Indian-origin Raja Chari led NASA- SpaceX mission అమెరికా స్పేస్‌ ఎక్స్‌కు తెలుగు తేజం రాజాచారి నేతృత్వం

Spacex delivers raja chari led crew of 4 to station glorious sight

space x, spacex crew, spacex raja chari, SpaceX, NASA, SpaceX crew launch, SpaceX rocket, International Space Station, SpaceX astronauts, Raja Chari, Indian-origin astronaut, News, NASA mission, Crew 3, SpaceX, science news

A SpaceX capsule carrying four astronauts pulled up Thursday at the International Space Station, their new home until spring. It took 21 hours for the flight from NASA’s Kennedy Space Center to the glittering outpost. The one German and three U.S. astronauts said it was an emotional moment when they first spotted the space station 30 kms distant — “a pretty glorious sight,” according to Raja Chari, commander of the Dragon capsule.

ITEMVIDEOS: తెలుగు సంతతి రాజాచారి నేతృత్వంలో ఐఎస్ఎస్ కు చేరిన ‘క్రూ-3’ మిషన్‌

Posted: 11/12/2021 12:02 PM IST
Spacex delivers raja chari led crew of 4 to station glorious sight

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా, ప్రైవేట్‌ రాకెట్‌ కంపెనీ స్పేస్‌ ఎక్స్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘క్రూ-3’ మిషన్‌ విజయవంతంగా అంతరిక్ష పరిశోధనా కేంద్రానికి చేరుకుంది. ఈ మిషన్‌కు తెలుగు సంతతికి చెందిన రాజాచారీ నేతృత్వం వహించారు. నలుగురు వ్యోమగాములున్న క్రూ డ్రాగన్‌ స్పేస్‌ క్రాఫ్ట్ ను ఫాల్కన్‌ 9 రాకెట్‌ నింగిలోకి తీసుకెళ్లింది. 22 గంటల అనంతరం రాకెట్‌ నుంచి విడిపోయిన స్పేస్‌క్రాఫ్ట్‌ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకుంది. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 9 గంటలకు ఫ్లోరిడాలోని నాసా కెనడీ స్పేస్‌ సెంటర్‌ నుంచి ఫాల్కన్‌ 9 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది.

క్రూ-3 మిషన్‌కు రాజాచారి కమాండర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయనతో పాటు అమెరికా నేవీ సబ్‌మెరైన్‌ అధికారి కేలా బారన్‌, నాసాకు చెందిన టామ్‌ మార్ష్‌బర్న్‌ పైలట్‌గా, ఐరోపా అంతరిక్ష పరిశోధన సంస్థకు చెందిన మత్తియాస్‌ మౌరర్‌ వెళ్లారు. వీరు 6 నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో ఉండనున్నారు. మెటీరియల్‌ సైన్స్‌, హెల్త్‌ టెక్నాలజీ, అంతరిక్షంలో మొక్కల పెంపకంపై అధ్యయనం చేయనున్నారు. వాస్తవానికి అక్టోబర్‌ 23నే ఈ ప్రయోగం జరుగాల్సి ఉండగా.. వాతావరణ పరిస్థితులు, వ్యోమగాముల ఆరోగ్య పరిస్థితుల కారణంగా ఆలస్యమైంది. రాజాచారికి ఇదే తొలి అంతరిక్ష ప్రయాణం కావడం గమనార్హం.

రాజాచారి అమెరికా వైమానిక దళంలో ప్రస్తుతం కర్నల్‌ హోదాలో ఉన్నారు. 1977లో జన్మించారు. విస్కాన్సిన్‌లోని మిల్వాకీలో ప్రాథమిక విద్య పూర్తిచేశారు. యూఎస్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో ఆస్ట్రోనాటికల్‌ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎంఐటీ)లో ఆస్ట్రోనాటిక్స్‌, ఏరోనాటిక్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ పొందారు. యూఎస్‌ నావల్‌ టెస్ట్‌ పైలట్‌ స్కూల్‌లో శిక్షణ పొందారు. 2017లో నాసా ఆస్ట్రోనాట్‌ క్యాండిడేట్‌ క్లాస్‌కు ఎంపికయ్యారు. ఇదిలా ఉండగా, చందమామపై అన్వేషణ కోసం నాసా చేపడుతున్న ప్రతిష్టాత్మక ‘అర్టెమిస్‌’ మిషన్‌ కోసం 18 మంది వ్యోమగాములను ఎంపిక చేసింది. అందులో రాజాచారి ఒకరు. అన్నీ సవ్యంగా జరిగితే 2024లో రాజాచారి జాబిల్లిపై కాలుమోపే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Raja Chari  Indian-origin astronaut  News  NASA mission  Crew 3  SpaceX  science news  

Other Articles