Train slices Amazon delivery truck in two వ్యాన్ రెండు ముక్కలైనా.. పుట్టినరోజునే పునర్జన్మ

Lucky amazon delivery truck driver survives on his birthday after amtrak train hits

Amazon Truck, breaks into Two, Jefferson County, Milwaukee, Amazon delivery driver, Alexander Evans, Amtrak train, Wisconsin, acific Northwest to Chicago, US, America

An Amazon driver is grateful to be alive after his delivery van was flattened and split in half in a collision with an Amtrak train in Wisconsin on his 33rd birthday. Father-of-two Alexander Evans told how he had been delivering packages along a road that runs parallel to a track west of Milwaukee last Wednesday.

అదృష్టవంతుడితడే: వ్యాన్ రెండు ముక్కలైనా.. పుట్టినరోజునే పునర్జన్మ

Posted: 11/22/2021 02:40 PM IST
Lucky amazon delivery truck driver survives on his birthday after amtrak train hits

భూమ్మిద నూకలు ఇంకా వున్నాయరా.. నీకు.. అందుకనే ఎన్ని వెధవ వేషాలు వేసినా.. ఏమీ కాకుండా బతికిపోతున్నావ్ అంటూ ఎటకారంగా గ్రామాల్లోని పెద్దలు పిల్లలను మందలించడం సహజమే. అయితే ఇక్కడ ఈ వ్యాన్ డ్రైవర్ మాత్రం నిజంగా భూమ్మిద బియ్యం ఇంకా వున్నాయి కాబట్టే అత్యంత భయానక ప్రమాదానికి గురైనా.. వెంట్రుకవాసిలో మరణం అంచుల నుంచి తప్పించుకున్నాడు. అందులోనూ సరిగ్గా ఆయన తన పుట్టినరోజునాడే పునర్జన్మను పోందాడు. ఇద్దరు పిల్లల తండ్రైన అలెగ్జాండర్‌ ఈవాన్స్  నడిపించుకుంటూ వెళ్తున్న వాహనాన్ని శరవేగంగా వెళ్తున్న రైలు ఢీకొట్టింది.

ఈ ఘటనకు లోనుకాగానే వ్యాన్ డ్రైవర్ తన ప్రాణాలు పోయాయని.. తనకు పుట్టినరోజునాడే మరణాన్ని కూడా పైవాడు రాసిపెట్టాడేమోనని భయాందోళనకు గురయ్యాడు. అంతేకాదు అంతలోనే తాను నడుపుతున్న వ్యాన్ ను ఢీకొట్టేలా వస్తున్న ప్యాసింజర్ రైలు వస్తోంది. దీంతో ఇదే తన చివరి క్షణం అనుకునేలోపు సృహ్కోల్పోయాడు. అంతే కొంత సేపటికి లేచి చూడగానే.. అంతా యధాతథంగా వుంది. దీంతో తాను చనిపోలేదని, తాను బతికే ఉన్నానని సంతోషపడ్డాడు. అయితే అదే సమయంలో తన వ్యాను మాత్రం రెండు ముఖ్కలైందని తెలుసుకుని సమాచారాన్ని తన కంపెనీకి అందించాడు.

ఈ ఘటన అమెరికాలోని విస్కాన్సిన్ లో ఈ ప్రమాదం జరిగింది. అమెజాన్ డెలివరీ వ్యాన్ డ్రైవర్ అలెగ్జాండర్ ఎవాన్స్ అనే 33 ఏళ్ల యువకుడు డెలివరీ కోసం విస్కాన్సిన్ ప్రావిన్స్ కు బయలుదేరి వెళ్లాడు. మార్గమధ్యంలో మిల్వాకీ వద్ద ఎలాంటి నిడ్నళ్లు కానీ, రెడ్ లైట్స్ కానీ లేకుండానే రైల్వే ట్రాకులు వున్నాయని.. దాంతో వాటిపైకి తాను మామూలుగా వెళ్లిపోయానన్నాడు. ‘‘ట్రాక్‌పైకి వెళ్లేసరికి ఒక్కసారిగా రైలు శబ్దం. వెంటనే తేరుకుని వేగం పెంచాను. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. వ్యాన్‌ రెండు ముక్కలైంది. నేను మాత్రం బతికే ఉన్నాను. అంత పెద్ద ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డానో ఇప్పటికీ ఆశ్చర్యమే’’అని అలెగ్జాండర్‌ పేర్కొన్నాడు. అన్నట్టు.. ఆ రోజునే అతడు 33వ ఏట అడుగుపెట్టాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles