Instead Of Coconut, Brand-New UP Road Cracked Open బీజేపి ఎమ్మె్ల్యేకు వింత అనుభవం: కొబ్బరికాయ కోడితే రోడ్డుకు పగుళ్లు..

Newly constructed road cracks as mla slams coconut to inaugurate it

BJP MLA, BJP MLA Suchi Chaudhary, coconut, road inauguration, road, bijnor, Quality check, Uttar Pradesh

In Uttar Pradesh (UP)'s Bijnor, when a Bharatiya Janata Party (BJP) MLA smashed a coconut on a road to mark its inauguration, what cracked was not the woody fruit but the newly built road underneath it. As gravel came off from the stretch of land, presumably due to poor quality of new road, BJP MLA Suchi Chaudhary sat on a protest, demanding a probe into the construction.

ITEMVIDEOS: బీజేపి ఎమ్మె్ల్యేకు వింత అనుభవం: కొబ్బరికాయ కోడితే రోడ్డుకు పగుళ్లు..

Posted: 12/03/2021 09:34 PM IST
Newly constructed road cracks as mla slams coconut to inaugurate it

మరికొద్ది రోజుల్లో ఎన్నికలకు వెళ్లాల్సిన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఐదేళ్లుగా ప్రజలు కొరిన అభివృద్దిని అఘమేఘాల మీద చేపట్టేందుకు అక్కడి అధికారులకు ప్రభుత్వం అనుమతిని మంజూరు చేసిందో ఏమో తెలియదు కానీ.. అధికారుల అవినీతి పర్వం మాత్రం తారాస్థాయికి చేరిందన్న అరోపణలు మాత్రం వినిపిస్తున్నాయి. అయితే ఈ అరోపణలు చేసింది ఆ రాష్ట్ర ప్రజలు అనుకుంటే పోరబాటే.. ఎందుకంటే అ అరోపణలు చేసి.. అధికారులు అక్కడికి వచ్చేలా చేసింది రాష్ట్రంలో కొలువుదీరిన యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలోని బీజేపి ఎమ్మెల్యే కావడం గమనార్హం.

ఎన్నికల వేళ సర్వసాధరనమైన ప్రారంభోత్సవాలు, శంఖుస్థానపలకు స్థానిక ఎమ్మెల్యేలను పిలవడం ఆనవాయిది. అయితే ఇదే ఆనవాయితి ప్రకారం రోడ్డు ప్రారంభోత్సవానికి వెళ్లిన ఆ బీజేపి మహిళా ఎమ్మెల్యేకు వింత అనుభవం ఎదురైంది. కొత్తగా వేసిన రోడ్డును ప్రారంభించేందుకు వెళ్లిన ఆమె.. రోడ్డుపై కొబ్బరికాయ కోట్టింది. అయితే కొబ్బరికాయ పగలకపోగా ఏకంగా రోడ్డు పగులిచ్చింది. దీంతో రోడ్డు నాణ్యతపై ఆమె నోరెళ్లబెట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో ఈ ఘటన జరిగింది. దీంతో రో్డ్డు నాణ్యత ప్రమాణాల పరీక్షల కోసం అక్కడే మూడు గంటల పాటు వేచివున్నారు.

ఘటనకు సంబంధంచిన వివరాల్లోకి వెళ్తే.. సదర్ నియోజకవర్గంలో 7.5 కిలోమీటర్ల మేర రోడ్డును ఇరిగేషన్‌ శాఖ రూ.1.16 కోట్ల వ్యయంతో పునర్నిర్మించింది. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే సుచి మౌసం చౌదరిని ఈ రోడ్డు ప్రారంభోత్సవానికి అధికారులు పిలిచారు. శుక్రవారం సాయంత్రం ఆమె పూజలు చేసి రోడ్డుపై కొబ్బరికాయ కొట్టారు. అయితే టెంకాయ పగలకపోగా రోడ్డు పగులిచ్చింది. దీంతో రోడ్డు నాణ్యతపై మహిళా ఎమ్మెల్యే సుచి చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు ప్రారంభోత్సవాన్ని నిలిపివేశారు.

మూడు గంటలపాటు అక్కడే ఉంచి రోడ్డు మెటిరియల్‌ శాంపిల్స్‌ను సేకరించి నాణ్యత పరిశీలన కోసం పంపారు. నాసిరకంగా రోడ్డు నిర్మించిన ఇరిగేషన్‌ శాఖ అధికారులపై చర్యలు చేపడతామని చెప్పారు. దర్యాప్తునకు కమిటీని ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌కు తెలిపారు. మరోవైపు రోడ్డు నిర్మాణంలో ఎలాంటి అవినీతి జరుగలేదని బిజ్నోర్ నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వికాస్ అగర్వాల్ చెప్పారు. ఎలాంటి అనుమానాలు లేకుండా ఉండేందుకు దర్యాప్తు జరుపాలని జిల్లా కలెక్టర్‌ను కోరినట్లు వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BJP MLA  BJP MLA Suchi Chaudhary  coconut  road inauguration  road  bijnor  Quality check  Uttar Pradesh  

Other Articles