Woman socialite picked up for multi-crore cheating సినీప్రముఖులను కోట్ల రూపాయల మేర ముంచిన మాయలాడి అరెస్టు

Telugu film producer shilpa arrested on cheating charges in hyderabad

page3 party, Shilpa arrested, producer Shilpa, Shipa chowdary, Tollywood heroes, film personalities, filmmakers, realtors, investments, high returns, cheating, Fraud, black money, high profile people, Narsingi police, Hyderabad, crime

The Narsingi police have arrested Shilpa Chowdary, a film producer from the Telugu film industry on charges of cheating. Police sources said Shilpa had allegedly collected several crores of rupees from film personalities, filmmakers, realtors and others in the form of investments by promising them high returns and cheated them.

సినీప్రముఖులను కోట్ల రూపాయల మేర ముంచిన మాయలాడి అరెస్టు

Posted: 11/27/2021 11:47 AM IST
Telugu film producer shilpa arrested on cheating charges in hyderabad

టాలీవుడ్ హీరోల‌తో పాటు సినీప్రముఖులు, రియల్టర్లను, అధికవడ్డీ ఆశతో బోల్తా కొట్టించి.. వందల కోట్ల మేర డబ్బును వసూలు చేసిన వ్యాపార‌వేత్త, సినీ నిర్మాత శిల్పా చౌద‌రీని పోలీసులు అరెస్టు చేశారు. డబ్బును చెట్లకు కాసేలా అధికవడ్డీ ఇస్తామని మాయమాటలు చప్పడంతో పాటు నల్లడబ్బును రూటు మార్చి సక్రమమైనదిగా తీసుకోస్తామని అనేక మందికి శఠగోపం పెట్టిన మాయలాడిని సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమెతో పాటు తన స్థాయిలో మోసాలకు పాల్పడిన అమె భర్తను కూడా పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు.

కిలాడి శిల్ప వ‌ల‌లో మోస‌పోయిన వారిలో ముగ్గురు హీరోలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. మోస‌పోయిన‌వారి జాబితాలో ఇంకా వ్యాపార‌వేత్త‌లు, ఫైనాన్షియ‌ర్లు, రియాల్ట‌ర్లు, లాయ‌ర్లు కూడా ఉన్నారు. డ‌బ్బులు తీసుకుని మోసం చేసిందంటూ శిల్ప‌పై పోలీసులకు బోల‌డ‌న్ని ఫిర్యాదులు అందుతున్నాయి. ప్ర‌ముఖుల పేర్లు చెప్పి మ‌రీ శిల్ప మోసాల‌కు పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. సుమారు 200 కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల పేరుతో కుచ్చు టోపీ పెట్టిన‌ట్లు తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన మ‌రిన్ని విష‌యాలు అందాల్సి ఉంది.

ఫేజ్ త్రీ పార్టీ లు ఇచ్చి సెలబ్రిటీలను ఆకర్షించిన శిల్ప వారి నుంచి భారీ మొత్తంలో డ‌బ్బులు వ‌సూల్ చేసింది. సుమారు 100 నుంచి 200 కోట్ల రూపాయల వరకు వారికి కుచ్చు టోపీ పెట్టిందామె. చాలామంది ప్రముఖుల్ని శిల్ప మోసం చేసిన‌ట్లు వార్త‌లు అందుతున్నాయి. ఆధిక వడ్డి ఇస్తానని చెప్పి శిల్ప కోట్లు వసూలు చేసింది. శిల్పతో పాటు ఆమె భర్తను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. న‌ల్ల‌ధ‌నాన్ని మార్పిస్తాన‌ని, అధిక వ‌డ్డీ ఇస్తాన‌ని చెప్పి శిల్పి.. ప్ర‌ముఖుల్ని మోసం చేసింది. మోస‌పోయిన‌వారిలో చాలా మంది బాధితులు ఉంటార‌ని పోలీసులు భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles