TTD again appeals to public not to believe fake news regarding jobs టీటీడీలో ఉద్యోగాలు: దళారుల మాటలు నమ్మి మోసపోకండీ

Ttd again appeals to public not to believe fake news on social media regarding jobs

Tirumala Tirupati Devasthanam, Tirumala darshan, YV Subba Reddy, TTD Chairman, Notification, jobs at Tirumala, TTD jobs, mediators, cheaters, Employment in Tirumala, Tirumala darshan, Tirumala jobs notification, Tirumala tirupati devasthanam jobs notification, TTD Board, Dharma reddy, Andhra Pradesh, devotional

Tirumala Tirupati Devasthanams had once again appealed to the public not to believe fake news on social media as well as not to fall prey to middlemen regarding jobs in TTD. In a statement, TTD has said that inspite of its repeated cautions on not to believe such fake news, some people are getting cheated by miscreants.

టీటీడీలో ఉద్యోగాలు: దళారుల మాటలు నమ్మి మోసపోకండీ

Posted: 12/06/2021 03:21 PM IST
Ttd again appeals to public not to believe fake news on social media regarding jobs

కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీనివాసుడి దర్శనభాగ్యం కోసమే భక్తజనకోటి ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. అలాంటిది ఇక నిత్యం ఆ దేవదేవుడి పాదల చెంతనే ఉంటూ సేవలు చేసుకునే బాగ్యం ఎందరికి దక్కుతుంది. అయితే ఇలా కనీసం కలలోనూ సాధ్యపడని కోరికను.. సాక్ష్యాతత్కారమయ్యేట్లు చేస్తామని నమ్మించి.. దేపువి పేరు చెప్పుకుని ఆయన పేరుపైనే మోసాలకు పాల్పడే దగుల్బాజీలకు కొదవలేదు. అయితే వీరి పట్ల అప్రమత్తంగా వుండాలని అందరికీ ఆ దేవదేవుడు చెప్పలేడు కానీ.. ఆ కార్యాన్ని తమ భుజస్కంధాలపై వేసుకున్న తిరుమల తిరుపది దేవస్థానం (టీటీడీ) బోర్డు మాత్రం హచ్చరికలు జారీ చేసింది.

తిరుమల తిరుపతి దేవస్థానంలో వివిధ ఉద్యోగాల నియామకాల జరుగుతున్నాయన్న విషయంలో దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) హెచ్చరించింది. టీటీడీలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరు దళారులు సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు గుప్పిస్తున్నారని, ఇలాంటి ప్రకటనలను నమ్మొద్దని కోరింది. గతంలోనూ కొందరు అమాయకులు ఇలాంటి ప్రకటనలకు ఆకర్షితులై మోసపోయారని పేర్కొంది. కాబట్టి సామాజిక మాధ్యమాల్లో వచ్చే ఇలాంటి ప్రకటనలను నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది.

ప్రజలను మోసం చేస్తున్న ఇలాంటి వారిపై గతంలోనూ పలు కేసులు నమోదయ్యాయని, ఇకపై కూడా తమ పిర్యాదుల మేరకు పోలీసులు చర్యలు తీసుకోనున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తెలిపింది. నిజంగానే తాము ఉద్యోగాల భర్తీ చేపడితే ముందుగా పత్రికల్లోను, టీటీడీ వెబ్‌సైట్‌లోనూ అధికారికంగా ప్రకటన ఇస్తామని పేర్కొంది. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి ప్రకటనలను విశ్వసించవద్దని, అలాంటి ప్రకటనలు చేసే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles