAC) chairman Nadendla Manohar lamented that the State government’s policy on village fish vending units would eat up the livelihoods of more than 4.50 lakh fisherfolk. Mr. Manohar launched the eight-day padayatra, titled Matsyakara Abhyunnathi Yatra, in Kakinada Rural in East Godavari district. It will conclude on the Narsapuram coast in West Godavari district on February 20.

మత్స్యకారుల సమస్యలు చూస్తే చాలా బాధ కలిగించింది: నాదేండ్ల మనోహర్

Posted: 02/14/2022 03:34 PM IST
Policy on vending units harming fisherfolk s livelihood alleges jsp

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో మత్స్యకారుల సమస్యలను చూస్తేనే బాధ కలిగిందని జ‌న‌సేన నేత నాదెండ్ల మ‌నోహ‌ర్ అన్నారు. మత్స్యకారులు ఎదుర్కోంటున్న సమస్యలు ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా వున్నాయని, వారి బస్తీల్లో సమస్యల తిష్టవేసుకుని కూర్చున్నాయని ఆయన ఏకరువు పెట్టారు. మత్స్యకారుల సమస్యల పరిష్కారిస్తామని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం రెండేళ్లు గడుస్తున్నా వారిని పట్టించుకోలేదని, కనీసం వారికి ఇచ్చిన ఎన్నికల హామీలపై దృష్టి సారించలేదని ఆయన మండిప‌డ్డారు.

జనసేన మత్స్య వికాస విభాగం ఆధ్వ‌ర్యంలో ఎనమిది రోజుల పాటు మత్స్యకార అభ్యున్నతి యాత్ర ప్రారంభించిన ఆయన కాకినాడలోని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ''నిన్న‌ తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలంలో ప‌ర్య‌టించాం. మత్స్యకారులు స‌ముద్రంలో వేట‌కు వెళ్లి వ‌చ్చిన త‌ర్వాత వాటిని అమ్మిన డ‌బ్బుతో కుటుంబాన్ని పోషించుకుంటారు. మ‌త్స్యకార గ్రామాల్లో తాగునీటి ప‌థ‌కం అమ‌లు చేశారో లేదో ప్ర‌భుత్వం చెప్పాలి. మ‌హిళ‌లు ప‌డుతోన్న క‌ష్టాలు తెలుసుకుంటే చాలా ఆవేద‌న క‌లిగించింది. జ‌గ‌న్ కూడా యాత్ర చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

మ‌త్స్య‌కారుల ఆరోగ్య స‌మ‌స్య‌ల గురించి ప‌ట్టించుకునే నాధుడే కరువయ్యాడని ఆయన పేర్కోన్నారు. సముద్రంతోనే తమ అపాయ్యత, అనురాగాలను పెంచుకున్న మత్స్యకారులు ఇప్పుడు ఎందుకని ఇత‌ర జిల్లాల‌కు వ‌ల‌స వెళ్తున్నారు? దీనికి బాధ్యులు ఎవరు అని ఆయన ప్రశ్నించారు. శ్రీ‌కాకుళం, విశాఖ నుంచి 25 వేల మంది ఎందుకు వ‌ల‌స వెళ్లారు?. తాను ఆవేద‌న‌తో మాట్లాడుతున్నాను.. తనకు చాలా బాధ‌క‌లిగించింది. తరతరాలు వంశపారంపర్యంగా వచ్చిన చేపల వేట మానేసి వారు ఎందకని చిన్న చిన్న ప‌నులు చేసుకుని బ‌తుకుతున్నారని ప్రశ్నించారు.

చాలిచాలనంత డబ్బుతోనే వారు కుటుంబాలను పోషిస్తున్నారని.. ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసినా వారికి కేవలం ఆరు వేల రూపాయ‌ల వేత‌నం మాత్ర‌మే వస్తుందని.. దీంతో వారు తమ కుటుంబాన్ని ఎలా పోషించుకుంటారు.? అని ప్రశ్నించారు. సూర్యారావు పేట‌లో అభివృద్ధి చేస్తున్నామ‌ని చెప్పి, 560 కుటుంబాల‌ను రోడ్డున ప‌డేశారు. అయిన‌ప్ప‌టికీ, ప్ర‌భుత్వం నుంచి ఎందుకు స్పంద‌న రావ‌ట్లేదు? అని ఆయన ప్రశ్నించారు.

చేపల వేటకు వెళ్లి మరణించినా లేక ఎలా మరణించినా మత్స్యకార బాధిత కుటంబాలకు పది లక్షల రూపాయలను పరిహారంగా ఇస్తామని ప్ర్రకటించిన వారు ఇప్పుడు గద్దెనిక్కన తరువాత ఎందుకు వీరి బాగోగులు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. పరిహారంగా అందాల్సిన భీమా డబ్బుకు స్థానికంగా ఎందరో పడిగాపులు కాస్తున్నారని నాదేండ్ల అవేదన వ్యక్తం చేశారు. గతంలో చేప‌లు అమ్ముకునేవాళ్ల‌మ‌ని, త‌మ‌ షాపుల‌న్నింటినీ తీసేశార‌ని మ‌త్స్య‌కారులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈనెల‌ 19న ప‌వ‌న్ క‌ల్యాణ్ నివేదిక అందిస్తామన్నారు. ప్ర‌భుత్వ తీరుపై మాట్లాడ‌డానికి ప్ర‌జ‌లు భ‌య‌ప‌డుతున్నారు. ఇది ప్ర‌జాస్వామ్య‌మేనా?'' అని నాదెండ్ల మ‌నోహ‌ర్ విమ‌ర్శ‌లు గుప్పించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles