Jee mains successful student seeks financial aid సరస్వతీ పుత్రుడికి లక్ష్మీ కటాక్షాన్ని అందిద్దాం.. ఇలా..

Iit bhubaneshwar successful entrant seeking help for continuing his studies

Jee mains, orphan student, Raju Nayak, IIT-Bhubaneshwar, Rs 10 Lakhs, kind hearted people, Financial help, nalgonda, Telangana

Jee mains successful student Raju Nayak has secured his seat in IIT-Bhubaneshwar, but it is hard for him to complete the course as he had to pay nearly Rs 10 Lakhs, For which this Orphan seeks help from kind hearted people to continue his studies

సరస్వతీ పుత్రుడికి లక్ష్మీ కటాక్షాన్ని అందిద్దాం.. ఇలా..

Posted: 11/23/2021 12:34 PM IST
Iit bhubaneshwar successful entrant seeking help for continuing his studies

సరస్వతీ పుత్రుడిగా ఆ అమ్మవారి కరుణా, కృపాకటాక్షాలు మెండుగా పొందిన యువకుడు రాజు నాయక్. భవిష్యత్తులో దేశం ఒక గర్వించదగ్గ ఇంజనీరుగా ఎదగడం ఖాయం. అయితే అలాంటి గర్వించదగ్గ ఇంజనీరుకు దేశానికి కావాలంటే.. దేశ ప్రజలు కూడా ఓ పని చేయాలి. మీకు తోచినంత ఆర్థిక సాయాన్ని రాజునాయక్ కు అందించి.. లక్ష్మీకటాక్షం పోందేలా చేయడమే. అదేంటి అతడి తల్లితండ్రులు లేరా అంటే.. నిజంగానే లేరు. రాజా నాయక్ అనాధ. తల్లిదండ్రులు ఉండి.. వారి చలువ నీడలో ఏ కాయకష్టం తెలియకుండా చదువుతున్న విద్యార్థులందరినీ తోసిరాజుతూ రాజు నాయక్ చదువులలో బాగా రాణించాడు.

లక్షల మంది విద్యార్థులు రాసినా.. వేలాది మందికి మాత్రమే స్థానం లభించే ఐఐటీలోనూ స్థానం సంపాదించాడు. ఇప్పుడు ఆ విద్యను అందుకోవడం కోసమే రాజు నాయక్ కు దాదాపు పది లక్షల రూపాయలు అవసరం. అయితే రేపటిలోగా రూ.20 వేలు కడితేనే ఆ సీటు ఉంటుందని ఐఐటీ యాజామాన్యం తేల్చచెప్పింది. దీంతో ఆయనకు సాయం చేయాలనుకునే వారు.. తమకు తోచిన విధంగా ఎంతోకొంత సాయాన్ని అందిస్తారని ఆశిస్తున్నాడు. యూనియన్‌ బ్యాంక్‌ కొత్తపేట బ్రాంచి అకౌంట్‌ నంబర్‌ 019210011907440, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ UBIN0801925 ద్వారా తనకు ఆర్థిక సహాయం అందించాలని వేడుకొంటున్నాడు.

రాజునాయక్ అమ్మనాన్న చిన్నప్పుడే చనిపోయారు.. అనాథాశ్రమంలో పెరిగాడు.. అద్భుత ప్రతిభ ఉన్న ఆ యువకుడు దేశంలో ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ఐఐటీ-భువనేశ్వర్ లో సీటు సంపాదించాడు. కానీ, చదువుకొనేందుకు ఆర్థిక స్థోమత లేక దాతల కోసం ఎదురుచూస్తున్నాడు. నల్లగొండ జిల్లా నేరేడుగొమ్ము మండలం జోడుబాయి తండాకు చెందిన రాజానాయక్‌ తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోవటంతో హైదరాబాద్‌లోని చిత్రలేఅవుట్‌ కాలనీలో ఉన్న అనాథాశ్రయంలో పెరిగాడు. పదో తరగతిలో 98 శాతం మార్కులు సాధించడంతో నారాయణ కాలేజ్ ఉచితంగా ఇంటర్ విద్యను అందించింది. ఇంటర్‌లో 96 శాతం మార్కులు సాధించిన రాజు.. జేఈఈ మెయిన్‌లో ఉత్తమ ప్రదర్శన కనబర్చి ఐఐటీ- భువనేశ్వర్‌లో కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో సీటు సాధించాడు.

అయితే, 8 సెమిస్టర్ల చదువుకు రూ.6.74 లక్షలు, నాలుగేండ్ల హాస్టల్‌, భోజన వసతికి రూ.1.60 లక్షలు, ఇతర ఖర్చులకు రూ.1.46 లక్షలు, అడ్మిషన్‌కు రూ.20 వేలు.. మొత్తంగా రూ.10 లక్షల వరకు ఖర్చు అవుతున్నది. ఈ నెల 24 లోపు రూ.20 వేలు చెల్లించి సీటు రిజర్వు చేసుకోవాల్సి ఉంది. అంత డబ్బు కట్టలేక రాజానాయక్‌ దాతల సహాయాన్ని కోరుతున్నాడు. యూనియన్‌ బ్యాంక్‌ కొత్తపేట బ్రాంచి అకౌంట్‌ నంబర్‌ 019210011907440, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ UBIN0801925 ద్వారా తనకు ఆర్థిక సహాయం అందించాలని వేడుకొంటున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles