Digital University, One Class, One TV Channel, says FM దేశ ఆర్థిక వృద్ది 9.27శాతంగా అంచనా: మంత్రి నిర్మల సీతారామన్

Budget 2022 e passports lic ipo and other highlights from nirmala sitharaman s speech

union budget, union budget 2022, budget 2022, nirmala sitharaman, budget speech, nirmala sitharaman union budget, nirmala sitharaman budget, education, digital india

Union finance minister Nirmala Sitharaman presented the Union Budget 2022 in the Lok Sabha on Tuesday, in which she laid down the roadmap for India’s economy in the coming financial year. This was her fourth Budget, and third amid the coronavirus disease (Covid-19) pandemic, which battered the country’s economy.

దేశ ఆర్థిక వృద్ది 9.27శాతంగా అంచనా: బడ్జెట్ ప్రసంగంలో మంత్రి నిర్మల

Posted: 02/01/2022 11:44 AM IST
Budget 2022 e passports lic ipo and other highlights from nirmala sitharaman s speech

ఈ ఏడాది భార‌త ఆర్థిక వృద్ధి 9.27 శాతంగా ఉంటుంద‌ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఇవాళ ఆమె లోక్‌స‌భ‌లో 2022-23 బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టారు. దానికి ముందు కేంద్ర క్యాబినెట్ భేటీలో ఆ బ‌డ్జెట్‌కు ఆమోదం ద‌క్కింది. పార్ల‌మెంట్‌లో ఆ స‌మావేశం జ‌రిగింది. నిర్మ‌ల నాలుగ‌వ సారి బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టారు. లోక్‌స‌భ‌లో బ‌డ్జెట్‌ను మంత్రి ట్యాబ్లెట్‌లో చూసి చ‌దివారు.డిజిట‌ల్ ఇండియాలో భాగంగా, క‌రోనా నేప‌థ్యంలో పేప‌ర్ల వాడ‌కాన్ని త‌గ్గిస్తూ మంత్రి సీతారామ‌న్ 2022-23 బడ్జెట్‌ను ట్యాబ్లెట్‌లో చూస్తూ చ‌దివారు. ఈ సంద‌ర్భంగా ఆమె ప్ర‌సంగిస్తూ.. పౌరుల కేంద్రం సంస్క‌ర‌ణ‌లు చేప‌ట్టేందుకు ప్ర‌భుత్వం ప‌ట్టుద‌ల‌తో ఉంద‌న్నారు. రాబోయే 25 ఏళ్ల అమృత కాలానికి దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను మార్చేందుకు సంస్క‌ర‌ణ‌లు చేప‌ట్టిన‌ట్లు ఆమె తెలిపారు.

భారీ స్థాయిలో ఉద్యోగ ఉపాది అవకాశాలు కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు. దేశవ్యాప్తంగా ఏకంగా 60 లక్షల ఉద్యోగాలను సృష్టించడమే ప్రభుత్వ టార్గెట్ అని అమె తెలిపారు. 14 రంగాల్లో పీఎల్ఐ ద్వారా ఈ ఉద్యోగాలను కల్పించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఉద్యోగ కల్పనే కాకుండా రాబోయే ఐదేళ్ల్లో 30 లక్షల కోట్ల అదాయాన్ని సృష్టించనున్నట్లు అమె చెప్పారు. వ‌చ్చే 25 ఏండ్లు భార‌త్‌ను అగ్ర‌దేశంగా నిల‌బెట్టేందుకు ప్ర‌ణాళిక‌ల‌ను రూపొందించామ‌ని తెలిపారు. ఇందుకోసం నాలుగు సూత్రాల ఆధారంగా బ‌డ్జెట్‌ను రూపొందించిన‌ట్లు ఆమె వెల్ల‌డించారు. ప్ర‌ధాని గ‌తిశ‌క్తి యోజ‌న‌, స‌మీకృత అభివృద్ధి, అభివృద్ధి ఆధారిత పెట్టబడులు, ప‌రిశ్ర‌మ‌ల‌కు ఆర్థిక ఊతం ఇచ్చే విధంగా కేంద్ర బ‌డ్జెట్ 2022-23ని రూపొందించిన‌ట్లు ఆమె పేర్కొన్నారు.

ఇక త్వరలో జీవిత భీమా సంస్థ (ఎల్ఐసీ)ని పబ్లిక్ ఇష్యూకు ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. దీనిపై త్వరలోనే ప్రకటన చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఇక ప్ర‌స్తుతం మ‌నం ఒమిక్రాన్ వేవ్ మ‌ధ్య‌లో ఉన్నామ‌ని, కానీ మ‌న దేశంలో వేగంగా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ సాగుతున్న‌ట్లు మంత్రి చెప్పారు. అంద‌రిక స‌హ‌కారంతో ఆర్థిక వృద్ధి బ‌లంగా సాగుతుంద‌ని ఆశిస్తున్న‌ట్లు మంత్రి తెలిపారు. 2021-21 బ‌డ్జెట్‌లో మూల‌ధ‌నం అధిక స్థాయిలో జ‌రిగింద‌ని, అయితే 2022-23 బ‌డ్జెట్ యువ‌త‌, మ‌హిళ‌లు, రైతులు, ఎస్సీలు, ఎస్టీల‌కు ఎక్కువ ల‌బ్ధి చేకూర్చ‌నున్న‌ట్లు ఆమె చెప్పారు. పీఎం గ‌తీ శ‌క్తి మాస్ట‌ర్ ప్లాన్‌తో అంద‌రికీ లాభం జ‌ర‌గ‌నున్న‌ట్లు మంత్రి నిర్మ‌ల తెలిపారు.

పీఎం గ‌తీ శ‌క్తి మాస్ట‌ర్ ప్లాన్‌కు సంబంధించిన వివ‌రాల‌ను వెల్ల‌డిస్తూ.. దేశవ్యాప్తంగా సుమారు 25 వేల కిలోమీట‌ర్ల మేర కొత్త‌గా జాతీయ ర‌హ‌దారుల్ని నిర్మించ‌నున్న‌ామని చెప్పారు. ఎక్స్‌ప్రెస్‌వేల‌ను ఈ ఏడాది పెంచ‌నున్న‌ట్లు ఆమె చెప్పారు. వేగంగా ప్ర‌యాణికులు, స‌రుకుల‌ను త‌రలించేందుకు కొత్త‌గా ర‌హ‌దారుల్ని నిర్మించ‌నున్న‌ట్లు మంత్రి వెల్ల‌డించారు. 2022-23 సంవ‌త్స‌రంలో అద‌నంగా 25వేల కిలోమీట‌ర్ల నేష‌న‌ల్ హైవేను నిర్మించ‌నున్న‌ట్లు చెప్పారు. ప్ర‌జా వ‌న‌రుల‌ను క‌ల్పించేందుకు 20 వేల కోట్ల‌ను స‌మ‌కూర్చ‌నున్న‌ట్లు మంత్రి సీతారామ‌న్ తెలిపారు. పీఎం గ‌తీశ‌క్తి ప్లాన్‌లో ఏడు ఇంజిన్లు ఉన్నాయ‌ని, వాటితోనే దేశ వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేయ‌నున్న‌ట్లు ఆమె చెప్పారు. రోడ్లు, రైల్వేలు, విమానాశ్ర‌యాలు, పోర్ట్‌లు, ర‌వాణా, వాట‌ర్‌వేస్‌, లాజిస్టిక్స్ ఇన్‌ఫ్రాపై త‌మ ప్ర‌భుత్వం దృష్టి పెట్టిన‌ట్లు మంత్రి తెలిపారు.

రానున్న రోజుల్లో అన్ని విభాగాలను డిజిటల్ మయం చేసే పనిలో కేంద్రం నిమగ్నమైందని తెలిపారు. పాస్‌పోర్టులను ఇప్పటివరకు బుక్‌ రూపంలో ఇస్తుండగా.. ఇకపై ఎలక్ట్రానిక్‌ రూపంలో ఇచ్చేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నది. ఈజ్‌ ఆఫ్‌ బిజినెస్‌ 2.0 లో భాగంగా ఈ-పాస్‌పోర్టులను ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. అదేవిధంగా డిజిటల్ బ్యాంకింగ్‌ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం నిరంతరం ప్రోత్సహిస్తున్నది. రానున్న రోజుల్లో డిజిటల్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు 75 జిల్లాల్లో 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు.

ఈ బ్యాంక్‌ల‌ను షెడ్యూల్డ్‌ క‌మ‌ర్షియ‌ల్ బ్యాంక్‌లు ఏర్పాటు చేయనున్న‌ట్లు ఆమె వెల్ల‌డించారు. ఆన్‌లైన్ పేమెంట్స్‌ను ఈ బ్యాంక్‌ల ద్వారా ప్ర‌మోట్ చేయ‌నున్న‌ట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతులకు కూడా ఈ బ్యాంక్‌ల ద్వారా ఉప‌యోగం జ‌రుగుతుంద‌ని ఆమె అన్నారు. రాష్ట్రాల స‌హ‌కారంతో ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగుతుంద‌న్నారు. దేశంలోని 1.5 ల‌క్ష‌ల పోస్టాఫీసులు డిజిటల్ బ్యాంకింగ్ కింద‌కు రానున్న‌ట్లు ఆమె చెప్పారు. అదేవిధంగా, రానున్న రోజుల్లో 1 నుంచి 12 తరగతుల వరకు డిజిటల్‌ విద్యను అందుబాటులో తేవాలని కేంద్రం నిర్ణయించింది. 1 తరగతి 1 టీవీ ఛానెల్‌ని 12 నుంచి 12,000 టీవీ ఛానెళ్లకు పొడిగించనున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కొవిడ్‌ మహమ్మారి కారణంగా విద్యా వ్యవస్థ నష్టాన్ని పరిగణనలోకి తీసుకుని విద్యా వ్యవస్థ డిజిటలైజేషన్‌పై దృష్టి సారించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles