Three killed in Hyderabad road accident ఇద్దరు మహిళా జూనియర్ అర్టిస్టులతో పాటు మరోకరు మృతి

3 killed in hyderabad s gachibowli after their car hits tree shatters into pieces

female junior artistes died in Road accident, TV serial artists killed in Road Accident, Bank Employee killed in Road accident, female junior artistes died in GachiBowli accident, TV serial artists killed in drunk and drive case, Accident, Gachibowli accident, Car, Drunken driving, Drink and drive, Hyderabad car accident, Gachibowli accident, Car crash, Hyderabad, Crime

Three people, including two female junior artistes working in television serials, were killed and another person was injured when the car in which they were travelling hit a tree on Saturday, December 18 in Hyderabad. The accident occurred at around 3.30 am near Hyderabad Central University under the limits of Gachibowli Police Station of Cyberabad Police Commissionerate.

ITEMVIDEOS: గచ్చిబౌలి రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళా జూనియర్ అర్టిస్టులతో పాటు మరోకరు మృతి

Posted: 12/18/2021 11:00 AM IST
3 killed in hyderabad s gachibowli after their car hits tree shatters into pieces

హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలీలో ఘోర కారు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో వేగంగా దూసుకొచ్చిన కారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) వద్ద అదుపుతప్పి డివైడర్‌ మధ్యలో ఉన్న చెట్టును ఢీకొట్టింది. సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలోని గచ్చిబౌలి పోలిస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు ఘటనాస్థలంలోనే మృత్యువాత పడ్డారు. మరో యువకుడు తీవ్రంగా గాయపడగా, చికిత్స నిమిత్తం అసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగి క్షతగాత్రుడ్ని అసుపత్రికి తరలించారు.  

ఈ ప్రమాదంలో తెలుగు టెలివిజన్ రంగానికి చెందిన ఇద్దరు మహిళా జూనియర్ అర్టిస్టులతో పాటు కారు నడుపుతున్న బ్యాంకు ఉద్యోగి అక్కడికక్కడే మృతిచెందారు. కారు అతివేగంగా గచ్చిబౌలి నుంచి శేరిలింగంపల్లి వైపు వెళ్తండగా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం వద్ద రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొట్టింది. దీంతో కారు ఏకంగా రెండు భాగాలుగా ధ్వంసమైంది. అయితే కారు ప్రమాదంలో మరణించిన ముగ్గురు మద్యం మత్తులోనే వున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.

మృతులను బ్యాంకు ఉద్యోగైన అబ్దుల్‌ రహీమ్ (విజయవాడ)‌, ఎం మానస (మహబూబ్‌నగర్‌), ఎన్‌ మానస (కర్ణాటక)గా గుర్తించారు. అబ్దుల్‌ రహీం బ్యాంక్‌ ఉద్యోగికాగా, మహిళలు ఇద్దరు జూనియర్‌ ఆర్టిస్టులు. గాయపడిన వ్యక్తి సిద్ధు అలియాస్‌ సాయి సైదులు అని, అతడు కూడా జూనియర్‌ ఆర్టిస్టుగా పనిచేస్తున్నాడని చెప్పారు. వీరు అమీర్‌పేటలోని హాస్టల్‌ ఉంటున్నారని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదానికి మద్యం మత్తు కారణమని క్షతగాత్రుడైన జూనియర్ అర్టిస్టు సాయి సిద్దూ తెలిపాడు.

ఆయన మాటల్లోనే.. ఉదయాన్నే షూటింగ్‌ ఉందని రాత్రి మా ఇంటికి వచ్చారు. సిట్టింగ్‌ వేశాం. ముగ్గురు మందు తాగారు. నేనెం తాగలేదు. అబ్ధుల్‌ బ్లాక్‌ డాగ్‌ తాగాడు. ఇద్దరు అమ్మాయిలు బీర్లు తాగారు.మందు తాగిన తర్వాత రాత్రి ఒంటి గంట సమయంలో టీ తాగుదాం అన్నారు. ఈ టైంలో ఎందుకు బయటకు వెళ్లడం..డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికితే ప్రాబ్లం అవుతుంద‌ని చెప్పాను. అయినా ఆ ఇద్దరు అమ్మాయిలు వినలేదు. టీ తాగుదామని చెప్పారు. తోడు వెళ్లకపోతే బాగోదని నేను కూడా వెళ్లాను. నాకు డ్రైవింగ్‌ రాదు. అబ్దుల్‌ కారు నడిపాడు. అప్పటికే బాగా తాగేసి ఉన్నాడు. గచ్చిబౌలి నుంచి స్పీడ్‌గా వస్తుంటే ప్రమాదం జరిగింది. నేను మందు తాగలేదు. నాకు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్ట్‌ చేస్తే జోరో వచ్చింది అని పేర్కొన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles