Mudragada Padmanabham writes letter to Chandrababu చంద్రబాబుకు ముద్రగడ లేఖ.. ‘‘మీ పతనం నా కళ్లతో చూడాలని..’’

Mudragada padmanabham pens an open letter to tdp chief chandrababu naidu

Mudragada Padmanabham, former minister, Kapu JAC former Leader, open letter, TDP Chief, TDP Regime, Chandrababu Naidu, Kapu Reservations, Andhra Pradesh, politics, Crime

Former minister and prominent Kapu community leader, Mudragada Padmanabham writes an open letter TDP Chief Nara Chandrababu Naidu in which he explains how he had undergone the pain in TDP regime during the fight for Kapu Reservations.

చంద్రబాబుకు ముద్రగడ లేఖ.. ‘‘మీ పతనం నా కళ్లతో చూడాలని..’’

Posted: 11/23/2021 11:18 AM IST
Mudragada padmanabham pens an open letter to tdp chief chandrababu naidu

మాజీ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి లేఖ రాశారు. ఆయనకు అసెంబ్లీలో జరిగిన పరాభవం గురించి.. ఆ తరువాత ఆయన మీడియాలో కన్నీళ్ల పర్యంతం కావడమే కాకుండా.. వెక్కి వెక్కి ఏడవటంపై కూడా ముద్రగడ ప్రస్తావించారు. చంద్రబాబు లాంటి రాక్షసానందం పోందే వ్యక్తికి కూడా కన్నీళ్లు ఇచ్చావా దేవుడా అని ఆశ్చర్యపోయానని అన్నారు. ఎన్నికల నేపథ్యంలో తమ జాతికి ఇచ్చిన హామీలను నిలపెబట్టుకోవాలని ఉద్యమం చేస్తే.. తనను.. తన భార్యను, తన కుమారుడు, కోడలు, మనవారాలితో పాటుగా మొత్తం కుటుంబాన్ని అనేక చిత్రహింసలకు గురిచేసి.. వాటిని భరించలేక తాము ఆత్మహత్యకు ఒడిగట్టాలని చర్యలు చేపట్టలేదా.? అని ప్రశ్నించారు.

అప్పుడు తాము అనుభవించిన మానసిక క్షోభ నీ వెక్కివెక్కి ఏడ్చిన దానికన్నా వంద రెట్లు అధికమని అన్నారు. తాను రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిని కాదని.. కేవలం తమ సామాజిక వర్గానికి ఎన్నికల మానిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఉద్యమించినందుకు తనను ఎంతగా అవమానించాడో ఆయనకు అప్పడు తెలియదు.. కనీసం ఇప్పుడైనా తెలుసుకోవాలి. కాపు రిజర్వేషన్లను అమలు చేయాలని ఉద్యమం చేస్తే.. తనను.. తన కుటుంబాన్ని చాల హేయమైన రీతిలో అన్ని విధాలుగా  అవమాన పరిచారని అన్నారు. మీ కుమారుడు లోకేష్ ఆదేశాలతో పోలీసులు తనను బూటు కాలితో తన్నారు. తన కుటుంబ సభ్యులందరినీ బూతులు తిడుతూ లాఠీలతో కొట్టారని అరోపించారు.

14 రోజుల పాటు ఆస్పత్రి గదిలో తనను తనతో పాటు తన భార్యను ఏ కారణంతో బంధించారో చెప్పాలి. కనీసం సాన్నం చేయడానికి నీళ్లు కూడా ఇవ్వకుండా హింసించిన ఘటనలు మీకు గుర్తులేవా.? అని ప్రశ్నించారు. మీ రాక్షస ఆనందం కోసం ఆస్పత్రిలో మా దంపతులను ఫోటోలు తీయించి చూసేవారని అరోపించారు. మీ హయాంలో కాపు కుల రిజర్వేషన్ల కోసం పోరాడిన తనపై.. మీ హయాంలో చేసిన హింస తాలుకూ అవమానాన్ని తట్టుకోలేక ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపామని అవేదన వ్యక్తం చేశారు. అణిచివేతతో మా కుటుంబం ఆత్మహత్యకు పూనుకోవాలన్నది మీ ప్రయత్నం కాదా?. అని ప్రశ్నించారు.

అయితే కాలక్రమేనా ఆత్మహత్య దిశగానూ అలోచనలు వెళ్లాయని.. అయితే ఇన్నాళ్లు పోరాటయోధుడిగా వున్న తాను ఆత్మవంచన చేసుకోలేక బతికి ఉన్నానని అన్నారు. భూమి గుండ్రంగా వుందని, తన కుటుంబాన్ని అవమానపరచిన చంద్రబాబు పతనం తన కళ్లతో చూడాలనే ఉద్దేశంతోనే ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమించుకున్నానని అన్నారు. తన కుటుంబాన్ని ఎంతగానో అవమానించిన మీ నోటి వెంట ఇప్పడు ముత్యాల్లాంటి వేదాలు వస్తున్నాయి. సానుభూతి పొందే అవకాశం చేస్తున్నారు. కానీ నా విసయంలో మాత్రం సానుభూతి రాకుండా మీడియాను బంధించి అనాధను చేయలేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు శపధాలు.. నీటి మీద రాతలని' ముద్రగడ తన లేఖలో రాసుకొచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles