Oklahoma Executes Donald Grant For Double Murder ప్రేమ కోసం ప్రాణం: ఓక్లహామలో హంతకుడికి మరణశిక్ష విధింపు..

Oklahoma s execution of donald grant is america s first of 2022

Donald Grant, execution, oklahoma, girlfriend, bail, hotel employees, double murder, fetal alcohol syndrome, brain trauma, violent abuse, southern US state, US Supreme Court, lethal injection, United States

Oklahoma executed a man Thursday for the brutal slayings of two hotel workers during a robbery in 2001. Donald Grant, 46, received a lethal injection at the Oklahoma State Penitentiary in McAlester and was declared dead at 10:16 a.m. It was the first execution in the U.S. in 2022 and the third in Oklahoma since the state resumed lethal injections in October following a nearly seven-year hiatus.

ప్రేమ కోసం ప్రాణం: ఓక్లహామలో హంతకుడికి మరణశిక్ష విధింపు..

Posted: 01/28/2022 04:37 PM IST
Oklahoma s execution of donald grant is america s first of 2022

అమెరికాలో నూతన సంవత్సరం 2022లో తొలి మరణశిక్ష అమలైంది. ఓక్లహామ రాష్ట్రంలో డొనాల్డ్ ఆంథోనీ గ్రాంట్ (46) కు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా మరణశిక్ష అమలు చేశారు. ప్రియురాలి కోసం అతడు చేసిన హత్యలకు గాను ఆయనకు ఈ శిక్షను అక్కడి అధికారులు అమలుపర్చారు. తన ప్రియురాలికి బెయిల్ కోసం డబ్బులు అవసరమై.. తొలిసారిగా దొంగతనం మార్గాన్ని ఎంచుకున్న గ్రాంట్.. ఇందుకోసం ఇద్దరి ప్రాణాలను తీశాడు. ఈ హత్యోదంతం తరువాత నాలుగేళ్లకు న్యాయస్థానం ఆయనకు మరణశిక్షను విధించింది. కాగా పలు విచారణల తరువాత న్యాయస్థానం అదేశాలతో ఆయనకు మరణశిక్షను విధించారు. ఈ కేసుకు సంబంధించిన పూర్వాపరాల్లోకి వెళ్తే..

2001లో 25 ఏళ్ల వయసున్నప్పుడు గ్రాంట్ ఒక హోటల్ లో దోపిడీకి యత్నించాడు. డెల్ సిటీ మోటెల్ వద్ద ఉద్యోగం కోసం అతడు దరఖాస్తు చేసుకున్నాడు. మరుసటి రోజు అదే హోటల్ కు వెళ్లి దోపిడీకి పాల్పడ్డాడు. ఈ సందర్భంగా హోటల్ మేనేజర్, డెస్క్ క్లర్క్ పై కాల్పులు జరపడంతో వారు ప్రాణాలు కోల్పోయారు. తన గర్ల్ ఫ్రెండ్ కు బెయిల్ ఇప్పించేందుకు డబ్బు అవసరం పడింది. దానికి దోపిడీని మార్గంగా ఎంచుకున్నాడు. దీంతో 2005లో స్థానిక కోర్టు అతడికి మరణశిక్షను ఖరారు చేసింది. అప్పటి నుంచి ఎన్నో అప్పీళ్లతో ఆయన తరపు న్యాయవాదులు కోర్టులలో విచారణ సాగిస్తూనే వచ్చారు.

చిన్నతనంలో తండ్రి హింసాత్మక ప్రవర్తనకు గ్రాంట్ బాధితుడని, అతడు ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ (గర్భవతిగా వున్న తల్లి మద్యం తాగడం వల్ల శిశువుకు కలిగే దుష్ప్రభావం)తో పాటు, తాగొచ్చిన తండ్రి చిన్నతనంలో తనను కొట్టడం వల్ల కలిగిన మెదడు గాయం కారణంగా ఏర్పడిన వ్యాధితో బాధపడుతున్నాడని వాదిస్తూ అతడి తరఫున న్యాయవాదులు మరణశిక్షను తప్పించే ప్రయత్నం చేశారు. అయినా వారి ప్రయత్నాలు ఫలించలేదు. గురువారం మెక్ అలెస్టర్ పట్టణంలోని కారాగారం వద్ద ప్రాణాంతక సూది మందు ఇచ్చి గ్రాంట్ కు మరణశిక్ష అమలు చేశారు. అమెరికాలో 23 రాష్ట్రాలు మరణశిక్షను రద్దు చేశాయి. మరో మూడు రాష్ట్రాలు స్వచ్ఛంద మారటోరియం విధించుకున్నాయి. మిగిలిన రాష్ట్రాల్లో ఇది కొనసాగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles