Hindu woman assaulted by mob for wearing burkha బురుఖా ధరించిందని హిందూ మహిళపై దాడి

Hindu woman assaulted by mob for wearing burkha two arrested

Maharashtra police, Maharashtra mob attack, Maharashtra crimes, Maharashtra woman attacked, Maharashtra woman safety, Maharashtra couple arrests, Burkha, hindu woman, assault, Muslim woman, Akola district, Maharashtra, Crime

Two persons have been arrested for beating up a couple in Akola district of Maharashtra, police said. The arrested persons were part of a mob that attacked the couple and also assaulted their friend after purportedly finding out that the woman was wearing a burkha despite being a Hindu.

బురుఖా ధరించిందని హిందూ మహిళపై దాడి

Posted: 12/13/2021 08:22 PM IST
Hindu woman assaulted by mob for wearing burkha two arrested

బురుఖా ధరించడం పట్ల అయిష్టతను వ్యక్తం చేసేవాళ్లు ఉన్నారు.. దానిని ధరించేందుకు ఇష్టపడిన వాళ్లూ వున్నారు. అయితే కోందరు మాత్రం తమ ఐడెంటికీ బయటపడటం ఇష్టంలేని వారు కూడా దీనిని ధరిస్తున్నారు. అలాంటి ఓ మహిళ బురఖాను ధరించి వెళ్తుండగా, కొందరు యువకులు గమనించారు. అమె బురఖా ధరించే మైనరిటీ వర్గానికి చెందని మహిళ అని.. హిందూ వర్గానికి చెందిన మహిళ అని గుర్తించడంతో ఆగ్రహంతో రెచ్చిపోయారు. నడిరోడ్డుపై సదరు మహిళపై దాడి చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో జరిగింది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు వీడియో ఆధారంగా కేసును సుమోటోగా నమోదు చేసుకుని ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్రలోని  అకోలా జిల్లా ఉరల్ పోలీస్ స్టేషన్ పరధిలో గత వారం ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఓ జంట, వారి స్నేహితుడు బైక్‌పై వెళ్తుండగా, ఓ అకతాయి మూక వారికి తారసపడింది. వారిని అడ్డగించిన ఈ మూక వారిని హిందువులని గ్రహించడంతో వారిపై దాడి చేసింది. మహిళ ఒంటిపై నున్న బురఖాను తీయించింది. అయితే ఇందుకు సంబంధించిన ఘటనను ఎవరో స్థానికులు వీడియో తీసి నెట్టింట్లో పెట్టారు.

అది కాస్తా వైరల్ కావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. మహిళను ఈ విషయమై విచారించారు. కాగా, ఈ ఘటన గురించి కానీ, లేదా తాను బురఖా ధరించి వెళ్లిన విషయం కానీ ఎక్కడ తమ తల్లిదండ్రులకు తెలిస్తే.. విషయం పెద్దగా అవుతుందోనన్న భయంతో తాను కేసు పెట్టలేనని మహిళ పోలీసులకు చెప్పింది. అయితే పోలీసులు మాత్రం మరోమారు తల్లిదండ్రులకు తెలియకుండా ఇలాంచి చర్యలు చేస్తే బాగుండదని హెచ్చిరించి అమెను వదిలిపెట్టారు. కాగా, వీడియో ఆధారంగా ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోమారు ఇలాంటి ఘటనలకు పాల్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Burkha  hindu woman  assault  Muslim woman  Akola district  Maharashtra  Crime  

Other Articles