TN BJP chief's photoshoot in the midst of Chennai floods తమిళనాడు బీజేపి అధ్యక్షుడి అత్యుత్సాహంపై నెటిజనుల విమర్శలు

Tn bjp chief annamalai s photoshoot in the midst of chennai floods sparks outrage on twitter

K. Annamalai, Tamil Nadu BJP chief, Twitterverse, Kolathur, flood situation, Photo op, Karu Nagarajan, viral video, Social media, Tamil Nadu, Politics

A recent video of K. Annamalai, the Tamil Nadu BJP chief has become the talk of the Twitterverse; giving rise to yet another controversy after the BJP chief went to Kolathur to assess the flood situation, but ended up being slammed for staging a photo op.

ITEMVIDEOS: తమిళనాడు బీజేపి అధ్యక్షుడి అత్యుత్సాహంపై నెటిజనుల విమర్శలు

Posted: 11/10/2021 03:07 PM IST
Tn bjp chief annamalai s photoshoot in the midst of chennai floods sparks outrage on twitter

తమిళనాడు రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు కె.అన్నామలయ్ మరోమారు నెట్ జనుల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కోంటున్నారు. ఇటీవల ఆయన పోస్టు చేసిన వీడియో నెట్టి జనుల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కోంగా తాజాగా మరోక అలాంటి వీడియోనే పోస్టు చేసి విమర్శలపాలయ్యారు. ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు రాజధాని చెన్నై సహా పరిసర ప్రాంతాల్లోని 14 జిల్లాల్లోని లొతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయం అయ్యాయి. దీంతో అక్కడ పూర్తిగా జనజీవనం స్థంభించింది. అయితే వారిని పరామర్శించడానికి బీజేపి అధ్యక్షుడు కె.అన్నామలయ్ పర్యటించారు.

అదేంటి వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి.. అక్కడి స్థానికులను కలసి వారి బాధలను తెలుసుకోవడంలో తప్పేముంది. అంటారా.? అంతవరకు బాగానే వున్నా..ఆయన పోస్టు చేసిన వీడియోతోనే అసలు సమస్య వచ్చిపడింది. తనతో పాటు తన సహచర బీజేపి నాయకుడు కారు నాగరాజన్ మొకాళ్ల లోతు నీళ్లలో ఓ బోటులో పర్యటిస్తూ.. తమ ముందు వెళ్తున్న బీజేపి కార్యకర్తలను పక్కకు జరగమని చెప్పడం.. అదే సమయంలో ఫోటో గ్రాఫర్ కూడా వెనక బ్యాక్ గ్రౌండ్ ఎలా రావాలో సూచనలు చేయడం వీడియోలో వినిపించింది. వరదముంపులో చిక్కకున్న కొలాత్తూర్ ప్రాంతంలో ఆయన పర్యటించారు.

ఈ వీడియో ట్విట్టర్ లో పోస్టుచేయడంతో అందులో ఆయన ఇస్తున్న సూచనలు.. తన సహచరుడు ఇస్తున్న సూచనలు విన్న నెటిజనులు వారిని సామాజిక మాద్యమ వేదికగానే తీవ్రంగా విమర్శిస్తున్నారు. నీళ్లలో ఉండలేక.. వాటిని వదిలి బయటకు రాలేక స్థానిక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతుంటే.. మీకు ఆటలుగా వుందా.? అంటూ నెటిజనులుబీజేపి రాష్ట్ర అధ్యక్షుడిని విమర్శిస్తున్నారు. మీరు ప్రజల కోసం కాకుండా కేవలం ఫోటోలకు ఫోజులిచ్చేందుకు మాత్రమే ఈ వరదముంపు ప్రాంతాలను ఎంపిక చేసుకున్నారా.? అంటూ మరికొందరు నిలదీస్తున్నారు. రాజకీయ నేతలుగా కొనసాగుతూ.. ప్రజల కోసం పాటుపడాలి కానీ.. ఫోటోల కోసం సూచనలు ఇచ్చే నాయకులు మీరేనంటూ ఇంకోందరు ట్రోల్ చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles