Darshanam for Devotees who abide rules: Srisailam Temple EO నిబంధనలు పాటించే భక్తులకే శ్రీశైల దేవస్థానంలో దర్శనం

Darshanam for devotees who abide by rules says srisailam temple eo

Srisailam Temple, Devotees, Bhramaramba Mallikarjuna Swamy Temple, Shaktipeetam, temple rules. Lavanna, executive officer, Traditional dress, Andha Pradesh, Devotional

Srisailam Temple has taken a crucial decision. Devotees who visit Bhramaramba Mallikarjuna Swamy and Ammavarla, who are now housed in Srisailam, are required to abide by the temple rules. These rules have always existed .. Usually devotees do not practice them much. Lavanna, the temple's executive officer, advised the devotees that from now on, devotees coming to Srisailam temple must abide by the rules.

నిబంధనలు పాటించే భక్తులకే శ్రీశైలం దేవస్థానంలో దర్శనం: ఆలయ ఈవో

Posted: 01/07/2022 12:33 PM IST
Darshanam for devotees who abide by rules says srisailam temple eo

శ్రీశైలం దేవ‌స్థానం కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. ఇకపై శ్రీశైలంలో కొలువు దీరిన భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్ల దర్శనం చేసుకునే భక్తులు ఆలయ నిబంధనలు పాటించాల్సిందే. ఈ నిబంధనలు ఎప్పట్నించో వున్నా.. సాధారణంగా భక్తులు వాటిని పెద్దగా ఆచరించడం లేదు. దీంతో ఇకపై శ్రీశైలం దేవస్తానానికి వచ్చే భక్తులు తప్పకుండా నిబంధనలు పాటించాల్సిందేనని ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి లవన్న భక్తులకు సూచించారు. ఇకపై శ్రీశైలం దేవస్థానికి వచ్చే భక్తులు.. తప్పకుండా సంప్రదాయ దుస్తుల్లోనే రావాలని ఆయన సూచించారు.

ముఖ్యంగా ఉచిత స్ప‌ర్శ‌ దర్శనానికి వచ్చే భక్తులు సంప్రదాయ దుస్తులు ధ‌రించి వ‌స్తేనే గర్భగుడిలోకి అనుమతిస్తామని ఆయన స్పష్టం చేశారు. సామాన్య భక్తుల అభ్యర్థన మేరకు ఉచిత స‌్పర్శ దర్శనాలను రోజుకు రెండు సార్లు కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. కాగా మంగళవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 2:30 నుంచి 3:30 గంటల వరకు.. తిరిగి సాయంత్రం 6:30 నుంచి 7:30 గంటల వరకు సాధారణ భక్తులకు ఉచితంగా స్ప‌ర్శ‌ దర్శనం చేసుకునేందుకు ఏర్పాట్లు చేశామని ఈవో లవన్న వెల్లడించారు. శ్రీశైలంలో ఫిబ్రవరి 22 నుంచి మార్చి 3 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని ఈవో తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles