ED raids Punjab CM’s kin house in illegal sand mining case పంజాబ్ సీఎం చన్నీ మేనల్లుడి ఇంటిపై ఈడీ సోదాలు

Ed raids punjab cm charanjit singh channi s nephew honey s residence

charanjit singh channi, punjab sand mafia, enforcement directorate raids, punjab sand mining, ED raids, Punjab CM, ED raids, Honey, Bhupinder Singh Honey, Charanjit Singh Channi, sand mining case, Punjab, Politics

The Enforcement Directorate (ED) is conducting searches in poll-bound Punjab, including at the premises linked to Punjab Chief Minister Charanjit Singh Channi's alleged relatives in an illegal sand mining case, sources said.The ED raided over 10 locations in the state, including the premises of Bhupinder Singh Honey, who is reportedly a relative of CM Channi, in Mohali.

పంజాబ్ సీఎం చన్నీ మేనల్లుడి ఇంటిపై ఈడీ సోదాలు

Posted: 01/18/2022 02:15 PM IST
Ed raids punjab cm charanjit singh channi s nephew honey s residence

అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపియేతర పార్టీలకు చెందిన నేతలు టార్గెట్ గా మారడం వారి ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయపన్ను, లేదా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన కేంద్ర సంస్థల దాడులు జరగడం గత ఏడేళ్ల కాలంలో సర్వసాధరణంగా మారాయి. దీంతో ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలలో మరోమారు అదే తరహా దాడులు జరగడం దేశప్రజలతో పాటు పంజాబ్ రాష్ట్ర ప్రజలకు కూడా పెద్దగా విస్మయాన్ని కలగించలేదు. పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలని తొలుత కోరిన ముఖ్యమంత్రి చరణ్ జీత్ సింగ్ చన్నీ ప్రజల దృష్టిలో మంచి మార్కులు వేసుకున్న 24 గంటల వ్యవధిలోనే ఆయన బంధువలు ఇళ్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు కలకలం రేపుతున్నాయి.

పంజాబ్‌ ముఖ్యమం‍త్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ మేనల్లుడు భూపేందర్‌సింగ్ హనీ సహా పలువురు సన్నిహితుల ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. హనీ ఇళ్లు, ఆఫీసులతోపాటు పంజాబ్ వ్యాప్తంగా మొత్తంగా 10 చోట్ల ఏకకాలంలో దాడులు జరుగుతున్నాయి. అక్రమ ఇసుక మైనింగ్‌కు సంబంధించిన మనీలాండరింగ్‌  కేసులో ఈ తనిఖీలు చేపట్టినట్టు ఈడీ వర్గాలు వెల్లడించాయి.కాగా చన్నీ మరదలి కుమారుడైన భూపిందర్‌ సింగ్‌ హనీ.. పంజాబ్‌ రియల్టర్స్‌ పేరుతో ఓ సంస్థను నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ ద్వారా అక్రమంగా ఇసుక తవ్వకాలు చేపడుతూ కోట్లలో నల్లదనాన్ని ఆర్జిస్తున్నట్లు ఆరోపణలు రావడంతో ఈ అధికారులు మనీలాండరింగ్‌ కేసు నమోదు చేశారు.

హోమ్‌ల్యాండ్ హైట్స్‌లో ఉన్న‌ చ‌న్నీ మేన‌ల్లుడు భూపింద‌ర్ సింగ్ హనీ ఇంటితో పాటు మొత్తం ప‌ది ప్ర‌దేశాల్లో త‌నిఖీలు జ‌రుగుతున్నాయి. రాష్ట్ర‌వ్యాప్తంగా అక్ర‌మ మైనింగ్ కేసులో ఈ సోదాలు నిర్వ‌హిస్తున్న‌ట్లు ఈడీ చెప్పింది. ఇదిలా ఉండగా మరికొన్ని రోజుల్లో పంజాబ్ లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాజా ఈడీ దాడులు చర్చనీయాంశంగా మారింది. వచ్చేనెల 20వ తేదిన పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.  వివిధ రాజకీయ పార్టీల నుంచి విజ్ఞప్తులు రావడంతో.. ఫిబ్రవరి 14వ తేదీన జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలను ఫిబ్రవరి 20వ తేదీన నిర్వహించాలని నిర్ణయించినట్టు ఈసీ సోమవారం ప్రకటించింది.  వచ్చేనెల 1 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. మార్చి 10న ఎన్నికల ఫలితాలు రానున్నాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles