TTD Board sends good news to Tirumala SriVari Devotees తిరుమల శ్రీవారి సామాన్య భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్..

Good news to tirumala sri vari devotees ttd to issues offline tokens soon

TTD, Srivari darshan free tickets, srivari darshan offline tickets, free sarvadarshan tickets offline, Sarva darshanam tickets offline, free darshan tickets offline, Sarva darshanam free tickets offline, Tirumala Tirupati, Tirumala News, TTD, Tirumala tirupati Devasthanam, TTD Board, TTD Chairman, Andhra pradesh, politics

Tirumala Tirupati Devasthanam Board sends good news to Tirumala SriVari ordinary Devotees, by issuing offline darshan (sarva darshanam) Tickets from 15 Febraury. to extend the Sri Vari Darshan for the rural area devotees from telugu states and the country. TTD said it will extends the tickets following covid protocol.

తిరుమల శ్రీవారి సామాన్య భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్..

Posted: 02/04/2022 05:03 PM IST
Good news to tirumala sri vari devotees ttd to issues offline tokens soon

కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వర స్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు శుభవార్త చెప్పింది. గత రెండేళ్లుగా ఏడుకొండలు ఎక్కినా శ్రీవారి దర్శనభాగ్యం కలగని భక్తులకు తీపికబురు చెప్పింది. శ్రీవారి సర్వదర్శనం టోకెన్లపై టీటీడీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి భక్తులకు సర్వదర్శనాలను కూడా అన్ లైన్లో అందుబాటులోకి తీసుకువచ్చిన టీటీడీ.. అవి గ్రామీణప్రాంత భక్తులకు అందుబాటులోకి వెళ్లడం లేదని గ్రహించిన టీటీడీ ఇకపై సర్వదర్శన టోక్లన్ల ఆఫ్ లైన్ లో అందుబాటులోకి తీసుకురావాలని గత నెలలోనే నిర్ణయించింది. అయితే కరోనా మహమ్మారి తగ్గిన నేపథ్యంలో ఈ నెల 15 నుంచి తిరుమల శ్రీవారి భక్తులకు త్వరలోనే ఆఫ్‌లైన్‌ ద్వారా దర్శనం టోకెన్ల జారీ ప్రక్రియ ప్రారంభించాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది.

ఈ మేరకు ఇవాళ ఉన్నతాధికారులతో సమావేశమైన టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జవహార్ రెడ్డి పలు కీలక అంశాలపై చర్చించారు, అయితే కోవిడ్‌ వ్యాప్తి చెందుతుందన్న ఆందోళనతో తిరుపతిలో ఆఫ్‌లైన్‌ ద్వారా టోకెన్ల జారీ విధానాన్ని గత ఏడాది సెప్టెంబర్‌ 25 నుంచి రద్దు చేసిన విషయం తెలిసిందే. కాగా గత నెలలో తమ నిర్ణయంపై పున: సమీక్ష నిర్వహించిన చైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి.. గ్రామీణ ప్రాంత భక్తుల కోసం అప్ లైన్ టోకన్లు ఇచ్చే విషయమై త్వరలో నిర్ణయం తీసుకుంటామని వివరించారు. దానిపై ఇవాళ జవహార్ రెడ్డి ఉన్నతాధికారులతో సమావేశమై సర్వదర్శన టోకన్లు జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

ఇక గత రెండేళ్లుగా వర్చువల్ పద్దతిలో కొనసాగుతున్న అర్జిత సేవలను ఇక ప్రత్యక్ష పద్దతిలో కొనసాగించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. దర్శన టికెట్లు అమ్మే నకిలీ వెబ్‌సైట్లు గుర్తించి తొలగిస్తున్నామని, ఇందుకు నకిలీ వెబ్‌సైట్ల కట్టడికి టీటీడీ సైబర్‌ విభాగం నిరంతర నిఘా ను పెట్టిందని వెల్లడించారు. టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లోనే భక్తులు టికెట్లు పొందాలని ఆయన సూచించారు. తిరుమలలో విపత్తుల నిర్వహణపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని ప్రమాదాలను ముందుగానే గుర్తించే సాంకేతికతను అందుబాటులోకి తీసుకొస్తున్నామని స్పష్టం చేశారు. తిరుమల పరిసర ప్రాంతాల్లో ప్లాస్టిక్‌ నిషేధం పటిష్టంగా అమలు చేయాలని నిర్ణయించారు. ఈనెల 16న అంజనాద్రి అభివృద్ధి పనులకు భూమి పూజ కార్యక్రమం ఉంటుందని ఈవో వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles