Shocking matters comes into light in Karimnagar కరీంనగర్ రోడ్డు ప్రమాదఘటనలో విస్తుపోయే విషయాలు..

Shocking matters comes into light in telangana s karimnagar

Karimnagar road accident, Karimnagar car accident, Karimnagar road accident, Karimnagar accident, Telangana accident, Telangana car accident, Huts accident, Car accident, Road safety, Telangana road safety, Karimnagar road safety, Telangana police, Karimnagar police, Karimnagar traffic police, Karimnagar, Telangana, crime

The driver of the car lost control and rammed through the huts in which several labourers live. The deceased were among those who were sleeping in their huts when the tragedy struck them.

కరీంనగర్ రోడ్డు ప్రమాదఘటనలో విస్తుపోయే విషయాలు..

Posted: 01/31/2022 10:39 AM IST
Shocking matters comes into light in telangana s karimnagar

కరీంనగర్ లోని జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ కారు ప్రమాదానికి కారణమయ్యిందన్న విషయం తెలిసిందే. అదుపుతప్పి కారు రోడ్డు పక్కన.. కొలిమి పని చేసుకుని జీవనం సాగిస్తున్న కుటుంబం వేసుకున్న గుడిసెలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో గుడిసెలో నిద్రిస్తున్న నలుగురి ప్రాణాలను బలితీసుకుంది. అయితే నిద్రమత్తులో ఈ ప్రమాదం జరిగిందని అందరూ భావించారు. కానీ ప్రమాదానికి కారణలను దర్యాప్తు చేస్తున్న పోలీసులకు విస్తుపోయే విషయాలు వెల్లడైయ్యాయని తెలుస్తోంది.

ప్రమాదానికి కారణమైన కారును మైనర్ బాలుడు నడుపుతుండగా, అందులో అతడి ఇద్దరు స్నేహితులు కూడా ఉన్నారన్న విషయం పోలీసుల దర్యాప్తులో తేలిసింది. స్నేహితుల ప్రోత్సాహంతో వేగంగా వెళ్తున్న బాలుడు కారును ఏకంగా 100 కిలోమీటర్ల వేగంతో నడుపుతున్నాడని, ఈ క్రమంలోనే కారు అదుపు తప్పి గుడిసెలోకి వెళ్లిందని తేలింది. అంటే ప్రమాద సమయంలోనూ కారు 100 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. అలాగే, కారుపై 9 చలాన్లు ఉన్నాయి. ప్రమాద  సమయంలో కారు నడుపుతున్న 16 ఏళ్ల బాలుడితోపాటు 17 ఏళ్ల వయసున్న అతడి ఇద్దరి స్నేహితులను అరెస్ట్ చేశారు.

అలాగే, బాలుడికి కారు ఇచ్చి ప్రమాదానికి కారణమైన అతడి తండ్రిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మైనర్లుకు వాహనాలను అందించిన తల్లిదండ్రులపై చర్యలు తీసుకుంటామని గత కొన్నేళ్లుగా పోలీసులు హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. నిందితుడైన బాలుడు తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. వెంట ఉన్న ఇద్దరు స్నేహితులు పదో తరగతి చదువుతున్నట్టు పోలీసులు తెలిపారు. స్నేహితులైన వీరంతా తరచూ కారులో షికారుకు వెళ్లేవారు. నిన్న కూడా అలాగే కారులో బయటకు వచ్చారు. పొగమంచు కురుస్తున్నా కారును వేగంగా నడిపారు. ఈ క్రమంలో బ్రేకుకు బదులు యాక్సిలేటర్‌ను బలంగా తొక్కడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles