CJP Inaugurates Rebuilt Hindu Temple in Pakistan అక్కడి హిందువులకు పాకిస్థాన్ సీజే అండ.. ఆలయంలో పూజలు

Pakistan chief justice gulzar ahmed inaugurates rebuilt hindu temple in karak

Chief Justice of Pakistan, CJP Gulzar Ahmed, Justice Gulzar inaugurates HIndu Temple, Hindu temple pakistan, Hindu temple demolished, Hindu Temple rebuilt, CJP inaugurates Hindu temple, Supreme Court, protect the rights of minorities, Gulzar Ahmed, Hindu Temple Inauguration, Shri Param Hans Ji Maharaj temple, Karak, Pakistan, Minorities, Supreme court

Chief Justice of Pakistan (CJP) Gulzar Ahmed inaugurated the rebuilt Shri Param Hans Ji Maharaj temple in Karak, Khyber-Pakhtunkhwa (KP) which was attacked and completely destroyed last year, on the occasion of Diwali and felicitated the community on the festive occasion

అక్కడి హిందువులకు పాకిస్థాన్ ప్రధాన న్యాయమూర్తి అండ.. ఆలయంలో ప్రత్యేక పూజలు

Posted: 11/10/2021 12:37 PM IST
Pakistan chief justice gulzar ahmed inaugurates rebuilt hindu temple in karak

పాకిస్థాన్ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అనునిత్యం మైనారిటీల హక్కుల పరిరక్షణ కోసం పాటుపడుతోందని పాకిస్తాన్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గుల్జార్ అహ్మద్ అన్నారు. పాకిస్థాన్ లో హిందువులు, హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై చర్యలు తీసుకుంటామన్న ఆయన.. హిందువులకు పాకిస్థాన్ అత్యున్నత న్యాయస్థానం నిత్యం అండగా నిలుస్తుందని భరోసా కల్పించారు. రాజ్యాంగపరంగా దేశంలోని మూనారిటీలకు లభించే స్వేచ్ఛ, హక్కులు హిందువులకు కూడా ఉంటాయని పేర్కొన్నారు. మందిరాలను ధ్వంసం చేసే హక్కు ఎవరికీ లేదని జస్టిస్ గుల్జార్ అన్నారు.

పాక్ లోని హిందూ ఆలయంపై గత ఏడాది దీపావళి సమయంలో జరిగిన దాడిలో పూర్తిగా ధ్వంసమైన ఆలయాన్ని ఈ దీపావళి సమయానికి పునఃనిర్మాణం చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిధిగా హాజరై ఆలయన్ని ప్రారంభించడంతో పాటు ఆలయంలో ప్రత్యేక పూజలను కూడా నిర్వహించారు. కరాక్ జిల్లా తేరి గ్రామంలోని శ్రీ పరమ హన్స్ జీ మహారాజ్ ప్రాచీన దేవాలయంపై గతేడాది డిసెంబరులో కొందరు దుండగులు దాడిచేసి ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై అప్పట్లో భారతీయ సమాజం నుంచే కాక అంతర్జాతీయ సమాజం నుంచి కూడా తీవ్ర ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి.

పాక్ ప్రధాన న్యాయమూర్తి కూడా ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఆలయాన్ని పునర్నిర్మించాలని స్థానిక ప్రభుత్వాన్ని ఆదేశించారు. అంతేకాదు, అందుకయ్యే ఖర్చును నిందితుల నుంచే వసూలు చేయాలని ఆదేశించారు. చీఫ్ జస్టిస్ ఆదేశాలతో ఆలయాన్ని పునర్నిర్మించారు. నిర్మాణ పనులు పూర్తికావడంతో దీపావళి రోజున ఆలయాన్ని పునఃప్రారంభించారు. స్థానిక హిందువులు పెద్ద ఎత్తున హాజరై వైభవంగా వేడుక నిర్వహించారు. నాడు ఆలయ నిర్మాణానికి ఆదేశాలిచ్చిన సీజే జస్టిస్ గుల్జార్ అహ్మద్ ఆలయ ప్రారంభోత్సంలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేసి దీపావళి పండుగ జరుపుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles