TTD New year calenders and diaries available online తిరుమల శ్రీవారి క్యాలెండర్లు, డైరీలు ఇకపై హోం డెలివరీ.!

Ttd new year calenders and diaries available online in amazon

Lord Venkateshwara Swamy, Devotees, Home Delivery, Amazon, Diaries, Calenders, Tirumala Tirupati Devasthanam Board, Andhra pradesh, Devotional

The Tirumala Tirupati Devasthanams (TTD) Board had taken a good decision for the devotees of Lord Sri Venkateshwara Swamy. The New Year Calenders, diaries are available devotees online now. Apart from TTD offices and TTD online website, the diaries and calenders are now available for Home Delivery even in Amazon E-commerce site.

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఇకపై క్యాలెండర్లు, డైరీలు హోం డెలివరీ.!

Posted: 12/08/2021 11:36 AM IST
Ttd new year calenders and diaries available online in amazon

కలియుగ వైకుంఠంలా బాసిల్లుతున్న తిరుమల తిరుపతి దేవస్థానం దేవదేవుడైన శ్రీవెంకటేశ్వరుడి భక్తుల కోసం టీటీడీ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో ఇన్నాళ్లు సరిగ్గా నూతన సంవత్సర నేపథ్యంలో కాస్తా అటుఇటుగా వెళ్లే భక్తులకు మాత్రమే అందుబాటులో ఉండే అపురూప వస్తువులు ఇకపై హోం డెలివరీతో భక్తులందరికీ అందుబాటులోకి రానున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ రోజునే ఏమి ఆచరిస్తారో తెలుసుకోవడంతో పాటు వారినే ఫాలో అవుతూ అనేక మంది తెలుగు రాష్ట్రాల భక్తులతో పాటు యావత్ భారత దేశ భక్తులకు అనవాయితీగా వస్తోంది.

ఇందుకోసం సరిగ్గా నూతన సంవత్సరం సమయంలో ఒక నెల ముందు వెనుక శ్రీవారి దర్శనానికి వెళ్లిన భక్తులు తప్పనిసరిగా అక్కడి నుంచి తెచ్చుకునే అపరూపమైన కానుక.. దేవాలయ క్యాలెండర్. ఈ క్యాలెండర్లు, డైరీల కోసం ఏ భక్తులు తిరుపతి వెళ్తున్నారని తెలిసినా వారిని కోరే చిన్న కోరిక క్యాలెండర్ తీసుకురమ్మనే. తిరుమల లడ్డూ ఎంత ప్రాముఖ్యత సంతరించుకుందో.. అదే విధంగా నూతన సంవత్సర ఆగమనంలో తిరుమల శ్రీవారి క్యాలెండర్ కూడా అంతే విశిష్టమైనదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దీంతో తాజాగా టీటీడీ బోర్డు శ్రీవారి భక్తులందరీకీ ఈ అపురూప కానుకను అందించేలా నిర్ణయం తీసుకుంది.

ఇకపై టీటీడీ క్యాలెండర్లు, డైరీలు భక్తులందరికీ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటివరకు టీటీడీ కేంద్రాలు, తిరుమలలో అందుబాటులో ఉన్న డైరీ, క్యాలెండర్లు, ఇకపై ఆన్ లైన్ లోనూ భక్తుల అందుబాటులోకి రానున్నాయి. టీటీడీ వెబ్ సైట్‌, అమెజాన్‌ పోర్టల్ లో అందుబాటులో ఉంచింది. ఈ నేపథ్యంలో ఆన్ లైన్‌లో కూడా క్యాలెండర్లు, డైరీలు బుక్‌ చేసుకోవచ్చని దేవస్థాన అధికారులు తెలిపారు. 12 పేజీల క్యాలెండర్‌ రూ.130, పెద్ద డైరీ రూ.150, చిన్నడైరీ రూ.120, టేబుల్‌ టాప్‌ క్యాలెండర్‌ రూ.75, శ్రీవారి పెద్ద క్యాలెండర్‌ రూ.20, శ్రీపద్మావతి అమ్మవారి క్యాలెండర్‌ రూ.15, శ్రీవారు, శ్రీ పద్మావతి అమ్మవారి క్యాలెండర్‌ రూ.15, తెలుగు పంచాంగం క్యాలెండర్‌ రూ.30గా నిర్ణయించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles